ఈవెంట్

4 Jul, 2016 01:00 IST|Sakshi


ఈవెంట్

జీడిగుంటకు రావూరి పురస్కారం
 శ్రీత్యాగరాయ గానసభ, జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్, డాక్టర్ రావూరి భరద్వాజ- శ్రీమతి కాంతమ్మ ట్రస్టుల ఆధ్వర్యంలో జూలై 5న సాయంత్రం 6:15కు భరద్వాజ 89వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రావూరి భరద్వాజ స్మారక సాహితీ పురస్కారాన్ని జీడిగుంట రామచంద్రమూర్తికి ప్రదానం చేయనున్నారు. అలాగే, వి.భూపతి దొర(వంశీ)ను సత్కరించనున్నారు. ఎ.చక్రపాణి, పి.విజయబాబు, ఓలేటి పార్వతీశం, కళా వేంకట దీక్షితులు, ఉమ అక్కినేని పాల్గొంటారు.

మా బడి పుస్తకావిష్కరణ
తెన్నేటి కోదండరామయ్య ‘మా బడి’(పునర్ముద్రణ) పుస్తకావిష్కరణ సభ జూలై 6న సాయంత్రం 6:30కు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని అన్నమయ్య కళావేదికలో జరగనుంది. అధ్యక్షుడు: నారిశెట్టి వెంకటకృష్ణారావు. అతిథులు: శ్రీరమణ, శ్రీకాంత్ అడ్డాల, గుడివాడ ప్రభావతి, వేలమూరి శ్రీరామ్.

విశాలాంధ్రము ఆవిష్కరణ
ఆవటపల్లి నారాయణరావు ‘విశాలాంధ్రము’ (పునర్ముద్రణ) ఆవిష్కరణ సభ జూలై 7న సాయంత్రం 6 గంటలకు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి వైశ్య హాస్టల్, నగరంపాలెం, గుంటూరులో జరగనుంది. అధ్యక్షుడు: వి.బాలమోహన్‌దాస్. అతిథులు: మండలి బుద్ధప్రసాద్, రాజా రావు వేంకట మహీపతి రామరత్నారావు, శ్రీరమణ.

మూడు తరాల కవిసంగమం
జూలై 9న సాయంత్రం 6:30కు గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్‌లో జరగనున్న కవిసంగమం (సీరీస్-29)లో- కందుకూరి శ్రీరాములు, బొల్లోజు బాబా, రాజ్‌కుమార్ బుంగ, సీహెచ్ ఉషారాణి, రాజేష్‌కుమార్ మల్లి తమ కవితల్ని వినిపిస్తారు.

తెరవే ‘అక్షరాల మద్దతు’
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని ఎర్రగుంట్లపల్లె పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఓపెన్‌కాస్ట్ తవ్వకాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నవారికి మద్దతుగా జూలై 10న ఉదయం 11 గంటలకు ‘అక్షరాల మద్దతు’ పేరిట కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్టు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక శాఖలు తెలియజేస్తున్నాయి.

బొల్లోజు బాబా పుస్తకాలావిష్కరణ
కవి సంధ్య, కవి సంగమం సంయుక్త ఆధ్వర్యంలో, బొల్లోజు బాబా కవితా సంపుటి ‘వెలుతురు తెర’, రవీంద్రుని స్ట్రే బర్డ్స్‌కు బాబా చేసిన అనువాదం ‘స్వేచ్ఛా విహంగాలు’ ఆవిష్కరణ సభ జూలై 10న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్ హాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: కె.శివారెడ్డి. అధ్యక్షత: శిఖామణి. వక్తలు: నారాయణశర్మ, సత్యశ్రీనివాస్.

కథాకుటుంబం సంకలనం కోసం
అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో, ‘కథాకుటుంబం-2015 ఉత్తమ కథల సంకలనం’ కోసం కథలను పంపాల్సిందిగా కథకులను ఆహ్వానిస్తున్నారు వ్యవస్థాపక కార్యదర్శి కోడిహళ్లి మురళీమోహన్. 2015లో ప్రచురించిన ఏదేని ఒక కథను కథకులు జూలై 31లోగా పంపాలి. సాహిత్యాభిమానులు కూడా మంచి కథలను సూచించవచ్చు. సంకలనం నవంబర్/డిసెంబర్‌లో విడుదలవుతుంది.

కథలు పంపాల్సిన చిరునామా: కస్తూరి మురళీకృష్ణ, ప్లాట్ నం. 32, ఇం.నం. 8-48, రఘురాం నగర్ కాలనీ, ఆదిత్య హాస్పిటల్ లేన్, దమ్మాయిగూడ, హైదరాబాద్-83; ఫోన్: 9849617392. కథల్ని స్కాన్ చేసి కూడా ఈ మెయిల్ ఐడీకి పంపవచ్చు: sakshisahityam@gmail.com

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా