మద్య నిషేధం

21 Sep, 2015 01:07 IST|Sakshi

మద్య నిషేధాన్ని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపడుతు న్నట్టు సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ప్రకటించడం హర్షణీయం. మద్యం కారణంగా కలిగే దుష్పరి ణామా లు దారుణంగా ఉంటాయి. ఒకవేళ మద్యాన్ని అరికట్టినా, కల్తీ మద్యం పుణ్య మా అని వేలాది మంది చనిపోతున్నారు. లేదా రోగాల బారిన పడి ఆస్పత్రులకు చేరుతున్నారు. మద్యం అమ్మకాలను  ప్రభుత్వాలే ప్రోత్సహించడం సరికాదు. మద్యపానాన్ని ఎందుకు నిషేధించరాదో తెలుపాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతా లకు నోటీసులు ఇచ్చింది. ఎప్పుడో ఇచ్చిన ఆ నోటీసులకు ఇంతవరకు జవాబు లేదు. విలువల గురించి మాట్లాడే ఎన్‌డీఏ ప్రభు త్వం అయినా సుప్రీంకోర్టుకు బాసటగా నిలవాలి.
 - పి. గంగునాయుడు, శ్రీకాకుళం
 

మరిన్ని వార్తలు