ప్యాకేజీతో మిగిలేది శూన్యం

15 Oct, 2015 09:09 IST|Sakshi
ప్యాకేజీతో మిగిలేది శూన్యం

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ అంటే తిరిగి చెల్లించాల్సిన అప్పు. గ్రాంట్ అంటే దానం. పాతకాలపు మాటల్లో ఇనాం అని అర్థం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఇచ్చేది కూడా దాదాపు దానమే. (తొంభై శాతం గ్రాంటు అని పిలిచే దానం, పది శాతం అప్పు). పూర్వకాలంలో రాజులు ధనదానం, ధాన్యదానం, భూదానం, ఖజానాకు వచ్చే పన్నుల దానం వంటి దానాలు చేసేవారు. వీటిని ప్రధానంగా సాగునీటి వసతులు కల్పించే వారికి (దశబంధం ఇనాంలు), ఆలయ నిర్మాణాలు-నిర్వహణలకు (దేవాల యాల ఇనాంలు), విద్య- అర్చక సేవలు చేసే బ్రాహ్మ ణులకు; పాఠశాలలు, అన్నదాన కేంద్రాలు, సత్రాలు, చలివేంద్రాలు వంటి వాటి నిర్వహణలకు ఇచ్చేవారు. కానీ కేంద్ర ప్రభుత్వ దానం (గ్రాంటు) నేడు రాష్ట్రాలకు ఇవ్వడం ద్వారా ప్రజలకు, సంస్థలకు, పరిశ్రమల వంటి వాటికి అత్యధిక మేలు జరుగుతున్నది.

తుపాన్లు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలైనట్లు, నవ్యాంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా కూలబడి ఉంది. అందుకే ఇలాంటి కేంద్ర దానం అవసరం. మరోవైపు సహాయం రూపంలో కూడా కేంద్రం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఆర్థికంగా చేయూత నిస్తుంది. ఉదాహరణకు విదేశీ ఆర్థిక సహాయంతో రాష్ట్రం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు వంటివాటికి, నదుల అనుసంధానం, నదుల క్షాళన, ఓడ రేవుల నిర్మాణం, మెట్రో ప్రాజెక్టులు వంటి వాటికి విదేశా లకు రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు, వడ్డీలను కేంద్రమే చెల్లించి, ఆర్థికభారం తగ్గించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడు తుంది.

అంటే, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పోలవరం, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులే గాక కొత్తగా మరెన్నో ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చుల్ని భరిస్తుంది. పరిశ్రమల స్థాపనకు, వ్యవసాయ రంగాభివృద్ధికి అవస రమైన విద్యుదుత్పాదన కేంద్రాల నిర్మాణ ఖర్చుల్నీ కేంద్రమే భరిస్తుంది. కుంటుపడిన ఆర్థిక పరిస్థితి బాగుపడేట్లు చేస్తుంది.

 ఇక, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు వచ్చే సహాయం కూడా రాష్ట్రాల మ్యాచింగ్ గ్రాంట్‌తో ప్రమేయం లేకుండానే పెద్ద మొత్తంలో వస్తుం ది. అంటే గ్రామీణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి, వెనుకబ డిన జిల్లాల అభివృద్ధి, డ్రాప్ అవుట్ పిల్లల విద్య కొనసా గింపు వంటి కార్యక్రమాలకు వచ్చే నిధులు కేంద్రం నుంచి దాదాపు దానంగానే వస్తాయి. దీనితో  ఆయా పరిధులలో అభివృద్ధి జరిగి, ప్రాంతీయ అసమానతలు తగ్గించుకోవడానికి ఇలాంటి రాష్ట్రాలకు వెసులుబాటు చిక్కుతుంది.

మరోవైపు ఎకై్సజ్ సంకాలు, కస్టమ్స్ సుం కాలు, ఆదాయపు పన్నులు, కార్పొరేట్ పన్నులు వంటి వాటిలో కేంద్రం మినహాయింపులు ఇస్తుంది. ఈ మినహాయింపులు వలన ఇలాంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించాలనుకొనే వారికి  మిగులు  సాధ్యమై ఆదా యాలు పెరుగుతాయి. తక్కువ ధరకు తమ సరకులు అమ్మకం చేయగల సామర్థ్యం ఏర్పడి, అమ్మకాలు పెరిగి మరింత లాభాలు చేకూరుతాయి. సరుకులు తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి  కొనుగోలు శక్తి విస్తరించి, ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి పరిశ్రమలు వృద్ధి చెందు తాయి. దీనితో పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది.

అక్షరా స్యులకే కాదు, నిరక్షరాస్యులకు, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. నిరుద్యోగం సమసి పోతుంది. కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. వల సలు, ఆత్మహత్యలు, నేరాలు, క–{తిమ కరువులు అదృశ్య మవుతాయి. ఇంకోవైపు రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొ న్న ప్రత్యేక సహాయం ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వెనుకబాటు తనాన్ని తగ్గించవచ్చు. రాజధాని నిర్మాణానికి అవసర మైన నిధులన్నింటినీ కేంద్రమే భరిస్తుంది.

రాష్ట్ర ఆర్థికవృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనలకు, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులన్నీ దాదాపు దానంగానే కేంద్రం నుండి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం పొం దుతుంది. దీనికి తోడు సాధారణ సహాయం కూడా ఎలాగూ పొందవచ్చు. అన్ని రాష్ట్రాలు పొందినట్లు ప్రత్యే క కేటగిరీ రాష్ట్రం కూడా వాటిని పొంది మరింత అభి వృద్ధికి నోచుకుంటుంది. వైఎస్సార్ కాలం నాటి అభి వృద్ధి స్థాయిలో ఏపీని ముందుకు తీసుకువెళ్లడానికి వీలు వుతుంది. కానీ మనకు త్వరితగతి వృద్ధిని ఇచ్చే హోదా కావాలా, కుంటి నడక ప్యాకేజీలు కావాలా అనేది మనం చేపట్టే ఒత్తిడి కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికే రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్‌కు దీర్ఘ కాలిక ఆర్థిక అనారోగ్యాలు, అంటురోగాలు వచ్చాయి. పంట భూములన్నీ విదేశీ, స్వదేశీ ప్రైవేట్ సంస్థల అధీనమైనాయి. వ్యవసాయం దాదాపు కనుమరుగై, వ్యవసాయ రంగం లేని వ్యాపార దళారీ లాంటి సింగ పూర్ లాగా కొత్త రాష్ట్రం మారుతోంది. మరి రైతులు పరిస్థితి ఏమిటి? ఈ ప్రైవేట్ రాజధానిలో, ప్రైవేట్ విమా నాశ్రయాల వంటి వాటిలో,  మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లలో, హోటళ్లలో, వాల్‌మార్ట్‌లలో ఫ్లోర్లు తుడిచే వారిగా, వంట చేసేవారుగా; ఇవి కూడా చేయ లేకుంటే అడుక్కుతినే వారిగా రైతులు, వ్యవసాయ కూలీ లు, ఇతర వృత్తుల వారు బతకాల్సిన పరిస్థితి వస్తుంది.

నేటి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక కేటగిరీ ఇవ్వన ట్టయితే, ఇది ప్రైవేట్ రాజధాని, ప్రైవేట్ విమానా శ్రయాలు, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రైవేట్ ఓడరేవులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ తాగునీటి అంగళ్లు, ప్రైవేట్ సాగునీటి అమ్మక కేంద్రాలు, ప్రైవేట్ అడవులు, ప్రైవేట్ పార్కులు, ప్రైవేట్ పార్కింగ్‌లు, ప్రైవేట్ టూరి జం, ప్రైవేట్ విద్యుత్తు వంటి వాటితో నిండిపోతుంది. బ్రిటిష్ ఈస్టిండియా ప్రైవేట్ కంపెనీ మన దేశం మీద పెత్తనం సాధించి పీడించుకు తిన్నట్లు ఈ ప్రైవేట్ వ్యవ స్థలు జనాన్ని పీల్చుకుతింటాయి. వాటి పీడ వదిలించడా నికి  మరో గాంధీ మహాత్ముడు పుట్టి దీర్ఘకాలిక ఉద్యమం నడపాల్సి ఉంటుంది. ఇందతా సత్యం. జనం తమ కర్తవ్యం ఏమిటో తక్షణం నిర్ణయించుకోవాలి.

-దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి
వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, మొబైల్: 9849584324

మరిన్ని వార్తలు