హైదరా‘బ్యాడ్’

9 Sep, 2015 00:43 IST|Sakshi

భాగ్యనగరంలో వర్షం వస్తోందంటే భయం! చినుకుపడితే చిత్తడి బడుగుజీవి బాధలు వర్ణనాతీతం. పట్టించుకునే నాథుడే ఉండడు. ఎక్కడ మ్యాన్‌హోల్ తెరిచి ఉందో? ఏ రకంగా కాటువేస్త్తుందో తెలియని పరిస్థితి! ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమై, ఇళ్లలోకి నీరు రావడం మామూలే! పేరుకు హైటెక్ సిటీ.. వర్షం పడితే పిటీ! దీనికి తోడు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. ఇది గత 15 ఏళ్ల నుంచి జరుగుతున్నా ఇంతవరకూ శాశ్వత ప్రాతిపదికన ఒక్క ప్రణాళికా రూపొందించలేని దౌర్భాగ్యంలో ఉన్నామంటే సిగ్గుపడాలి. అక్రమ నిర్మాణాలు, మ్యాన్ హోల్‌లో పూడిక తీయకపోవడం, నాలాల పక్కనే ఆక్రమణలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఇన్నీఅన్నీ కావు. మన భాగ్యనగరంలో అధికారి కంగా 1,475 మురికివాడలున్నాయి.
 
  అనధికారంగా 2,000 వరకూ ఉం టాయని అంచనా. ఈ మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడేది ఎప్పుడు? ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం అధికారులు హడావుడి చేయడం షరా మామూలే. పైగా ఒక ప్రజాప్రతినిధి, నగర పాలక సంస్థకు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా లేకపోవడం శోచ నీయం. క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ మాటలు బోర్డ్డులకే పరిమితం! ఆచరణలో మాత్రం శూన్యం. అధికారులు దీన్ని గుర్తించి నగరంలో నాలాలు, లోత ట్టు ప్రాంతాలపై దృష్టి సారించి సామాన్యుల గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- శొంఠి విశ్వనాథం  చిక్కడపల్లి, హైదరాబాద్ 20    
 

మరిన్ని వార్తలు