మకుటంపై మక్కువ!

8 Sep, 2013 00:50 IST|Sakshi
మకుటంపై మక్కువ!
అద్వితీయమైన సిన్సిన్నాటస్ చరిత్రను ప్రాచీన చరిత్రకారుడు లైవీ (టైటస్ లై వియస్ పటావినస్) నమోదు చేశాడు. క్రీ.పూ. 458లో సాబైన్, అయికీ ఇటాలియన్ తెగల నుంచి  రోమ్‌కు ముప్పు ఏర్పడింది. నాగలి పట్టి పొలం దున్నుకుంటున్న లూషియస్ క్విన్‌సిటస్ సిన్సిన్నాటస్‌ను దేశ రక్షణ కోసం పిలిపించారు. రోమన్ సామ్రాజ్యానికి  అతనిని నియంతగా నియమించారు. దురాక్రమణకు దిగిన తెగలను ఓడించిన అతడు దొరికిన సంపదనంతా తన సైన్యానికి పంచిపెట్టాడు. వెంటనే తిరిగి తన పొలానికి వెళ్లిపోయాడు. సిన్సిన్నాటస్ తన నాగలిని పొలంలో ఎక్కడ వదిలి పెట్టాడో అది సరిగ్గా అక్కడే ఉంది. అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. సిన్సిన్నాటస్ నియంతగా ఉన్నది కేవలం పదిహేను రోజులే. రాజకీయ నాయకులకు తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాల్సిన సిన్సిన్నాటస్ వృత్తాంతం చారిత్రక అధ్యయనాంశాల అంచుల్లోనే మిగిలిపోయింది.
 
 ఆ తదుపరి రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన ఏ నియంత లేదా పాలకుడు అలాంటి అసాధారణమైన విజ్ఞతను ప్రదర్శించలేదు. అధికారం కాక మరే వ్యాపకంలోనైనాగానీ అలాంటి శాంతి, సంతృప్తి లభించగలదన్న ఆలోచనే అధికారం కలిగిన వారికి మింగుడుపడనిది. దాదాపు 130 మంది రోమన్ చక్రవర్తులలో కేవలం 28 మంది మాత్రమే వృద్ధాప్యంలో లేదా రోగగ్రస్తులై మరణించారు. రాజకీయం స్వాభావికంగానే పదవీ వైభోగం కోసం తపిస్తుంది. పదవీ విరమణతో కలిగే ఒంటరితనమంటేనే అది భీతిల్లిపోతుంది.
 
 శక్తిమంతుైడె న  ఒక మంత్రి స్వచ్ఛందంగా పదవిని త్యజించిన ఘటన మన దేశంలో ఒకే ఒకసారి జరిగింది. లాల్ బహుదూర్‌శాస్త్రి రైల్వే మంత్రిగా ఉండగా అలా పదవీ పరిత్యాగం చేశారు. ఆరు దశాబ్దాల తర్వాత, ప్రమాదాలు ఒక మినహాయింపుగా గాక ఒక నియమంగా మారి పోయాయి. ఇప్పుడా సూత్రాన్ని పాటించడం మూర్ఖత్వం అవుతుంది లేదా తమాషా అవుతుంది. మంత్రులను జవాబుదారులను చేసేట్టయితే నేటి పార్లమెంటులో మంత్రులుగా పదోన్నతిని పొందగల ఎంపీలకు కొరత ఏర్పడుతుంది. జవహర్‌లాల్ నెహ్రూ తన పరిపాలన సాఫల్యత నొందుతూ ఉచ్ఛదశలో ఉండగా, 1957లో పదవీ విరమణచేయాలని యోచించారు. అంతేగానీ 1962 చైనా యుద్ధంతో ఆయన ప్రతిష్ట అథఃపాతాళంలో ఉన్నప్పుడు మాత్రం కాదు. నెహ్రూ పదవీ విరమణ యోచనకు కారణాలు అత్యంత మానవీయమైనవి. గ్రంథపఠనం, రచనావ్యాసంగాలను కొనసాగించాలని, కుటుంబ సభ్యులతో కలిసి గడపాలని కోరుకున్నారు. అయితే అతి తే లికగానే ఆయనను పదవిలో కొనసాగడానికి ఒప్పించగలిగారు. ప్రతి రాజకీయ కథ విషాదాంతంగానే ముగుస్తుందని అంటారు.  1962లో నెహ్రూకు అదే సంభవించింది. 
 
అయితే రాజకీయంగా గత్యంతరం లేకపోవడమనే స్థితి నేటికీ రాజకీయరంగం నుంచి అదృశ్యం కాలే దనడం నిస్సందేహం. ఒకప్పుడు పెట్టుబడిగా ఉండిన మన్మోహన్‌సింగ్ నేడు తలభారంగా మారారు. ప్రజాభిప్రాయ సేకరణలు దృశ్యమానంగానూ, పిట్టకథల రూపంలోనూ కూడా అందుకు  ఆధారాలను చూపుతున్నాయి. 2009లో ఆయనకున్న జనాదరణ స్థాయితో పోలిస్తే ఇది ఒక అసాధారణమైన  పతనం. బహుశా ఆయన మరీ ఎక్కువగా ఆశలను రేకెత్తించి ఉండాలి. ఇక అక్కడి నుంచి ఆయన ఎక్కడికి పోవడానికి లేదు, అథోదిశగా తప్ప. అయితే వాస్తవాలు ఇంక మారలేనంతగా ఘనీభవించిపోయాయి. ‘ఏబీపీ న్యూస్’ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ప్రధాని పోటీలో 47 శాతం మద్దతుతో  నరేంద్రమోడి ముందున్నారు. కాగా రాహుల్ గాంధీ తమ గట్టి మద్దతుదార్ల నుంచి లభించే 18 శాతం మద్దతును దాటలేకపోయారు. ఇక మన్మోహన్ ఎక్కాడా సోదిలోనే లేరు. ఇక పార్టీల మధ్య వ్యత్యాసాన్ని చూసినా పరిస్థితి అంతే ఆందోళనకరంగా ఉంది.   మీరు గనుక గట్టి కాంగ్రెస్ మద్దతుదార్లయితే ఇది గమనించండి: బీజేపీకి 36 శాతం మద్దతు లభిస్తుండగా, కాంగ్రెస్‌కు 22 శాతం మాత్రమే మద్దతు లభిస్తోంది. బీజేపీ పునాది కొన్ని ప్రాంతాలకే పరిమితమైనది. కానీ అది ఉన్న చోటల్లా దాని మద్దుతు బాగా లోతుగా విస్తరించి ఉంటుంది. 
 
 మన పార్లమెంటరీ వ్యవస్థ ఇలాంటి సంక్షోభ సమయంలో ఆగి, సరిదిద్దుకోడానికి పాలక పార్టీలకు అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రభుత్వాన్ని కోల్పోకుండా వాళ్లు తమ ప్రధానిని మార్చుకోవచ్చు. యూపీఏ-2 ప్రభుత్వం సృష్టించిన పారిపాలనాపరమైన, రాజకీయపరమైన శూన్యాన్ని భర్తీచేయగల షీలాదీక్షిత్ అద్భుత ప్రత్యామ్నాయం కాగలుగుతారు. మరి కాంగ్రెస్ ఎందుకు ఈ యథాతథస్థితిని కొనసాగిస్తున్నట్టు? తర్కానికి లొంగే అదృశ్య కారణం ఏదో ఉండాలి. అది, ఒక్క రాహుల్‌గాంధీని తప్ప సోనియాగాంధీ మరే వారసులను పరిగణనలోకి తీసుకోరు అనేది మాత్రమే. ఆయనేమో తనంతట తానుగా ఆ పని చేయడానికి అశక్తులు, పళ్లెంలో పెట్టి అందిస్తే అందుకోవాలన్న ఆలోచన నాటుకున్నవారు. 
 
 ఒక నేతగా రాహుల్‌గాంధీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలరన్న విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి కాం గ్రెస్ ప్రయత్నించడం లేదు. అందుకు బదులుగా బీజేపీ అభ్యర్థి ప్రతిష్టను దిగజార్చి అత్యున్నత పదవికి అనర్హునిగా చూపే వ్యూహంపై దృష్టిని కేంద్రీకరించి అన్ని యం త్రాంగాలను, మంత్రాంగాలను ప్రయోగిస్తోంది. ఇది ప్రతి కూలమైన ఫలితాలను మాత్రమే కలగజేస్తుంది. మోడీలో ఉన్న అన్ని ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓటరు నిర్ణయం తీసుకుంటారు.  గుజరాత్ అల్లర్లకు జవాబుదారీతనం వహించడానికి సంబంధించిన కథనానికి జోడించడానికి మాత్రం ఇంకా ఏమీ లేదు. అయితే ప్రజలలో రాహుల్‌గాంధీ పలుకుబడి ఇప్పుడున్నట్టు అలాగే నిలకడగా ఉండిపోతే లేదా అనిశ్చితంగా ఉంటే ఎన్నికల యుద్ధం వచ్చేసరికి కాంగ్రెస్ వాదన అత్యంత  అస్పష్టంగానే మిగులుతుంది. 
 
 గందరగోళం అత్యంత అధమం. కాంగ్రెస్ రాహుల్‌గాంధీ ప్రజలకు ఏమి చేయగలరనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వదిలేస్తే, అప్పుడది సంప్రదాయకంగా ప్రతిపక్షాన్ని పట్టిపీడించే వ్యాధికి గురికావాల్సి వస్తుంది. వయస్సు, పరిపాలనాపరమైన రికార్డు కూడా మన్మో హన్‌ను మూడోదఫా అభ్యర్థిగా నిరాకరిస్తున్నాయి. సంశయంలో ఉన్న ఓటర్లను తమ వేపు మొగ్గేట్టు చేసుకొని, రాహుల్ గాంధీ దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేదాన్ని నిరూపించడం మాత్రమే ఉన్న ఏకైక మార్గం. అంతేగానీ ఆయన దేని నుంచి దాక్కుంటున్నారో దాన్ని తప్పించుకోవడం కాదు. 
 
 2009లో మన్మోహన్ ఇప్పటికంటే పిన్న వయస్కు లు. గత ఐదేళ్ల కాలంలో ఆయనపై పదేళ్లకంటే ఎక్కువగానే వయోభారం పడింది. రెండవసారి ప్రధానిగా పాత్రికేయ సమావేశంలో ఆయన సానుకూల ధోరణితోనూ, ఆత్మవిశ్వాసంతోనూ కనిపించారు. రాహుల్‌గాంధీ గురిం చిన అనివార్యమైన ప్రశ్న ఎదురైనప్పుడల్లా వెంటనే స్పం దించేవారు. రాహుల్‌గాంధీ ఆ పదవిని ఎప్పుడు స్వీకరిస్తానంటే అప్పుడు తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేవారు. ప్రతివారూ దాన్ని చిరునవ్వుతో స్వీక రించి ఊరుకునే వారు.
 
 మన్మోహన్ 2009 చివర్లో లేదా 2010లో ఎప్పుడు తప్పుకుని ఉన్నా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనను తిరిగి తీసుకురావాలనే డిమాండు మారుమోగుతుండేది. సిన్సిన్నాటస్ పదిహేను రోజుల్లో దేశ శత్రువులను ధ్వంసించి, కనీవినీ ఎరుగని రోమ్ అద్భుత వైభవానికి ప్రాతిపదికను వేయడంతో సమానంగా మన్మోహన్ మొదటి ఐదేళ్ల పాల నను అద్భుతమంటూ కీర్తించేవారు.  
 మన్మోహన్ నాగలిపట్టి దున్నుకునే నేలకంటే రాజ సౌధాన్నే కోరుకున్నారు.
 -ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు
 
మరిన్ని వార్తలు