గ్రహం అనుగ్రహం శుక్రవారం 5, జూన్ 2015

5 Jun, 2015 01:07 IST|Sakshi
గ్రహం అనుగ్రహం శుక్రవారం 5, జూన్ 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.తదియ రా.6.54 వరకు, నక్షత్రం పూర్వాషాఢ రా.7.35 వరకు, వర్జ్యం ఉ.5.30 నుంచి 7.03 వరకు, తిరిగి రా.3.20 నుంచి 4.54 వరకు (తెల్లవారితే శనివారం)
 దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు
 అమృతఘడియలు ప.2.54 నుంచి 4.29 వరకు
 సూర్యోదయం    :    5.28
 సూర్యాస్తమయం    :    6.27
 రాహుకాలం:
 ఉ.10.30 నుంచి
 12.00 వరకు
 యమగండం:
 ప.3.00 నుంచి
 4.30 వరకు

భవిష్యం
మేషం: రహస్య విషయాలు గ్రహిస్తారు. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరుత్సాహం.
వృషభం: మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి.  ఆరోగ్య భంగం. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు. వ్యాపారాలు  లాభించవు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
మిథునం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు. ఉద్యోగులు ఉన్నత హోదాలు అందుకుంటారు.
కర్కాటకం: సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం. నూతనోత్సాహంతో ముందడుగేసి విజయాలు సాధిస్తారు.  ఉద్యోగులకు ఉన్నతస్థితి.
సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యయ ప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు.
కన్య: రాబడి అంతగా కనిపించదు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇంటాబయటా గందరగోళ పరిస్థితి. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి.
వృశ్చికం: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనుల్లో అవాంతరాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి, ధన లాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాల్లో నూతనోత్సాహం. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
మకరం: ఆలోచనలు నిలకడగా ఉండవు.  కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
కుంభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం.
మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు