ఆసక్తికరమైన సరుకు కావలసిందే కానీ...!

30 Aug, 2015 00:23 IST|Sakshi
ఆసక్తికరమైన సరుకు కావలసిందే కానీ...!

అవలోకనం
 
మన ప్రసార మీడియా సంచలనం పేరుతో పసలేని కథనాల వెంటపడుతున్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యానికి గురికాలేదు. అదేమంత కొత్త విషయం కాదు. కానీ స్టాక్‌మార్కెట్ పతనం వంటి ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన  ముఖ్య కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చడమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.
 
మీడియా ఉన్నది దేనికి? తాజా వార్తలు లేక లోతైన వార్తా కథనాలను అందించాలని కోరుకుంటున్న వాళ్ల కోసమేనా? మన మీడియా అంతటి స్థాయిలో ఉందని నేననుకోవడం లేదు. ఉదాహరణకు.. చైనా మార్కెట్లలో అనిశ్చితి, అస్థిర త్వం తర్వాత ఏం జరగనుందనే అంశంపై ఈ వారం స్టాక్ మార్కెట్లు ప్రకంపించిపోయాయి.

ఆగస్టు 24 సోమవారం నాడు నేను కాస్త త్వరగా మేల్కొని, ఆసియా మార్కెట్లు ఒకదాని వెనుక ఒకటి కుప్ప కూలిపోయిన తీరుపై వార్తా కథనాలు చదివాను. అప్పుడు సమయం ఉదయం 5 గంటలయింది. స్టాక్‌మార్కెట్ పత నం నేపథ్యంలో భారత్‌లో ఏం జరగనుందో అవగతం చేసుకోవడానికి నేను అంత పొద్దుటే వేచిచూస్తుండిపో యాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. యావత్ ప్రపంచ మీడియా దాని గురించి చర్చిస్తూ ఉండేది. మార్కెట్లు ఉద యం 9 గంటలకు ప్రారంభమైనప్పుడు టీవీ చానళ్లను చూడటం ద్వారా స్టాక్ మార్కెట్ పరిణామాల గురించి ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చని నేను భావించాను.

అయితే ఆ సమయంలో మన ఇంగ్లిష్ వార్తా చానళ్లలో కింది కథనాన్ని ప్రసారం చేశారు. పంజాబ్‌లో ఒక బాలిక తన ఫేస్‌బుక్‌లో మోటార్ సైకిల్‌పై ఉన్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేసింది. అతగాడు తనను బూతులతో సత్కరించాడని ఆమె రాసింది (అయితే ఆమె నిర్దిష్టంగా ఏం జరిగిందో వివ రించలేదు). ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్న వారు చెబు తున్నట్లుగా ఆ పోస్ట్‌ను ఆన్‌లైన్‌లో విపరీతంగా చూసే శారట.
 మీడియా ఆ సమయంలో చర్చిస్తూ ఉండిన కథనం ఇదే. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకుండానే చానళ్లు ఆ వ్యక్తి ఉపయోగించిన అశ్లీల పదాల గురించి చర్చిస్తూపోయాయి. ఇంగ్లిష్‌లో ఒక్క జాతీయ చానల్ కూడా స్టాక్ మార్కెట్ కల్లో లాన్ని చూపించలేదు, మార్కెట్ కుప్పకూలడంపై చర్చించ లేదు. ఇక బిజినెస్ చానల్స్ విషయానికి వస్తే.. వీటి విశ్లేషణ ఎక్కువగా మదుపుదారులపైనే సాగింది కానీ, స్టాక్ మార్కె ట్ పతనంలోని విస్తృత అంశాలపై ఆసక్తి చూపిన వారిపై ఇవేవీ దృష్టి పెట్టలేదు. మీడియాలో చాలాకాలంగా పని చేస్తున్న నాలాంటి వ్యక్తికి ఇది చాలా కొత్త పరిణామం.

మన ప్రధాన స్రవంతి మీడియా.. టాబ్లాయిడ్ తర హాకు కుదించుకుపోవడం గమనించిన మీలాంటి అనేక మంది లాగే నేను కూడా, మీడియా పసలేని కథనాల వెంట పడుతున్నప్పుడు ఆశ్చర్యానికి గురికాలేదు. అది కొత్త విష యమేమీ కాదు. కానీ.. ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన  ముఖ్య కథనంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చ డమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్స లు ఊహించలేదు. ఆనాటి ఉదయం ఇదే నన్ను నిస్పృహకు గురిచేసింది. మన ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం ఒకటి ద్రవ్య మార్కెట్లలో ఏర్ప డుతోందని ప్రపంచం మనకు తెలుపుతున్న సమయమది. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి ప్రవర్తనపై మరొక వ్యక్తి వ్యాఖ్యకు సంబంధించిన విషయంపైనే మన మీడియా ఆసక్తి చూపుతోంది.

ఆ మరుసటి దినం పటేళ్ల ఆందోళన జాతీయ వార్తగా మారిపోయింది. ఇది ఒకే వార్తలోకి పలు అంశాలను తీసు కువచ్చింది: కుల రాజకీయాలు, గుజరాత్ నమూనా, రిజ ర్వేషన్ భావజాలం, అసమానాభివృద్ధి వైైగె రా వగైరా. భార త్‌లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్త. ఒక మేరకు ప్రపంచం దృష్టిని కూడా ఇది ఆకర్షించింది. ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’, ‘బీబీసీ’తో సహా పలు విదేశీ మీడియా చానళ్లు ఈ విషయమై నా ఇంటర్వ్యూ తీసుకు న్నాయి. గుజరాత్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇవి చాలా ఆసక్తి చూపాయి.

గుజరాత్ పటేళ్ల ఆందోళన నన్ను ఎంతగానో ఆకట్టు కుంది. నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని అయినందుకు మాత్రమే కాదు. అది విస్తృతంగా జనం వీక్షించే పెద్ద, ముఖ్యమైన కథనం. కానీ బుధవారం నేను పని నుంచి తిరిగి వచ్చి టీవీ ఆన్ చేసినప్పుడు ఇంత పెద్ద కథనాన్ని కూడా సంపన్న కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక హత్యా వార్త మరుగున పడే సింది.
 నిజమే. ఫేస్‌బుక్‌లో ప్రచురించిన ఏదైనా పోస్టు కన్నా ఆ బాలిక మరణ ఘటన మరింత తీవ్రమైనదే.. కాదనను. కానీ పది మంది మరణాలకు దారితీయడమే కాకుండా, ప్రధానమంత్రి జోక్యానికి కూడా కారణమైన ఆందోళన కంటే ఈ వార్త ఎంతో ముఖ్యమా? పటేళ్ల ఆందోళన చాలా కాలం గుర్తుండిపోయే తరహా కథనం. కులం, రిజర్వేషన్‌పై చర్చను రగిల్చేంత శక్తి కలిగిన కథనం ఇది. దీని ప్రాథమిక డిమాండ్ ఏదంటే రిజర్వేషన్ల తొలగింపే. ఇది కూడా పటేళ్లు గతంలో చేసిన పాత డిమాండే.

 ఈ సమస్య రగులుకొన్నట్లయితే, అగ్రకులాల ప్రజ లకు ఇది అతి పెద్ద సమస్యగా మారుతుంది కూడా. రిజర్వే షన్ కాదు మెరిట్‌కు పట్టం కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్‌ను చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అగ్రకు లాలు భావిస్తున్నాయి. పాతికేళ్ల క్రితం మండల్ కమిషన్ నివే దిక తరహాలో దేశ రాజకీయాలనే మార్చివేసేంత శక్తివంత మైన కథనం ఇది. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. కానీ మనం మాత్రం పటేళ్ల ఆందోళనపై తక్కువగానూ, ఆ బాలిక హత్యపై ఎక్కువగానూ ప్రసారమవుతున్న వార్తల పైనే దృష్టి పెట్టాం.

 టెలివిజన్‌కి ఆసక్తికరమైన సరుకు కావాలన్న విషయం నాకు తెలుసు. దాన్ని నేను గుర్తిస్తాను కూడా. వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ, టీవీలు వినోద, అసందర్భ వార్తలను ప్రసారం చేస్తున్నప్పటికీ వాటితో నాకు పెద్దగా సమస్య లేదు. కానీ, అదే సమయంలో అంతకు మించిన అతి పెద్ద, ప్రముఖ వార్త సంచలనం కలిగిస్తున్న సందర్భంలో అలాంటి పరమ బాధ్యతారహిత వైఖరిని క్షమించడం నాకు కష్టమే. పటేళ్ల డిమాండ్ అనేది ఒక అపరి చిత వ్యక్తి హత్య ఘటనతో సమానమైనస్థాయి కలిగిన కథ నంకాదని దమ్మున్న జర్నలిస్టు ఎవరైనా అంచనా కట్టగలరు.

ప్రధాన సమర రంగంలో పూర్తి కార్యాచరణను రిపోర్టు చేయవలసి ఉన్న తరుణంలో, అప్రధాన రంగంలోని అసం బద్ధ అంశాలను నివేదించేందుకు పరుగులు తీస్తున్న టెలివి జన్ మీడియా ప్రత్యేకించి ఇంగ్లిష్ చానళ్లు తమ శ్రోతలకు, వీక్షకులకు ద్రోహం చేస్తున్న మాట నిజం.

ఆకార్ పటేల్
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)aakar.patel@icloud.com)
 

 
 

మరిన్ని వార్తలు