కోచింగ్ పేరిట సాగుతున్న ప్రైవేట్ దోపిడీ!

7 Jun, 2016 00:32 IST|Sakshi

తెలంగాణ ఆవిర్భావంతో నిరుద్యోగ యువత సంబరాలలో మునిగితేలారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్యాయాలు, అక్రమాలు, దోపిడీకి స్వస్తి పలికినట్ల యిందని భావిస్తూ తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వీరు ఉన్న ఊరిని వదిలి సర్కారీ కొలువుల కోసం పట్టణం బాట పట్టారు. తెలంగాణలో గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు వదిలి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌కు చేరుకున్నారు. ఈ నిరుద్యోగుల అవ సరాన్ని పసిగట్టిన మార్కెట్ శక్తులు కోచింగ్ పేరుతో భారీ స్థాయిలో లూఠీ మొదలెట్టాయి. ఉద్యోగ ప్రకట నలు రాకముందే, తెలంగాణ సిలబస్ సిద్ధం కాక ముందే బడా వ్యాపారులు భారీ ప్రకటనలతో మురి పించారు.

నిరుద్యోగులు ప్రభుత్వ కొలువు వస్తే మా జీవితాలు మారుతాయి అనుకున్నారు. కోచింగ్ సెంటర్ల ప్రకటనలు చూసి కుప్పతెప్పలుగా వచ్చి చేరారు. పొట్టకూటి కోసం అప్పటి వరకు చేసిన ప్రైవేట్ కొలువును మానేసిన వారు కొందరయితే మరికొందరు వారి ఆస్తిని సైతం అమ్మి కోచింగ్‌కు వెళ్లారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు సర్కార్ కొలువుల కోసం పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఒక్క నోటిఫికేషన్ రాకముందే. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పుల పాలయ్యారు. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించాల్సింది పోయి చోద్యం చూస్తోంది.

 తెలంగాణాలోని జిల్లా కేంద్రాలలో కూడా నేడు చిన్న చిన్న కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగులవలె పుట్టుకొస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే 500 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్లలో కనీస నియమ నిబంధనలు పాటించడం లేదు. కనీస మౌలిక సదుపాయాలు ఉండవు. 1982 విద్యా చట్టం ప్రకారం ప్రభుత్వ గుర్తింపులేని కోచింగ్ సెంటర్లపై చర్య తీసుకోవాలి. ప్రతి తర గతిలో 50 మందికి మించకూడదు. అర్హతగల వారిచే నిర్వహించాలి. ఫీజులను నియంత్రించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉద్యోగులను కోచింగ్ సెంటర్లలో పనిచేయనీయకూడదు. ప్రభుత్వ విద్యా ధికారులు అవినీతికి అలవాటుపడి కోచింగ్ సెంట ర్లను నియంత్రించడంలో విఫలమయ్యారు.
 

 ఈ కోచింగ్ సెంటర్లు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, కాలేజీలు, ఆడిటోరియాలు, పాత షాపింగ్ మాల్స్ లలో నిర్వహిస్తున్నారు. ఒక సెంటర్లో ఒక గ్రూప్‌లో 10 నుండి 15 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలా వీరు ఏక కాలంలో 4, 5 గ్రూపులు నిర్వహిస్తుం టారు. ఒక బ్యాచ్‌కి వెయ్యిమందిని కూర్చోబెడుతు న్నారు. కనీసం విద్యార్థులకు మరుగుదొడ్ల సౌక ర్యాలు కూడా లేవు. తరగతి గదిలో ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ కూడా ఉండవు. మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేకుండా నడుస్తున్నప్పటికీ ఒక్కొక్క కోచింగ్ సెంటర్‌లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

 కోచింగ్ సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులు

 టెట్ కమ్ డీఎస్సీ రూ. 12,000

 కానిస్టేబుల్  రూ.   8,000

 బ్యాంకింగ్    రూ. 15,000

 గ్రూప్-1 రూ. 30,000

 గ్రూప్-2 రూ. 18,000

 గ్రూప్-4 రూ. 15,000

ఇలా ఒక్కొక్క కోచింగ్ సెంటర్‌లో పైన తెలి పిన విధంగా వేల రూపాయలు వసూలు చేస్తు న్నారు. ప్రభుత్వాలు కనీసం ఈ ఫీజులనైనా నియం త్రించక పోవడం సిగ్గుచేటు. ఈ కోచింగ్ సెంటర్లలో ఒక్కో బ్యాచ్‌కు నిర్వహించే క్లాస్‌లు కేవలం 45 మాత్రమే, వాటికీ సమయపాలన ఉండదు. ఇప్పటి కైనా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల ఆగడాలకు అడ్డు కట్ట వేసి నియంత్రించాలి. డీఎస్సీ కోసం ప్రభుత్వం కొలువులు 17,500 ఉంటే 4 లక్షల మంది నిరు ద్యోగులు పోటీ పడుతున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4లలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ కోసం 1,50,000మంది, ఎస్.ఐ. పోస్టు లకు లక్షమంది, రెవెన్యూ వీఆర్వో, వీఆర్‌ఏ, ఫారెస్టు, సింగరేణిలో ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని 15 లక్షల మంది నిరుద్యోగులకు ఏమి హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చాలి. వెంటనే నిరు ద్యోగుల క్యాలెండర్‌ను విడుదల చేయాలి. కోచింగ్ సెంటర్లలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సెంటర్లలో పేద నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి. వీటి సంఖ్యను పెంచాలి. వీటి కోసం విడుదలైన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా అవినీతి ఆపాలి.

- తోట రాజేశ్, పీడీఎస్‌యూ నాయకులు

 మొబైల్ : 94401 95160

మరిన్ని వార్తలు