మద్యం మత్తులో ముంచి సంక్షేమం సాధిస్తారా?

1 Jul, 2015 00:33 IST|Sakshi
- రాధ (వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శి, చైతన్య మహిళా సంఘం), మొబైల్: 94920 64404

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1 నుండి నూతన ఎక్సైజ్ పాలసీని అనుసరించి మ ద్యం షాపులు ప్రారంభ మవుతున్నాయి. ప్రతియే టా ప్రభుత్వాలు మద్యం తయారీ డిస్టలరీ కంపెనీ లు, మద్యం షాపులు, బా ర్‌లు, రెస్టారెంట్‌లు, క్లబ్ లు, పబ్‌లు, రిసార్టులను పెంచుతూ అనుమతులు ఇస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 నిబంధన ప్రకారం మద్యాన్ని నిషేధించాలి. ఈ నిబంధన అమలులో భాగంగానే ఎక్సైజ్‌శాఖను స్థాపించారు. కానీ ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖ మద్యం అమ్మకాలను పెంచి ఆదాయాన్ని సమకూర్చే శాఖగా మారిపో యింది. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, ప్రభుత్వం నడవాలన్నా మ ద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానం అంటున్నారు. పేద ప్రజలారా! మీరు తాగితేనే మీ కుటుంబానికి బియ్యం, మీ ఊరికి రోడ్లు, మీ పిల్ల లకు స్కాలర్‌షిప్‌లు, మీరు తాగి చస్తేనే దేశానికి, రాష్ట్రానికి ఆదాయం అంటున్నారు పాలకులు.
 
 వాస్తవానికి మద్య నిషేధాన్ని అమలు చేస్తేనే ప్రజల దగ్గర కొంత డబ్బు మిగులుతుంది. అది పొ దుపు మొత్తాల ద్వారా, మార్కెట్ ద్వారా ప్రభుత్వం దగ్గరికే వస్తుంది. బడా పారిశ్రామికవేత్తలు, వర్తకు లు, సినీ తారలు ఎగ్గొట్టే పన్నులు వసూళ్లు చేస్తే, మంత్రులు చేసే స్కాములను నియంత్రిస్తే, మల్టీ నేషనల్ కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడం మానేస్తే, విలువైన అటవీ సంపదను అతి తక్కువ ధరకు లీజు కు ఇవ్వటం నిలిపివేస్తే, స్విస్ బ్యాంకుల్లోని నల్లధ నాన్ని రప్పిస్తే... లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా దేశ సంపద తరలిపోవడాన్ని అరికడితే మనమే ప్రపంచ బ్యాంకుకు అప్పు ఇవ్వ వచ్చు. ఇలాంటి చర్యలు మన పాలకులు చేయరు. ఎందుకంటే వీటన్నిటిలో వీరికి భాగం ఉంటుంది.  బ్రిటిష్ వలసవాదులు మద్యపానాన్ని ఆదాయ వనరుగా మలిచారు. 1872లో మొదటిసారిగా దుకా ణాల వేలంపాటల పద్ధతిని ప్రవేశపెట్టారు. స్వాతం త్య్రోద్యమంలో మద్యనిషేధం కూడా ఒక నినాద మైంది. కానీ 1970 కల్లా దేశంలో అక్కడక్కడా ఉన్న మద్యనిషేధాన్ని కూడా ఎత్తివేశారు.
 
 మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 1980 ప్రాంతంలో ఎన్.టి.ఆర్. వారుణి వాహిని పేరుతో సారాను విస్తృతంగా పారించాడు. అదే కాలంలో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న కరీంనగర్, ఆది లాబాద్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మ కాలను నియంత్రించారు. చాలా మంది మద్యం వ్యాపారాన్ని మానుకున్నారు. దీంతో పోలీసు స్టేషన్లే సారా దుకాణాలయ్యాయి. 1991-94 మధ్య కాలం లో నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రభంజనంలా ముందుకొచ్చింది. చీపురు, కారం పొడి, నిప్పు మూడు ప్రధాన ఆయుధాలతో ఉద్య మాన్ని మహిళలు ముందుండి నడిపారు. ప్రతిప క్షంలో ఉన్న ఎన్‌టీఆర్ తనకు ఓటేస్తే సారా నిషేధిస్తా నని హామీ ఇచ్చాడు. మహిళల ఓట్లతో గెలిచిన ఎన్‌టీఆర్ సంవత్సర కాలం మద్యనిషేధాన్ని అమ లు చేశాడు. 1995లో ఎన్‌టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే సి గద్దెనెక్కిన చంద్రబాబు మద్యనిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలుకు మద్యం అమ్మకాలు తప్పనిసరి అని విస్తృ తంగా ప్రచారం చేసి మద్యనిషేధాన్ని ఎత్తేశాడు.
 
 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు బెల్టు షాపు లను రద్దు చేస్తానని హామీనిచ్చాడు. ప్రమాణ స్వీకా రం రోజు ఫైల్‌పై సంతకం కూడా చేశాడు. కానీ అదే నెలలో ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని రూ.12,000 కోట్లకు పెంచాలని టార్గెట్ నిర్ణయించాడు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటివరకు తెలుగు సమాజం మద్యనిషేధా నికి అనుకూలంగా పోరాడుతూనే వచ్చింది. ప్రస్తు తం భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతున్న ప్రజలు.. జనతన సర్కార్లను ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లో అక్కడి విప్లవ ప్రజాకమిటీలు సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బలమైన ఉద్యమాల ద్వారానే సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేసుకోగలుగుతాము. ఆ విధంగా ముందు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిద్దాం.

>
మరిన్ని వార్తలు