గ్రహం అనుగ్రహం (29-12-2016)

29 Dec, 2016 00:08 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (29-12-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు మార్గశిర మాసం,
తిథి అమావాస్య ప.11.58 వరకు,
తదుపరి పుష్య శు.పాడ్యమి
నక్షత్రం మూల ఉ.11.30 వరకు,
తదుపరి పూర్వాషాఢ,
వర్జ్యం రా.9.49 నుంచి 11.30 వరకు,
దుర్ముహూర్తం ఉ.10.10 నుంచి 11.54 వరకు,
తదుపరి ప.2.34 నుంచి 3.19 వరకు,
అమృతఘడియలు ఉ.4.30 నుంచి 6.17 వరకు



సూర్యోదయం      :  6.31
సూర్యాస్తమయం  :  5.39
రాహుకాలం       :  ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం      :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం

మేషం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వృత్తి,వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

వృషభం: మిత్రులతో అకారణ వైరం. వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

సింహం: పనుల్లో జాప్యం.ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో నిరాశ.

కన్య: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

తుల: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.

ధనుస్సు: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. బంధుమిత్రులతో కలహాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వాహన యోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. బంధువుల కలయిక. యత్నకార్యసిద్ధి. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రగతిదాయకంగా ఉంటుంది.

– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు