వేద సంరక్షణ

7 May, 2014 23:58 IST|Sakshi
వేద సంరక్షణ

మానవజాతికి వేదాలు వెలలేని నిధి. అవి మానవజాతి కర్తవ్య పాలనను మాత్రమే కాదు మోక్షసాధన మార్గాలను కూడా సూచించాయి. ఈనాటికీ మానవజాతికి సకల విధాల ఉపయోగపడగల వేదాలను సంరక్షించడం మన కర్తవ్యం, బాధ్యత. నిరంతర శిక్షణ, సాధన, బోధనవంటి మార్గాల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకప్పుడు వేదాలు గురుకులాల్లో బోధించేవారు. నేర్చుకునేవారి లోనూ, నేర్పేవారిలోనూ కూడా అంకితభావం ఉం డేది. అక్కడ ఉండే గురుశిష్య సంబంధం అలాంటి అంకితభావాన్ని కలగజేసేది. ఈనాటికీ ఆ తరహా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ వారి సంఖ్య అరుదుగా ఉంటున్నది. చక్కని వేద విద్య అధ్యయనం చేసిన అధ్యాపకుల లేమి వలన వేద విద్యా విధానమే కుంటినడక నడుస్తున్నది. ఇది ఇలాగే మరికొంత కాలం కొనసాగితే మన వేదాలనూ, వాటి బోధనలనూ, సాధన లనూ మనం శాశ్వతంగా కోల్పోయే ప్రమా దం ఉన్నది. వేదాలను ఇలా చేజేతులా నాశనం చేసుకుంటే మానవజాతికి మిగి లేది వినాశనమే.
 
 దూరమైపోతున్న వేదాలను మనందరి దగ్గరకు చేర్చి, వాటిని సంరక్షించే మహత్తర కార్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో వేద పాఠశాలలు నెలకొల్పుతు న్నది. ముఖ్యంగా ధర్మగిరిలో వేద పాఠశాల ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో నిర్మించారు. అక్కడ 650మంది విద్యార్థులతో, 20 మంది అధ్యాప కులతో వేద విద్యాబోధన చక్కగా సాగుతున్నది. నాలుగు వేదాలు, వేదాంగాలు, ఆగమాలు బోధిస్తు న్నారు. ఇది దేశంలోనే పెద్ద పాఠశాల. బహుశా మొదటి స్థానంలోనో, రెండో స్థానంలోనో ఉంటుంది. వేద పాఠశాలల అభివృద్ధికి భవిష్య త్తులో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది.
 
 ధార్మిక విధివిధానాలు, ప్రస్తుత సాధనా విధానాలు, వేదాల సంరక్షణకు తీసుకునే చర్యల్లో ఏర్పడే అడ్డంకులు, వాటిని అధిగమించే మార్గాలు వగైరా అంశాలను ఈ కమిటీ పరిశీలించింది. మన రాష్ట్రంలోనూ, పొరుగునున్న కర్ణాటకలోనూ సమర్థవంతంగా నడుస్తున్న శృంగేరీ వేదపాఠశాల, శ్రీశ్రీ రవిశంకర్ గురుకులం, పరాశర గురుకులం, హైదరాబాద్ లోని వేద భవనం వగైరాలను ఈ కమిటీలో భాగస్వామిగా నేను కూడా పరిశీలించాను. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇ-లైబ్రరీ, దూరవిద్యవంటి పద్ధతుల ద్వారా వేద విద్యను వ్యాపింపజేయడానికి అవసరమైన మార్గా లను ఇండియా హెరిటేజ్ గ్రూపువారి సమావేశంలో చర్చించాము. అందులో అనేక విలువైన సూచనలు కూడా వచ్చాయి. వేదాధ్యయనంపై ఆసక్తి ఉన్నవారె వరైనా తాము ఉన్నచోటునుంచే ఇలాంటి మాధ్య మాల ద్వారా వేద విద్యను అధ్యయనం చేయవచ్చు.
 
 ఈ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కివచ్చి భారతీయ సంస్కృతి వైభవం మళ్లీ వెలుగులీనేలా చేయడానికి తోడ్పడితే అంతకన్నా కావలసిందేముంటుంది? టీటీడీ పాఠశాలల నుంచి వెలుపలకు వచ్చే విద్యార్థు లు అత్యున్నత మానవ విలువలను, మత పరమైన విలువలను పాటించి ధార్మిక మార్గంలో నడు స్తారు. ఈ పాఠశాలలు అందుకవసరమైన మార్గద ర్శకత్వాన్ని అందిస్తున్నాయి. దేశానికి చక్కటి వర్తమానాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందజేసే ఈ మహత్తర కార్యం విజయవంతం కావాలని కోరుకుందాం.
 - సౌందర్‌రాజన్
 చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు

మరిన్ని వార్తలు