గ్రహం అనుగ్రహం, సోమవారం 8, జూన్ 2015

8 Jun, 2015 00:43 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, సోమవారం 8, జూన్ 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.షష్ఠి ప.1.21 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ధనిష్ఠ సా.4.17 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రా.11.01 నుంచి 12.31 వరకు, దుర్ముహూర్తం ప.12.23 నుంచి 1.13 వరకు, తదుపరి ప.3.01 నుంచి 3.50 వరకు, అమృతఘడియలు ఉ.6.30 నుంచి 8.01 వరకు
  సూర్యోదయం    :    5.28
 సూర్యాస్తమయం    :    6.28
 రాహుకాలం:
 ప.7.30 నుంచి
 9.00 వరకు
 యమగండం:
 ఉ.10.30 నుంచి
 12.00 వరకు

భవిష్యం
 మేషం: ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 వృషభం:కొత్త ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవ హారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
 కర్కాటకం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
 సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు,వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
 కన్య: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు. దైవదర్శనాలు. పనులు చకచకా సాగుతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదా.
 తుల: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.
 వృశ్చికం: పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
 మకరం: కుటుంబసభ్యులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు.
 మీనం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార విస్తరణలో చికాకులు. ఉద్యోగులకు పనిభారం.
 - సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు