గ్రహం అనుగ్రహం (03-01-2017)

3 Jan, 2017 00:14 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (03-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు పుష్యమాసం,
తిథి శు.పంచమి ప.1.32 వరకు, తదుపరి షష్ఠి,
నక్షత్రం శతభిషం ప.3.43 వరకు, తదుపరి పూర్వాభాద్ర,
వర్జ్యం రా.9.58 నుంచి 11.34 వరకు
దుర్ముహూర్తం ఉ.8.44 నుంచి 9.28 వరకు,
తదుపరి రా.10.45 నుంచి 11.38 వరకు,
అమృతఘడియలు ఉ.5.24 నుంచి 7.00వరకు
 

సూర్యోదయం       :  6.33
సూర్యాస్తమయం   :  5.42
రాహుకాలం        :   ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం       : ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం

మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.

వృషభం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. పాతమిత్రుల కలయిక. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ తప్పదు. మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలలో అవరోధాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. కార్యసిద్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

తుల: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కుంభం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మీనం: మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. రాబడి నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి.
– సింహంభట్ల సుబ్బారావు
 

మరిన్ని వార్తలు