గ్రహం అనుగ్రహం (12-01-2017)

12 Jan, 2017 00:01 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (12-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు పుష్యమాసం,
తిథి పౌర్ణమి సా.5.45 వరకు, తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం పునర్వసు రా.2.36 వరకు,
వర్జ్యం సా.2.55 నుంచి 4.29 వరకు
దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.00 వరకు,
తదుపరి ప.2.41 నుంచి 2.25 వరకు,
అమృతఘడియలు...రా.12.23 నుంచి 1.55 వరకు

సూర్యోదయం     :  6.35
సూర్యాస్తమయం : 5.47
రాహుకాలం      :  ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం     : ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం

మేషం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.  అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

వృషభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు రాగలవు. ఆస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: వ్యవహారాలు ముందుకు సాగవు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

సింహం: చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో వివాదాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

తుల: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వ్యాపార,ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలలో అనుకోని ప్రగతి.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. రాబడి కంటే ఖర్చులు అధికం. భూవివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు,ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మీనం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు