గ్రహం అనుగ్రహం (11-01-2017)

11 Jan, 2017 00:55 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (11-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం
హేమంత ఋతువు, పుష్యమాసం,
తిథి శు.చతుర్దశి రా.7.34 వరకు
నక్షత్రం ఆరుద్ర రా.3.14 వరకు,
వర్జ్యం ప.1.07 నుంచి 2.39 వరకు
దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.28 వరకు
అమృతఘడియలు రా.6.24 నుంచి 7.54 వరకు


సూర్యోదయం     :  6.35
సూర్యాస్తమయం :  5.46
రాహుకాలం      :  ప 12.00 నుంచి 1.30 వరకు
యమగండం     :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం:
పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. నిర్ణయాలలో యుక్తితో మెలగడం మంచిది.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు చికాకులు.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మిథునం: రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు.

కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు.

తుల: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో ఆదరణ.

ధనుస్సు: ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు