గ్రహం అనుగ్రహం (27-12-2016)

27 Dec, 2016 00:33 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (27-12-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు మార్గశిర మాసం,
తిథి బ.త్రయోదశి ఉ.8.11 వరకు,
తదుపరి చతుర్దశి నక్షత్రం అనూరాధ ఉ.6.58 వరకు,
తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ప.1.01 నుంచి 2.46 వరకు
దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.40 వరకు,
తదుపరి రా.10.52 నుంచి 11.44 వరకు,
అమృతఘడియలు రా.11.37 నుంచి 1.24 వరకు

సూర్యోదయం       :  6.30
సూర్యాస్తమయం   :  5.37
రాహుకాలం        :   ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం       :  ఉ.9.00 నుంచి 10.30 వరకు


భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార,ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మిథునం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు.

సింహం: మిత్రులు,బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కన్య: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. పనులు మందకొడిగా కొనసాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. వ్యాపా రాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: సోదరుల ద్వారా శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయా ణాలు. కుటుంబసమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు