న్యాయస్థానాల్లో తెలుగేదీ?

14 Dec, 2014 03:44 IST|Sakshi

ప్రస్తుతం న్యాయస్థానాల్లో దాఖలయ్యే దావాలు, అర్జీలు వాటి కి జవాబులు, ఫిర్యాదులు, కక్షిదారులు, వారి సాక్షుల సాక్ష్యా లు, తీర్పులు నూటికి నూరు శాతం ఆంగ్లంలోనే ఉంటున్నాయి. దీనివల్ల కక్షిదారులు తమ వ్యాజ్యాలలో ఏమి జరుగుతున్నదో, ఏమి నమోదవుతున్నదో స్వయంగా తెలుసుకోలేక నష్టపోతు న్నారు. తాను చెప్పదలచిన, చెప్పిన అంశం యథాతథంగా రాశారో లేదో స్వయంగా తెలుసుకునే అవకాశం కక్షిదారునికి లేకుండా పోతున్నది. ఆంగ్లంలో నమోదైన సాక్ష్యాలను, సాక్షుల మాతృభాషలో చదివి వినిపించి సరిగా ఉన్నదని నిర్ధారణ చేసుకునే యంత్రాంగం లేనం దున నమోదైన సాక్ష్యాలపై సాక్షులు, కక్షిదారు అయో మయంగా సంతకాలు చేసి వస్తున్నారు.
 
హిందీ రాష్ట్రా ల్లోని న్యాయస్థానాల్లో హిందీని, తమిళనాడు రాష్ట్రంలో తమిళాన్ని, కర్ణాటక రాష్ర్టంలో కన్నడాన్ని వాడుతున్నా మన రాష్ట్రం లో తెలుగును వాడటం తప్పుగా, చిన్నతనంగా, నామోషీగా భావించే న్యాయమూర్తులు న్యాయవాదులు, సిబ్బంది ఉన్నా రు. సామాన్య ప్రజల కోసం, సామాన్యుల భాషను న్యాయస్థా నాల్లో ఎందుకు వాడరు? న్యాయస్థానాల్లో తెలుగు వాడకం అత్యవసరం కాదా? బ్రిటిష్ పాలన వారసత్వంగా వచ్చిన ఇంగ్లిష్ వాడకాన్ని ఇకనైనా న్యాయస్థానాల నుంచి తొలగిస్తే చాలా మంచిది.
కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై
 

మరిన్ని వార్తలు