‘కోటా’ సమీక్ష సూచనకు వక్రభాష్యం

20 Oct, 2015 02:07 IST|Sakshi
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ (ఫైల్ ఫొటో)

రిజర్వేషన్లపై విధాన నిర్ణయాలను చేసే హక్కును రాజకీయ నాయకులకు కాక, సామాజిక సమానత, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి కలిగిన నిపుణులకు, పరిపాలనాదక్షులకు అప్పగించాలని కోరడంలో తప్పేముంది?
 
 పండిత దీనదయాళ్ ఉపా ధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం అమలుపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ అధ్య క్షులు మోహన్ భాగవత్ ‘పాంచజన్య’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... రాజ్యాంగ నిర్మాతల ఆశ.యాలకు, ఆకాం క్షలకు అనుగుణంగాను, సక్రమంగాను రిజర్వేషన్‌లు అమలు కావడం లేదని, అందుకు కారణం రాజకీయాలేనని అన్నారు. మొత్తం దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ కులానికి, ఏ రకమైన రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయించాలని సూచించారు. సామాజిక సమానత్వం పట్ల చిత్తశుద్ధి కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర కమిటీని వేసి, దాని ఆధ్వ ర్యంలోనే విధాన నిర్ణయాలను అమలు చేయాలని అన్నారు. ఇంతవరకు రిజర్వేషన్లు అమలు జరిగిన తీరు పైన, కలిగిన ఫలితాలపైన సమీక్ష జరపాలని కోరారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే... దళితులకు, గిరిజ నులకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమంటూ రాజకీయ నేతలు అనాలోచితమైన విమర్శలు గుప్పించారు. ఈ సంద ర్భంగా కొన్ని అంశాలను అంతా గమనించాల్సి ఉంది.  
 
 1. కేవలం ఆర్థిక వెనుకబాటుతనం కారణంగానే షెడ్యూల్డు కులాలకు (ఎస్సీ), తెగలకు (ఎస్టీ) రిజర్వే షన్లను కల్పించలేదు. శతాబ్దాలుగా అస్పృశ్యతకు గురైన కులాలను ఎస్సీ కులాలుగాను, ప్రధాన ప్రజాజీవన స్రవంతికి దూరంగా, శతాబ్దాలుగా అడవుల్లో నివసి స్తున్న గిరిజనులను ఎస్టీలుగాను గుర్తించారు. వారు కూడా మిగిలిన సమాజంతో సమంగా అభివృద్ధి చెంద టానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగా లలో రిజర్వేషన్లను కల్పించారు.
 
 ఈ వ్యవస్థ ద్వారా కాల క్రమేణా దళితులు, గిరిజనులు మిగిలిన సమాజంతో పాటు సమంగా పోటీ పడగల స్థాయికి చేరగలుగుతా రని రాజ్యాంగ నిర్ణేతల అభిప్రాయం. దీంతో ఆర్‌ఎస్ ఎస్‌కు పూర్తి ఏకీభావం ఉంది. 2. ఎస్సీ, ఎస్టీలకు 65 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలవుతున్నా ఆశించిన మేరకు వారి అభివృద్ధి జరగలేదన్నది తిరుగులేని వాస్తవం. పలు పార్లమెంటరీ కమిటీలు ఇదే విషయాన్ని నిర్ధారిం చాయి. యూపీఏ హయాంలో నాటి రాష్ట్రపతి చొరవతో పీసీ అలెగ్జాండర్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, అభివృద్ధిపై ఒక కమిటీని వేశారు. అంటే నాటి రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దును కోరారని అర్థమా? కాదు. నేడు భాగవత్ కూడా రిజర్వేషన్ల అమ లుపై సమీక్షను కోరారే తప్ప రద్దును కోరలేదే!

 3. రాజ్యాంగ సభ, పటేల్ నాయకత్వంలో రిజర్వే షన్లపై నియమించిన ఉపసంఘం మతపరమైన రిజర్వే షన్లు దేశ విభజనకు దారి తీశాయని, దేశ సమైక్యత దృష్ట్యా వాటిని కొనసాగించరాదని సూచించింది. ముస్లిం, క్రైస్తవ సభ్యులు సహా రాజ్యాంగ సభ సభ్యు లంతా దాన్ని సమర్థించారు. నేడు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి మతపరమైన రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్నాయి. దీని అర్థం ఏమిటి? 4. ఎస్సీ, ఎస్టీలలో అనేక కులాలున్నాయి. ఈ 65 ఏళ్లలో రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందలేదు. అందువల్లనే ఎస్సీలలో వర్గీకరణ ఉద్యమం తలెత్తింది. పలు గిరిజన తెగలు నేటికీ అడవుల్లోనే నివసిస్తూ రిజర్వేషన్ల లబ్ధిని పొందలేకుండా ఉన్నాయి.
 
 ఎస్సీ, ఎస్టీలలోని అన్ని కులాల వారు సమానంగా అభివృద్ధి చెందేటట్లు చూడా ల్సిన అవసరం సామాజిక న్యాయాన్ని వాంఛించే వారికి లేదా? ఈ సమస్యలు రాజ్యాంగ నిర్మాతలు ఊహిం చనివి. ఆది విస్మరించి, రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతి రేకిస్తామనడం ఎలా సబబు? 5. మరి కొన్ని కులాలను ఎస్సీ జాబితాలో చేర్చా లని పలువురు రాజకీయ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి ఒత్తిడులకులోనై కొందరిని ఎస్సీ జాబితాలో చేర్చడం వల్ల అస్పృశ్యతకు గురైన నిజమైన ఎస్సీలు అన్యాయానికి గురికారా? అలాగే రాజకీయ ప్రయోజ నాల కోసం గిరిజన తెగల నిర్వచనపు పరిధిలోకి రాని ఇతరులను ఎస్టీ జాబితాలోకి చేర్పించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవలసిన అవసరం లేదా? 6. అంగబలం, అర్థబలం గల కొన్ని అభివృద్ధి చెందిన కులాలు సైతం రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తు న్నాయి. ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలవం చుతున్నాయి.
 
 ఇది ఎక్కడకు దారి తీస్తుంది? రాజ్యాంగ స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ఓట్ల బ్యాంకులు, అధికారమే లక్ష్యంగా కొందరు రాజకీయ నేతలు ప్రతి కులానికి రిజర్వేషన్లను వర్తింపచేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి పరిస్థి తుల్లో బలహీన వర్గాలను కాపాడటం ఎట్లా? రిజర్వే షన్లపై విధాన నిర్ణయాలను చేసే హక్కును రాజకీయ నాయకులకు కాక, సామాజిక సమానత, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి కలిగిన నిపుణులకు, పరిపాల నాదక్షులకు అప్పగించాలని కోరడంలో తప్పేముంది? ఈ విషయాలపై మరింత చర్చ జరగాలని కోరుకుం దాం. రాష్ట్రంలోని ప్రముఖ దళిత, గిరిజన నాయకులు భాగవత్ ప్రకటనపై వివరణను కోరి, తెలుసుకుని... అందులో లోపాలేమీ లేవన్నారు. వారే మరోవంకతమ అనుయాయుల చేత ఆయన దిష్టి బొమ్మలను తగుల బెట్టిస్తుండటమే విచిత్రం !
 (వ్యాసకర్త సామాజిక సమరసతా వేదిక, కన్వీనర్) మొబైల్: 9440901360
 - కె.శ్యామ్‌ప్రసాద్

మరిన్ని వార్తలు