‘మేడే’ మోగించాలి నిరంకుశ ప్రభుత్వాలపై ‘రణభేరి’

1 May, 2015 03:10 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కోసం పోరాటానికి మేడే ప్రతీక. 1830 నుంచి 1850 వరకు యూరప్ కార్మికవర్గం పనిగంటల తగ్గింపునకై ప్రాణార్పణలతో పోరు చేసింది. 1850లో బ్రిటన్ ప్రభుత్వం 12 గంటల పనిదినం చట్టం చేయడం యూరప్ కార్మికవర్గానికి పర్వదినంగా మారిందంటే ఆ నాటికి పనిగంటలు ఎంత దుర్భరంగా ఉండేవో ఊహించుకోవచ్చు. యూరప్ కార్మికవర్గం పారిస్ కమ్యూన్‌లో ఘోరంగా దెబ్బతిన్న కాలంలో వారి పోరాట బావుటాను విశ్వవీధుల్లో ఎగరేసింది అమె రికా కార్మిక వర్గం. ఆ చరిత్రకు మరో పేరు మేడే.
 ఎనిమిది గంటల పరిశ్రమ, 8 గంటల విరా మం (నిద్ర), 8 గంటల వినోదం (విద్య, విజ్ఞానం, క్రీడలు వగైరా) కోసం రోజును మూడు సమ విభా గాలుగా వర్గీకరించడం ద్వారానే కార్మికుడిని కేవలం కూలీగా కాకుండా పరిపూర్ణ మనిషిగా చూడగలమ న్నది 150 ఏళ్ల క్రితం కార్మిక సంస్థల భావన. పని, నిద్ర తప్ప ఇతర అవసరాలు కూలివాళ్లకు అక్కర లేదన్న ఆనాటి అమానుష వ్యవస్థకు ఇది పూర్తి భిన్న మైన వాదన. దీంట్లోనుంచే 8 గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా క్రమంగా అమలులోకి వచ్చింది.  


 మానవ సమాజం వందేళ్ల క్రితం నాటి ఆధునీ కరణ నుంచి యాంత్రీకరణ, సాం కేతీకరణ, కంప్యూటరీకరణ, అంత ర్జాలం ద్వారా ఎంతో ముందుకు సాగినా పరిపూర్ణ మానవుడు భావ న ఇంకా పూర్తిస్థాయిలో ఫలించ లేదు. 8 గంటల పని దినాన్ని ఆరు గంటల పనిదినంగా పురోగమించ డానికి బదులుగా, 8 నుంచి 10, 12, 14 గంటల పనిదినంవైపు నేడు అడుగులు పడుతున్నాయి. పెట్టుబడిదారీ వేతన బానిసత్వ రద్దుకోసం పోరాడ టమే తమ లక్ష్యమని, 19వ శతాబ్దంలో ఉరికంబమె క్కబోయే ముందు మేడే వీరులు అమెరికా న్యాయ స్థానంలో ప్రకటించారు. కానీ 13 దశాబ్దాల తర్వాత మళ్లీ 8 గంటల పనిదినం కోసం కార్మికవర్గం పోరా డాల్సి రావడం విషాదకరం. నేటి భారతదేశంలో 40 కోట్లకు పైగా అసంఘటిత కార్మిక వర్గానికి 8 గంటల పనిదినం అందని ద్రాక్షపండే. 8 గంటల పని నడు స్తున్న పాత పరిశ్రమల్లోనే 12 గంటలపాటు పని చేసే ఒప్పంద, పొరుగు సేవలు, వలస కార్మికులు కొత్తగా చేరుతుండటం ఒకెత్తు కా గా, ఐ.టీ, బీపీఓ వంటి అత్యాధు నిక బానిసత్వ పరిశ్రమల్లో అత్యు న్నత విద్యావంతులు 10 లేదా 12 గంటల పనిదినానికి అలవాటు పడుతుండటం మరో ఎత్తు.


 రాజస్థాన్ నుంచి ఆంధ్రప్ర దేశ్ వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికచట్టాలకు తిరోగమన సవరణలు చేస్తున్నాయి. మార్చినెలలో ఏపీ శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు ప్రభు త్వం ఆదరాబాదరాగా కార్మిక చట్టాల సవరణలకు దిగడం వ్యూహాత్మకమైంది. చంద్రబాబు తాను మా రిన మనిషినని చెబుతూనే పాత చీకటి చరిత్రను పునరావృతం చేస్తున్నారు. సింగపూర్, చైనా తదితర దేశాల విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాట కోసం స్వదేశీ కార్మిక వర్గంమీద యుద్ధప్రకటన చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు తీరు కూడా ఇలాగే పోటీపడుతోంది. కార్మికుల ఆకలి కేకలు పట్టించుకో కుండా విదేశీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమలకై తెగ ఆరాటపడుతోంది. తాము కార్మికవర్గ హక్కులను ఎంత ఎక్కువగా కాలరాస్తే, విదేశీ పెట్టుబడులు అం త ఎక్కువ స్థాయిలో ఇక్కడకు వస్తాయన్న తాత్విక సిద్ధాంతంతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
 
 రైతుల ఆత్మహత్యలు, నిర్వాసిత సమస్యలు, బలవంతపు భూసేకరణ, బూటకపు ఎదురుకాల్పు లు తదితర ప్రజావ్యతిరేక విధానాలవల్ల రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం, కూలీలు, ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. అలాంటి బాధిత వర్గాల ప్రజలకంటే కార్మిక వ ర్గం ఒకింత ఎక్కువ సమరశీలమైంది. మేడే సంద ర్భంగా కేవలం 8 గంటల పనిదినం, జీతభత్యాలు, జీవన ప్రమాణాల మెరుగుదలకే పరిమితం కాకుం డా ప్రజావ్యతిరేక ప్రభుత్వాలపై పోరుకు దిగే చారి త్రక పాత్రను పోషించేందుకు కార్మికవర్గం దీక్ష పూ నాలి. ఇదే మేడే వీరులకు నిజమైన నివాళి.
 (మేడే కార్మిక పోరుకు నేటికి 129 ఏళ్లు)
 పి. ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు జాతీయ కార్యదర్శి
 మొబైల్: 9490700715         

>
మరిన్ని వార్తలు