మితమే హితం

2 Jul, 2015 00:37 IST|Sakshi
మితమే హితం

మన ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగ రు, చేదు అనే ఆరు రసాలుంటాయి. కవుల కావ్యా లలో, మానవ జీవితంలో శృంగార, హాస్య, వీర, కరు ణ, రౌద్ర, బీభత్స, భయానక, అద్భుత, శాంతమనే నవరసాలు ఉంటాయి. ఆహారానికి సంబంధించిన ఆరు రసాలలో, జీవితానికీ, కావ్యానికీ సంబంధించిన నవరసాలలో ఏది ఎక్కువైనా ప్రమాదమే.
 మనం చూసే దృశ్యాలలో, వినే శబ్దాలలో, చేసే భోజనంలో, మాట్లాడే మాటలలో జాగరూకత వహిం చాలి. ఈ సత్యాన్ని గుర్తించమని
 ‘‘జిహ్వే ప్రమాణం జానీహి భోజనే భాషణే తథా
 అతి భుక్తిః అతీవోక్తిః సద్యః ప్రాణాపహారిణీ॥
 అనే సూక్తి మనకు ప్రబోధిస్తున్నది.
 ఆత్మవిశ్వాసం ఉండవలసినదే. అది ముదిరి గర్వంగా మారితే రావణుని (అతి గర్వాద్ధతో రావణః) వలె పతనం తప్పదు. యజ్ఞ-దాన- తపములు చేయవ లసిందే. కాని శక్తికి మించి చేయడం వల్ల లోపాలు సంభవించవచ్చు.  తరువాత ఎన్నెన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకోవలసిన పరిస్థితి రావచ్చు. ఎక్కువ దానాలు చేసిన బలి చక్రవర్తి (అతి దానాద్బలిర్బద్ధః) పాతాళా నికి పోవలసివచ్చింది. కాబట్టి ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్టు ఏ విషయంలో అతిగా ప్రవ ర్తించినా, అది తిరిగి బాగు చేసుకో లేనంతగా కీడును కలిగిస్తుందనే హితోపదేశాన్ని శిరసావహించాలి.
 కొందరిలో కోపం ఎక్కువ. ఇం కొందరిలో మెతకదనం అధికం. మరికొందరిలో కపటబుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. లోకంలో చాలా మంది ఎక్కువగా వెర్రివాదనలతో పొద్దు పుచ్చుతూ ఉంటారు. కొందరైతే రాక్షసులతో పోల్చ దగినట్టు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. మరికొం దరైతే ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్టుగా వెర్రి పట్టుదలతో శక్తియుక్తులను మరచి, సమయం సం దర్భం చూడకుండా, శరీరారోగ్యాన్ని లెక్క చేయ కుండా, కంటిమీద కునుకు లేకుండా, కడుపు నిండా తినకుండా, తాము ఆరంభించిన పనిని పూర్తి చేయ డానికి శ్రమిస్తారు. అది ప్రమాదకరమే కాని ప్రమోద కరం కాదు.
 ‘‘నాతి క్రౌర్యం నాతి శాఠ్యం ధారయేన్నాతి మార్దవమ్‌
 నాతి వాదం నాతి కార్యాసక్తి మత్యాగ్రహం తథా॥
 అంటుంది శాస్త్రం.
 అతి పరిచయం వల్ల గౌరవమర్యాదలు లోపి స్తాయి. మాటిమాటికీ వచ్చే వారిని ఎవరూ అతిథిగా భావించరు.
 ఇంటి చెట్టుతో ఎక్కువ పరిచయం ఉండటం వల్ల తామే దాన్ని పెంచి పోషించినందువల్ల ఆ చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోతుందని, అదే పొరు గింటి పుల్లకూరైతే మరీ రుచిగా ఉంటుందనే నాను డులు తెలిసినవే.
 అందుకే మన పూర్వులు భుక్తిలోనైనా, ఉక్తిలో నైనా, అనురక్తిలోనైనా మితమే హితమని చెప్పారు.
 సముద్రాల శఠగోపాచార్యులు
 

మరిన్ని వార్తలు