గ్రహం అనుగ్రహం, గురువారం 29, సెప్టెంబర్ 2016

29 Sep, 2016 01:14 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, గురువారం 29, సెప్టెంబర్ 2016

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం, తిథి బ.చతుర్దశి తె.3.44 వరకు (తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం పుబ్బ రా.7.45 వరకు,
వర్జ్యం తె.3.25 నుంచి 5.07 వరకు (తెల్లవారితే శుక్రవారం),
దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.43 వరకు,
తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు,
అమృతఘడియలు ప.1.09 నుంచి 2.43 వరకు
సూర్యోదయం           :  5.53
సూర్యాస్తమయం           :  5.54
రాహుకాలం :  ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. దూరప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
 
వృషభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు.
 
మిథునం:
కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ వార్తలు. ధన, వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
 
కర్కాటకం:
వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
 
సింహం:
నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి.  శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
 
కన్య: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధుమిత్రులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
 
తుల:
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవ చింతన. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
 
వృశ్చికం: నిరుద్యోగుల యత్నాలు సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
 
ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయా ణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
మకరం: వ్యవహారాలు నత్తనడ కన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
 
కుంభం:
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు