గ్రహం అనుగ్రహం (14-01-2017)

14 Jan, 2017 00:09 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (14-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం,
హేమంత ఋతువు పుష్యమాసం,
తిథి విదియ ప.3.01 వరకు, తదుపరి తదియ,
నక్షత్రం ఆశ్లేష రా.1.24 వరకు,
వర్జ్యం ప.2.25 నుంచి 3.59 వరకు,
దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.03 వరకు,
అమృతఘడియలు... రా.11.10 నుంచి 12.45 వరకు, మకర సంక్రాంతి

సూర్యోదయం      :    6.36
సూర్యాస్తమయం  :    5.48
రాహుకాలం       :   ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం      :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం

మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆస్తి లాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: పనులు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు రాగలవు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

తుల: రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. బంధువర్గంతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి  ఉంటుంది.

కుంభం: భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.

మీనం: రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు. పనులు వాయిదా. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. – సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు