గ్రహం అనుగ్రహం, గురువారం 5, మే 2016

5 May, 2016 02:15 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, గురువారం 5, మే 2016

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం,
తిథి బ.త్రయోదశి ఉ.6.30 వరకు,
తదుపరి చతుర్దశి తె.4.01 వరకు(తెల్లవారితే శుక్రవారం),
నక్షత్రం రేవతి ఉ.11.50 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం..లేదు
దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.37 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు
అమృతఘడియలు ఉ.9.34 నుంచి11.05 వరకు
సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం:     6.17
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు

 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొంత నిరుత్సాహం.

వృషభం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మిథునం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

ధనుస్సు: రాబడి కంటే ఖర్చులు పెరుగు తాయి. శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు.  బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు.

మకరం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. దూరపు బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.

కుంభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొత్త బాధ్యతలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

మరిన్ని వార్తలు