‘మహా ఒప్పందం’ చారిత్రక నేరం

28 Sep, 2016 01:10 IST|Sakshi
‘మహా ఒప్పందం’ చారిత్రక నేరం

నాగార్జునసాగర్‌ను 20-25 కిలోమీటర్ల దిగువన కట్టి అన్యాయం చేశారని అంటున్నారు. నేడు తుమ్మిడిహెట్టి నుండి ప్రధాన ప్రాజెక్టును 130 కిలోమీటర్ల దిగువకు, మేడిగడ్డకు తరలించడంవల్ల అదే అన్యాయం తెలంగాణకంతటికీ జరగడం లేదా?
 
మహారాష్ర్ట, తెలంగాణ సరిహద్దు నదులపై ఉమ్మడి ప్రాజెక్టుల ప్రతిపాదనలు,  ఒప్పందాలు కొత్తేమీ కాదు. సరిహద్దు ల్లోని ఏ నదిపైనైనా కొత్త ప్రాజెక్టును నిర్మించాలంటే పొరుగు రాష్ర్టంతో ఒప్పందం చేసుకోవల సిందే. ప్రాణహితను రీడిజైన్ చేసి, మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలను నిర్మించడం కోసం కొత్త రాష్ట్రమైన తెలంగాణ, మహారాష్ర్టతో సూత్రప్రాయంగా ఒప్పందం చేసు కోవాల్సి వచ్చింది. ఇందులో కొత్తదనమూ లేదు, కొత్తగా జరిగే మేలూ లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు ఇది ‘చారిత్రా త్మక’మూ కాదు, ‘సువర్ణ లిఖిత’మూ కాదు,‘మహా’ ఒప్పందం అంతకంటే కాదు.

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మిస్తే తెలంగాణకు శాశ్వతంగా ఎనలేని మేలు జరుగుతుంది. తద్వారా మహారాష్ర్టలో ముంపు సైతం 1,852 ఎకరాలే. 80 కిలోమీటర్ల దూరం పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీరు పల్లానికి పారు తుంది. ఇదే కాలువను సుందిళ్ల వద్ద గోదావరికి అనుసం ధానం చేయవచ్చని విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ హను మంతరావు స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగమూ, ఖర్చూ భారీగా తగ్గుతాయి. కానీ తాజా ఒప్పందంలో దాని ఎత్తును 4 మీటర్లు తగ్గించి, 148 మీటర్లకు కుదించడం వల్ల తెలంగాణ మెడకు అది గుదిబండ అవుతుంది. తుమ్మిడి హెట్టి ఎత్తు తగ్గింపునకు అంగీకరించి తెలంగాణ ప్రయోజ నాలను మహారాష్ర్టకు తాకట్టు పెట్టారని స్పష్టమౌతోంది.
 
 అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లి ఈ విషయంలో మహారాష్ట్ర సీఎంను ఒప్పించాలని ప్రజలు, రైతు సంఘాలు, పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా సీఎం కేసీఆర్ లెక్కచేయలేదు. ఆయన ఏకపక్ష ధోరణితో తెలంగాణలోని ఏకైక భారీ గ్రావిటీ ప్రాజెక్టు త్రిశంకు స్వర్గానికి చేరింది. అల్ప విద్యుత్ వినియోగంతో పర్యావరణానికి మేలును కలుగజేసే, అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ అంతటికి నీరందుతుంది. కేసీఆర్ నిర్మిస్తా   నంటున్న రీడిజైన్ చేసిన మేడిగడ్డ సహా మూడు బ్యారే జీలూ ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతలు.
 
 రాష్ట్ర సాధనలో ప్రదర్శించిన చతురతను తెలంగాణ... తుమ్మిడిహెట్టికి 4 మీటర్ల ఎత్తును సాధించడంలో ప్రదర్శించలేకపోవడం బాధాకరం. గతంలోని ప్రాణహిత-చేవెళ్ల వ్యయం రూ. 38,500 కోట్లు కాగా మేడిగడ్డ ఖర్చు రూ. 83 వేల కోట్లు. రూ. 25వేల కోట్ల వ్యయం తగ్గేలా ప్రత్యామ్నాయాన్ని కూడా హనుమంతరావు సూచించారు. తెలంగాణకు ప్రాణ హిత, ఇంద్రావతి తప్ప గతిలేదంటూనే తుమ్మిడిహెట్టిని ఎందుకు బలిపెడుతున్నారు? ఇది‘చారిత్రాత్మక ఒప్పం దం’ కాదు, చారిత్రాత్మక నేరం.
 
 నాగార్జునసాగర్‌ను 20 నుంచి 25 కిలోమీటర్ల దిగు వన కట్టి నల్గొండకు అన్యాయం చేశారని తెలంగాణ గొంతెత్తుతోంది. నేడు తెలంగాణ ప్రభుత్వమే తుమ్మిడి హెట్టి నుండి ప్రధాన ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించి 130 కిలోమీటర్ల దిగువన ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం వల్ల అదే అన్యాయం తెలంగాణకంతటికీ జరగడం లేదా? మేడిగడ్డ తెలంగాణ ఆర్థికవ్యవస్థకు శాశ్వత భారం. ఏటా వేల కోట్ల నిర్వహణా వ్యయాన్ని మోపుతుంది.

తద్వారా అది రాష్ట్ర సాగునీటి వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టేయదా? రూ. 25 వేల కోట్ల వ్యయాన్ని తగ్గించే హన్మంతరావు పథకం ప్రకారం తుమ్మిడి హెట్టిని 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే, గ్రావిటీ పారకంతో పైసా ఖర్చులేకుండా 1,20, 160 టీఎంసీల  నీటిని 80 కిలోమీటర్లు, సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించవచ్చు. మేడిగడ్డ ద్వారా ఇలా ఒక్క అడుగైనా కరెంటు ఖర్చులేకుండా గ్రావిటీతో పారించ గలమా? ఇంత విలువైన దీన్ని అప్రధానమైనదిగా ఎందుకు మారుస్తున్నారు? మొత్తం 7,080 మీటర్లూ ఎత్తిపోతలపైనే ఆధారపడిన మేడిగడ్డను ఎందుకు తెలం గాణ జనులపై రుద్దుతున్నారు?
 
 తుమ్మిడిహెట్టిలో నీటిలభ్యత లేకనే మేడిగడ్డకు మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. తుమ్మిడిహెట్టి వద్ద 1,140 టీఎంసీల లభ్యత ఉందని అసెంబ్లీలో స్వయంగా సీఎం ప్రకటించారు. తీవ్ర కరువు నెలకొన్న 2015-16లో సైతం ప్రాణహిత నుండి 1,470 టీఎంసీల నీరు కాళేశ్వరం వద్ద గోదావరి నుంచి సముద్రంలో కలిసిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోతే ఇన్ని నీళ్లు కాళేశ్వరంకు ఎక్కడినుంచి వచ్చాయి? ప్రాణ హిత లేకుండా మేడిగడ్డ బ్యారేజీ ఊహకైనా అందు తుందా? నీటి లభ్యత ఎంత అనేది మాత్రమే ప్రధానం కాదు. సముద్రానికి సమీపాన అంతర్వేదిలో అనేక రెట్లు నీరుందని తరలిస్తే ప్రకృతి అంగీకరిస్తుందా? నీటి పారకానికి ఎంత ఖర్చు పెట్టాల్సివస్తోంది అనేదే కీలకం.’ తుమ్మిడిహెట్టి ఎగువ నుంచి వచ్చే మహావరదతో పోలిస్తే దిగువది అతి స్వల్పం.
 
 ప్రాణహిత ఇరువైపుల వరదను పరిశీలిస్తే తుమ్మిడిహెట్టి వద్ద వచ్చే వరదే ప్రధానంగా కాళేశ్వరానికి చేరేదనేది స్పష్టమే. 2004లో చేపట్టిన ‘‘గోదావరి వాటర్ స్టడీస్’’ సర్వే ప్రకారం కూడా తుమ్మిడిహెట్టి వద్ద 273 టీఎంసీల నీరు లభిస్తుంది. కమీషన్ల కోసమే అన్ని సర్వేలను తలకిందులు చేసి మేడిగడ్డకు మార్చుతున్నారని అనుకోకతప్పదు.

తుమ్మిడి హెట్టి వద్ద ధవళేశ్వరంకు వెళ్లే నీళ్లకు అంతర్రాష్ట్ర వివాదాల పీటముడులు వేశారనేది అబద్ధం. ఎత్తున ఉన్న తెలం గాణలో గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ధవ ళేశ్వరానికి పోయే నీళ్లను ఎవరూ ఆపలేరు. ప్రాణహిత తీరంలో ఒక్క తుమ్మిడిహెట్టి వద్ద మాత్రమే భారీ గ్రావిటీ పారకం సాధ్యం.  
 వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకులు
 - నైనాల గోవర్ధన్
 మొబైల్ : 9701381799

మరిన్ని వార్తలు