రాహుల్ మౌఢ్యానికి మూల్యం

31 Jan, 2016 01:02 IST|Sakshi
రాహుల్ మౌఢ్యానికి మూల్యం

బైలైన్
నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా 58 శాతం ప్రజలు పరిగణిస్తున్నారు. ఇది పరిపూర్ణమైన ఆధిక్యమే. ప్రజాదరణ విషయంలో తరువాతి స్థానంలో రాహుల్ గాంధీయే ఉన్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రాహుల్ గాంధీకి 11 శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉంది. ఈ సర్వేలో అంతే ప్రాధాన్యం కలిగిన మరొక అంశం- బీజేపీ ఓట్లు తగ్గడానికి బదులు గణనీయంగా పెరిగాయి. కాంగ్రెస్‌కు ఉన్న ప్రజా మద్దతు నాటకీయంగా పడిపోయింది కూడా. 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 19.52 శాతం ప్రజల మద్దతుకే పరిమితమైంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సర్వే ప్రకారం, ఆ పార్టీకి 14 శాతం మద్దతు మాత్రమే దక్కుతుంది.
 
దేశప్రజల ప్రస్తుత మనోగతం గురించి ఏబీపీ న్యూస్-నీల్సన్ చేసిన సర్వే ఫలి తాలు చూసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఎలా మూగబోయిందో గమనించ వచ్చు. ఆ ఫలితాలు ఆ పార్టీ అధినాయకులను ఎలా విస్తుపోయేటట్టు చేశాయో కూడా ఊహించవచ్చు. ఆ సర్వేలో కనిపించే అంకెలే సమస్తం చెబుతాయి. స్వతంత్ర భారతదేశ ప్రధానులలో నరేంద్ర మోదీని అత్యుత్తమ ప్రధానిగా భారతీయులు భావిస్తున్నారని ఆ సర్వే చెబుతోంది. ఆ తరువాతి స్థానాలలో ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి నిలుస్తున్నారు. ఆ ముగ్గురికీ వరసగా 32 శాతం, 23 శాతం, 21 శాతం నిష్పత్తితో మద్దతు లభించింది.

పద్దెనిమిది మాసాల ఎన్డీఏ పాలన సాగిన తరువాత, ఈ తరుణంలో కనుక సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఆ కూటమి లోక్‌సభలో 301 సీట్లు గెలిచి పూర్తి ఆధిక్యం సాధిస్తుంది. పార్లమెంటులో అనుసరిస్తున్న బురద చల్లి తప్పించుకునే వ్యూహాన్ని కాంగ్రెస్ నాయకత్వం తన ఎంపీలతో అంతర్గతంగా చర్చిస్తున్నప్పుడు సమ ర్ధించుకుంది. పట్టు విడుపులు లేకుండా సభను స్తంభింప చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది తప్ప నష్టం ఏమీ ఉండదని ఎంపీలతో మాట్లాడినప్పుడు చెప్పింది. గత ఏడాదిగా ప్రధాని వ్యక్తిగత ప్రతిష్టకు చేటు జరిగిందని కూడా అధిష్టానం తన ఎంపీలతో పేర్కొంది. అయితే ఈ సర్వే ఆ ఊహ లన్నీ పెద్ద భ్రమ అని తేల్చింది.

నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా 58 శాతం ప్రజలు పరిగణిస్తున్నారు. ఇది పరిపూర్ణమైన ఆధిక్యమే. ప్రజాదరణ విషయంలో తరువాతి స్థానంలో రాహుల్ గాంధీయే ఉన్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రాహుల్ గాంధీకి 11 శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉంది. ఈ సర్వేలో అంతే ప్రాధాన్యం కలిగిన మరొక అంశం- బీజేపీ ఓట్లు తగ్గడానికి బదులు గణనీయంగా పెరిగాయి. కాంగ్రెస్‌కు ఉన్న ప్రజా మద్దతు నాటకీయంగా పడిపోయింది కూడా. 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 19.52 శాతం ప్రజల మద్దతుకే పరిమితమైంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సర్వే ప్రకారం, ఆ పార్టీకి 14 శాతం మద్దతు మాత్రమే దక్కుతుంది. రాహుల్ మూఢత్వానికి కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తున్న మూల్యమిది.

ఎన్డీఏ కోల్పోతున్న అతి కొద్ది స్థానాలను కాంగ్రెస్ నాయకత్వంలోని చిన్న చిన్న పార్టీలు కైవసం చేసుకుంటాయే తప్ప, కాంగ్రెస్‌కు ఆ అవకాశం లేదు. అయితే కాంగ్రెస్ సంఖ్యాపరంగా ఎన్ని స్థానాలు గెలుచుకోగలదన్న విష యాన్ని సర్వే స్పష్టంగా చెప్పలేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ రాజ్యసభను దిగ్బంధనం చేస్తున్న తీరు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు ఆమోదం విషయంలో ఆ పార్టీ వెన్నుపోటు వైఖరిని ప్రజలు గమనించడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ప్రశ్నకు స్పందించిన వారిలో 44 శాతం మంది జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టకుండా నిరోధిస్తున్నది ప్రతిపక్షాలేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలలో మళ్లీ ప్రధానంగా కాంగ్రెస్‌నే వారు తప్పు పట్టారు. 30 శాతం మాత్రం కాంగ్రెస్ వైఖరిని సమర్థించారు. ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమం కూడా ప్రజామోదానికి నోచుకుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని 48 శాతం ప్రజలు చెబుతున్నారు.

గణాంకాలు పరిశీలించే అవసరం లేకుండానే ఈ సమాచారంలోని వాస్తవాన్ని గ్రహించవచ్చు. ఎలాగంటే ఆర్థిక ప్రగతిని నిరోధించే ఏ రాజకీయ పార్టీనైనా ప్రజలు ఎల్లప్పుడూ తిరస్కరిస్తారు. జీఎస్‌టీ సానుకూల ఫలితాలు ఇచ్చేదని అంతా గుర్తిస్తున్నా, కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పెద్ద హేతువు కానరాదు. అభివృద్ధికి సంబంధించి మోదీ ఖాతాలో ఎలాంటి ప్రతిష్ట జమ కాకుండా నిరోధించడానికి విచక్షణ కోల్పోయి ఆ పార్టీ ఆ బిల్లుకు అభ్యంతర పెడుతోంది. నిజానికి 2014 ఎన్నికలలో తమను ఓడించినందుకు కాంగ్రెస్ ప్రజల మీద ఇలా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఓటరు ఈ వైఖరిని ఎందుకు మరచిపోతాడు? ఎందుకు క్షమిస్తాడు? ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది అన్న అంశంతో సంబంధం లేకుండానే ఒక వర్గం ఓటర్లు ఇప్పటికీ  ప్రధాని విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి వచ్చిన రేటింగ్స్‌ను చూస్తే అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఉద్వేగభరితమైన, ఆఖరికి హేతు రహిత ప్రతిస్పందన లకు కూడా వాటి చోటు వాటికి ఉంటుంది. కొంత సమయం పడితే పట్టవచ్చు గానీ వీటిని సుపరిపాలనతో అధిగమించవచ్చు. ఏమైనా మొత్తంగా ఈ సర్వే తేల్చినదేమిటంటే, ఆయన అసాధారణమైన ప్రధాని. ఆయన ప్రభుత్వం నిజాయితీతో కూడినది. ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తున్నది.

ప్రస్తుత ప్రజల మనోగతంలో రెండు అంశాలు మరీ ఆసక్తిదాయకంగా ఉన్నాయి. అందులో ఒకటి- స్థిమితంగానే అయినా, వామపక్షం తిరిగి పుంజుకోవడం. 2014 ఎన్నికలలో దారుణ పరాభవం చవిచూసినా, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వామపక్షాలు 20 స్థానాలు గెలుచుకుంటాయి. తూర్పు భారతంలో, అంటే పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వాటి బలం నాలుగు నుంచి తొమ్మిదికి పెరుగుతుంది. త్రిపురలో ఆ పార్టీ బలం క్షీణించలేదు కాబట్టి, వాటి సీట్ల పెరుగుదల బెంగాల్‌లోనే అయి ఉండవచ్చు. అయితే వచ్చే వేసవిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నిశ్చయంగా మరోసారి అధికారం చేపడతాయన్న సంప్రదాయ బద్ధమైన ఆలోచనను సర్వేలోని ఈ అంశం ప్రశ్నించేలా ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఏదీ సులభం కాదు. భారత ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఆ పదాన్ని నిఘంటువు నుంచి తుడిచివేయవచ్చు కూడా.

తూర్పు భారతంలో కనిపిస్తున్న మరో ధోరణిని కూడా గమనించాలి. 2014 ఎన్నికలలో సాధించిన విజయాలను బట్టి చూస్తే అక్కడ ఎన్డీఏ బలంలో 15 స్థానాలు తగ్గుతున్నాయి. అయినా బిహార్, బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతాలలో 31 శాతం ఓట్లతో 42 స్థానాలను ఎన్డీఏ సాధించుకోగలదు. ఈ ఊహ అసహజం కాదు. కేంద్రంలో తమకు ఓటు వేయవలసిందిగా ప్రధాని కోరినప్పుడు ప్రజామోదం అందుకు అనుకూలంగానే ఉంటుంది.
 
రెండోది- పాకిస్తాన్‌తో ప్రధాని అనుసరిస్తున్న విధానానికీ, ఆ దేశంతో చర్చలు జరపాలన్న ఆయన ప్రయత్నాలకీ విశేషమైన మద్దతు ఉంది. ఈ సర్వే పఠాన్‌కోట్ వైమానిక కేంద్రం మీద దాడి తర్వాత జరిగినదే. ఆ దాడి తరువాత కూడా ఇదే అభిప్రాయం నిలిచి ఉంది. భద్రతను పణంగా పెట్టకుండానే ఉపఖండంలో శాంతి నెలకొనాలని అందరికీ ఆతృతగా ఉంది. ప్రజాభిప్రా యాన్ని ప్రధాని మోదీ నాజూకుగా కొలిచారు. మొత్తంగా ప్రధాని విదేశాంగ విధానానికి 50 శాతం ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. 50 శాతం ప్రజలు ఆయన విధానానికి ఆమోదం తెలిపారు. 35 శాతం ఆయన విధానాలను అంగీకరించడం లేదని చెప్పారు. ఈ సర్వే వచ్చే బడ్జెట్ సమావేశాలలో అయినా తన విధానాన్ని మార్చుకునే విధంగా కాంగ్రెస్‌ను తీర్చగలుగుతుందా? దీనికి సమాధానం కాంగ్రెస్ అధిష్టానమే చెప్పగలదు. అయితే ఒక హెచ్చరికను వినాలంటే ముందు ఉష్ట్రపక్షి వ్యవహారం మాని, చెవులను వినడానికి అనువుగా ఉంచాలి.
 

ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు,
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు  బీజేపీ అధికార ప్రతినిధి

>
మరిన్ని వార్తలు