చిత్రసీమను వీడిన మరో తార

20 Feb, 2015 01:31 IST|Sakshi
చిత్రసీమను వీడిన మరో తార

ఇన్ బాక్స్
 రామానాయుడు మృతితో తెలుగు జాతి మరో తేజోపుంజాన్ని కోల్పోయినట్టయింది. ఆ లోటు పూడ్చలేనిది. నేనూ, శ్రీ రామా నాయుడుగారు 13వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ తరఫున మొద టిసారి ఎంపీలం. రాజకీయాలకు కొత్త. 1999 నుంచి ఐదేళ్లపాటు పార్లమెంటులో కలసి పనిచేశాం. ఆయన చిత్తశుద్ధి, పట్టుదల, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూడగలిగాం. సాధారణంగా వేరే రంగంలో అప్పటికే లబ్దప్రతిష్టులైన వారు చట్టసభల్లోకి వస్తే, మాతృ రంగా నికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రజాసేవకి ఇవ్వాలనుకోరు. అయితే ఆయన పార్లమెంటరీ విధివిధానాలు తెలుసుకోవడానికి కనపర్చిన ఆసక్తి, తన విస్తృత పరిచయాల ద్వారా నియోజక అభివృద్ధికి అద నపు నిధులు తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు అబ్బురపరిచేవి. ముఖ్యంగా తన నియోజకవర్గం బాపట్లలో క్రీడామైదాన స్టేడి యంలు ఏర్పాటు చేయమంటూ సంబంధిత మంత్రి ఉమాభార తిని కనబడినప్పుడల్లా కోరేవారు. జన్మభూమి తదితర ప్రభుత్వ నిధులతో బాటు తన సొంత ట్రస్ట్ నిధులతో మంచి అభివృద్ధి కార్య క్రమాలు చేశారు. అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి వెం కయ్యనాయుడు గారిని, ఆ శాఖ సలహా సంఘ సభ్యులమైన నేనూ, మరికొంత మంది పార్లమెంటు సభ్యులందర్నీ బాపట్ల నియోజక వర్గ పర్యటనకి తీసుకువెళ్లారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఎంపీలెంత గానో ప్రభావితులయ్యారు. 2002 డిసెంబర్ 13వ తేదీ బాగా గుర్తు. పార్లమెంటు సమావేశం మొదలయీ అవగానే వాయిదా పడింది. పార్లమెంటు భవనంలో పార్టీ కార్యాలయంలో టీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం. ఆయన నవ్విస్తూ చెప్పే కబుర్లదే అలాంటి సందర్భాల్లో ముఖ్య భూమిక. ఇంతలో బయట బాంబు శబ్దాలు. తీవ్రవాదుల దాడి. ఒక్కసారిగా అంతా సస్పెన్స్ సినిమా సీనుగా మారిపోయింది. మిగతాదంతా చరిత్ర. ఆయన కొలీగ్స్‌తో ఎంతో కలివిడిగా, స్నేహభావంతో ఉండేవారు. నన్ను వైద్యసలహాలు అడిగేవారు. సరదాగా సినిమా స్క్రిప్టులు చద వమని ఇస్తుండేవారు. నేను ఎంపీగా ఉంటూ, వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ప్పుడు, ఎంతో దూరంలో ఉన్న ఆయన వెంటనే ఫోన్ చేశారు. అలా చెయ్యొద్దు అని చెప్పారు. అయితే ఆ పీరియడ్ తర్వాత ఆయనే రాజకీయాలకు దూరమవడం, అలా ఉండాలనుకోవడం విచిత్రం. ఆయన రాజకీయాల్ని కొనసాగించి ఉంటే ప్రజలకు మరిన్ని సేవలందేవేమో? ఎంచుకొన్న రంగమేదైనా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, క్రమశిక్షణతో ఇష్టపడి చెయ్యడం ఆయన నైజం. అందుకే ఆయన లెజెండ్. ఆయన ఆత్మకి శాంతి కలగాలి.
 డా॥డి.వి.జి.శంకరరావు  మాజీ ఎంపీ, పార్వతీపురం
 
 శ్రీవారి ఆలయంలో హైరానా?                                      
 దేశంలోనే అత్యంత పెద్ద ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రంగా యావత్ ప్రజల పూజ లందుకుంటున్న దేవదేవుడి సన్నిధిలో, ఎప్పుడూ ఏదో ఒక సమస్యే!వెంకన్న సన్నిధి అపవిత్రం అవుతోందనడానికి నిలువెత్తు సాక్ష్యం నిన్నటి బంగారు వాకిలి ముందు తలుపులు తెరుచుకోకపోవడం.. అదీ ఒక విదేశీ అతిథి ముందు ఇలా జరగడం దురదృష్టకరం. ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తిరుమల భక్తులకు అందించే సౌకర్యాలు సమాచారం కేవలం కాగితం మీది రాతలకే పరిమితమౌతోంది. అక్కడ ఎంత మంది సిబ్బంది ఉన్నా సామాన్య భక్తులను పట్టించుకునే నాథుడే లేడన్నది అక్షర సత్యం. ఇంక కొండ మీద జరిగే అపచారాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇంక అలిపిరి దగ్గర భద్ర త అంతంత మాత్రమే! ఇది అవకాశంగా తీసుకుని, మద్యం, సిగరెట్లు మాదక ద్రవ్యాలు మొదలైనవి కొండ మీదకు చేరవేయడం శోచనీ యం. ఏదో రకంగా తిరుమల అపవిత్రం అయిపోతోంది. కాబట్టి అధికారులు తిరుమల పవిత్రతపై ఇకనైనా దృష్టి పెట్టాలి.
 ఎస్. పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్

మరిన్ని వార్తలు