గ్రహం అనుగ్రహం, గురువారం 6, ఆగస్టు 2015

6 Aug, 2015 01:03 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, గురువారం 6, ఆగస్టు 2015

 శ్రీ మన్మథనామ సంవత్సరం,  దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
 నిజ ఆషాఢ మాసం
 తిథి బ.సప్తమి రా.12.56 వరకు
 నక్షత్రం అశ్వని రా.12.38 వరకు
 వర్జ్యం రా.8.49 నుంచి 10.20 వరకు
 దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.50 వరకు
 తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు
 అమృతఘడియలు సా.5.50 నుంచి 7.19వరకు
 సూర్యోదయం:    5.43 సూర్యాస్తమయం:     6.28
 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
 యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
 మేషం: కొత్త విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 వృషభం: మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులుండొచ్చు. రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
 మిథునం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వస్తు లాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.
 కర్కాటకం: ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
 సింహం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చిక్కులు.
 కన్య: బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
 తుల: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.
 వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. రుణ యత్నాలు. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  కొంత గందగోళం.
 మకరం: వ్యయప్రయాసలు. ధన వ్యయం. కుటుంబ సభ్యులతో వైరం కలగవచ్చు. అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి.
 కుంభం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లాభిస్తాయి.
 మీనం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. వృథా ఖర్చులు. ఆరోగ్య భంగం కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
- సింహంభట్ల సుబ్బారావు

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు