నారీ గర్జనతో నిర్భయకు నివాళి

15 Dec, 2014 01:37 IST|Sakshi
నారీ గర్జనతో నిర్భయకు నివాళి

రెండేళ్ల క్రితం దేశరాజధానిలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మన జాతి మూలాలను కదిలించింది. తమ ఉనికితో, జీవన సర్వస్వంతో ఆడుకుంటున్న మృగాళ్లపై మహిళలు గొంతు విప్పేందుకు ఇది ప్రేరేపించింది. అయితే బహిరంగ స్థలాల్లో స్త్రీల రక్షణకు ఇది నాంది మాత్రమే.
 
జాతి అంతశ్చేతనను కది లించివేసిన నిర్భయ ఉదం తానికి రెండేళ్లు కావస్తోంది. ఢిల్లీలో 2012 డిసెం బర్ 16 కాళరాత్రి మానవ రూప మృగాల కాటు కు పారామెడికల్ విద్యార్థిని గురై రెండువారాలు జీవితం కోసం పోరాడి ఓడిపోయిన ఘటన యావత్ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది. ఈ దారుణ అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏక గొంతుకతో నినదించడం ఒక పురాజ్ఞాపకమై నిలిచింది కానీ రెండేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేటికీ బహిరంగ స్థలాలు మహిళ లకు సురక్షితం కావని అనునిత్యం రుజువవుతూ నే ఉంది.

అయితే నాటి నిర్భయ జీవన్మరణ పో రాటం వృథా కాలేదు. తమ శరీరంతో, మనస్సు తో, ఉనికితో మృగాళ్లు ఆడుకుంటుంటే నిస్సహా యంగా తలదించుకుని అణిగిపోయిన వారు ఈ రెండేళ్లలో తమ గొంతెత్తడం మొదలెట్టారు. దీని ఫలితంగా అత్యాచారాల పాలైనప్పటికీ ధై ర్యంగా ముందుకొచ్చి ప్రకటిస్తున్న, పోలీసు స్టేష న్లలో ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళల సంఖ్య స్వాతంత్య్రానంతరం తొలిసారిగా పెరిగింది.  
 ఒక చిన్న ఉదాహరణ. గత ఏడాది నవంబ ర్‌లో ముంబైలో 14 ఏళ్ల బాలిక సోషల్ మీడియా లో 16 ఏళ్ల అబ్బాయి చేసిన వేధింపుకు తట్టుకో లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటనను త మ రాత అనీ, ఖర్మ అనీ భరించి ఊరుకోకుండా ఆ అమ్మాయి కుటుంబం జరిగినదాన్ని మీడియా కు చెప్పేసింది. జీవితం పొడవునా బాధిస్తూ ఉం డే ఇలాంటి దారుణ ఘటనకు గురయ్యాక భారతీయ మహిళ న్యాయం కోసం వీధులకెక్క డం, తన వంటి మరొక బాధితురాలికి మద్దతు గా నిలబడటం మన దేశంలో చాలా అరుదు. నిర్భయ ఉదంతం తర్వాతి పరిణామాలే ఈ మార్పుకు కారణమయ్యాయి.
 
ఢిల్లీ బస్సు ఘటనలో జ్యోతిసింగ్  సామూ హిక అత్యాచారానికి గురై తీవ్రగాయాలతో సింగ పూర్ ఆసుపత్రిలో మరణించిన తర్వాత ప్రతి డిసెంబర్ 16న ప్రపంచం ఆమెను నిర్భయగా, బ్రేవ్‌హార్ట్‌గా స్మరించుకుంటూ వస్తోంది. ఆసు పత్రిలో నరకయాతన అనుభవిస్తూనే తనపై అత్యాచార దాడికి పాల్పడిన వారి గురించి జ్యోతి సింగ్ నిర్భయంగా చాటి చెప్పింది. దాంతో జాతి మొత్తం స్పందించి అత్యాచారాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చింది. జ్యోతి విషాద మరణం  నేపథ్యంలో ఇండియా ఎగెనైస్ట్ రేప్ వంటి ఆన్‌లై న్ వేదికలు ఏర్పడ్డాయి. 2013లో నేర చట్టానికి సవరణ కూడా చేశారు. రేపిస్టులకు యావజ్జీవ కారాగారం, కొన్ని సందర్భాల్లో మరణ శిక్షకు కూడా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు.
 
అయితే ఈ స్పందనలు, చట్ట సవరణలు బహిరంగ స్థలాలను మహిళలకు సురక్షిత మైనవిగా మార్చాయా?  2012తో పోలిస్తే మహి ళలపై అత్యాచారాలు 2013లో 35.2 శాతం పెరి గాయని, వారిపై నేరాలు 26.7 శాతం పెరిగాయ ని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామ పంచాయతీ తీర్పుతో ఒక గిరిజన బాలి కపై సామూహిక అత్యాచారం చేశారు. తన తెగ కు చెందని వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు పడిన శిక్ష ఇది. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి, చంపి చెట్టుకు ఉరితీసిన ఘటన ప్రస్తుతం వివాదా స్పదమైంది. తర్వాత బెంగళూరులోని ఒక పాఠ శాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనకు రెండేళ్లు పూర్తి కావస్తుండగా ఒక ఐటీ ప్రొఫెషనల్‌పై ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఘాతుక చర్య వెలుగులోకి వచ్చింది.
 
గ్రామాల్లో, పట్టణాల్లో, ఇళ్లలో, వీధుల్లో, వాహనాల్లో, పాఠశాలల్లో, హాస్టళ్లలో పార్కుల్లో, ఎక్కడా భారతీయ యువతులకు రక్షణ లేదన్నది నేటికీ నిజమే. ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లపై కాకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోనిదే వాహ నాల్లో ఘాతుక చర్యలకు అడ్డుకట్ట పడదని మహి ళా సంఘాలు ఘోషిస్తున్నాయి. అయితే ఏ చర్యలు తీసుకున్నా కంటితుడుపు చర్యలే అవుతు న్నాయి. ప్రజారవాణా వ్యవస్థలన్నింటినీ జీపీ ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, 24 గంటలూ వాటి కదలికలపై నిఘా పెట్టాలని, 50 శాతం వాహనాల్లో మహిళా డ్రైవర్లను నియమించాలని, మహిళలకు ప్రత్యేకంగా సీట్లు, కంపార్టుమెంట్లు కేటాయించాలని ప్రతిపాదనలొస్తున్నాయి.
 
నిర్భయ ఘటన తరువాత నేర చట్టంలో మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చినా నేరస్థులకు సంబంధించిన డేటా బేస్‌ను రూపొందించడం లో ఘోర వైఫల్యం చెందింది. ఉబర్‌క్యాబ్ డ్రైవర్ గతంలో డజనుసార్లు అత్యాచారాలకు పాల్పడి నా, జైలుపాలైనా, ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నా అతడి వివరాలు నిఘా సంస్థల ద్వారా వాహన నిర్వాహకులకు అందకపోవడం మరో ఘోరానికి దారి తీసింది. అతి చిన్న అంశాలలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం పదే పదే దారుణాల పునరావృత్తికి కారణమవుతోంది.
 
మరోవైపు ఈ ప్రపంచాన్ని తమకు సురక్షిత స్థలంగా మార్చడానికి వ్యవస్థ ప్రయత్నాలు ప్రా రంభించేంత వరకు మహిళలు వేచి ఉండదల్చు కోవడం లేదు. తమపై నేర చర్యలకు పాల్పడిన ఘటనలను వారు నిర్భయంగా నివేదించడమే కాదు, దుండుగలను పట్టుకోవడంలో వారు పో లీసులకు సహకరిస్తున్నారు కూడా. ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఫొటో తీయడం ద్వారా బాధితురాలు పోలీసులు అతడిని గుర్తించే పనిని సులువు చేశారు. తమను మాటల రూపంలో, శారీరకంగా కూడా వేధించడానికి ప్రయత్నించిన వారిని యువతులు చితకబాదుతున్న ఘటనలు కూడా వార్తలవుతున్నాయి.

హరియాణాలోని రోహతక్ కు చెందిన అక్కాచెల్లెళ్లు బస్సులో తమ పట్ల అస భ్యంగా ప్రవర్తించిన వారిని బెల్టుతో బాదిన ఘటన వెనుక ఉద్దేశాలను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా రు కానీ, ఆ అమ్మాయిల సాహసాన్ని చాలా మంది ఆరాధనగా చూస్తున్నారు. పురుషుల కం టే తాము బలహీనులమనే భావాన్ని మన సమా జంలో యువతులకు, మహిళలకు నూరిపోస్తూ వస్తున్నారు. తాము బలహీనులమని, బాధితుల మని భావించకూడదు.

మహిళలందరికీ స్వీయ రక్షణ తరగతులను సుదీర్ఘ కాలంపాటు ఐచ్ఛికం చేయడం ద్వారానే అబలలం అనే భావాన్ని పో గొట్టగలం. దానికి తోడు అవమానం, శిక్ష అనేవి నేరస్తుడికే కాని బాధితులకు విధించకూడదని సమాజం ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మహిళా భద్రత వాస్తవ రూపం దాలుస్తుంది.

(నిర్భయ ఉదంతానికి రేపటితో రెండేళ్లు)
- కె.రాజశేఖరరాజు
 

మరిన్ని వార్తలు