గ్రహం అనుగ్రహం, గురువారం 8, అక్టోబర్ 2015

8 Oct, 2015 00:58 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, గురువారం 8, అక్టోబర్ 2015

శ్రీమన్మథనామ సంవత్సరం,  దక్షిణాయనం
 వర్ష ఋతువు, భాద్రపద మాసం
 తిథి బ.ఏకాదశి రా.8.40 వరకు
 నక్షత్రం ఆశ్లేష సా.4.04 వరకు
 తదుపరి మఖ, వర్జ్యం ..లేదు
 దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.41 వరకు
 తదుపరి ప.2.32 నుంచి 3.22 వరకు
 అమృతఘడియలు ప.2.17 నుంచి 3.58 వరకు
 సూర్యోదయం:    5.54
 సూర్యాస్తమయం:     5.42
 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
 యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
 
మేషం: ముఖ్యమైన పనులు వాయిదా. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
 
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
సింహం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. సోదరులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో చికాకులు.

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

 తుల: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
వృశ్చికం: బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
 
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
 
మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
కుంభం: కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు,ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మార్పులు.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా