ప్రజా రోగ్యానికి ‘చేతి’మాత్ర

30 Apr, 2014 00:31 IST|Sakshi
ప్రజా రోగ్యానికి ‘చేతి’మాత్ర

ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దరిద్రరేఖ దిగువన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది.
 యువరాజావారు కొండను తవ్వి ఎలుకను పట్టగలిగారు! ఆరోగ్య - ఆవాస అవసరాలు తీరక జనం నానా యాతన పడుతున్నారని తెలుసుకోగలిగారు. ఆయన జరిపిన మహాధ్యయనం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. దాన్ని పవిత్ర పత్రంగా అభివర్ణించింది. జనజీవన భద్రతపై మాట్లాడే ప్రణాళికను పవిత్రమైనదంటే తప్పేమీ లేదు గానీ, కాంగ్రెస్ అధినేతలు ఇన్నేళ్లుగా ఈ రంగాల్లో చేసిందేమిటన్నది ఒక ముఖ్య ప్రశ్న. గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలూ, మౌలిక సౌకర్యాలూ కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం-2005) అమలులో ఆశించిన ఫలితాలు సాధించలేదన్నారు ప్రధాని మన్మోహన్. వైద్యఖర్చులు భరిం చలేక ఏటా 4 కోట్లమంది పేదరికం పాలపడుతున్నారని చెప్పారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ పరిస్థితిని చక్కదిద్దని కాంగ్రెస్ - ఇప్పుడు ప్రజారోగ్యానికి భరోసా ఇస్తానం టోంది.  ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో  యూపీఏ పనితీరును రేఖామాత్రంగా అవలోకిద్దాం. 2013 -14 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ. 37,330 కోట్లు. ఇందులో ఎన్‌హెచ్‌ఎం వాటా 21,239 కోట్లు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం - జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)లను కలిపి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఏర్పాటు చేశారు.

అంతకు ముందు సంవ త్సరం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.30,000 కోట్లు  కేటా యించగా, అందులో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం వాటా రూ. 20,822 కోట్లన్నారు. ఈ పథకంలో ఎన్‌యూహెచ్‌ఎంను విలీనం చేశాక అదనంగా కేటాయించింది 417 కోట్లే! ఇంత స్వల్ప కేటాయింపులతో పౌరులందరికీ ఆరోగ్యభద్రత  కల్పించడం అసంభవం. 12వ ప్రణాళికలో రూ.3,00,000 కోట్లతో ఆరో గ్యసేవల్ని సార్వత్రీకరిస్తామన్న ప్రభుత్వం.. ఆ దిశగా కేటా యింపులు జరపలేదని పై లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మన విధాననిర్ణేతలు ప్రజారోగ్యాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించబూనుకున్నారని భావించాల్సి వస్తోంది. ప్రైవేటు రంగం గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి వెనుకబడిన - మారుమూల గ్రామాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడదు. ప్రభు త్వరంగంలో తగిన పెట్టుబడులు పెట్టడం - ఆరోగ్య పథ కాల్ని నిజాయితీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజ లు మెరుగైన ఆరోగ్యసేవలు పొందేందుకూ ఆర్థిక భారాల నుంచి బయటపడేందుకూ వీలవుతుంది. కానీ ఈ విష యంలో ప్రభుత్వం విఫలమైంది.

 ప్రజారోగ్యానికి సంబంధించిన పలు లక్ష్యాలతో ప్రారం భమైన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం మాతా శిశు మరణాలపైనే రవ్వంత దృష్టి సారించింది. 2005 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోద వుతున్న మాతృ మరణాల్లో 20శాతం పైగా భారతదేశంలో చోటు చేసుకున్నవే. ప్రసవానంతర నాలుగు వారాల్లో నమో దయ్యే మరణాల్లో 31 శాతం మన దేశానివే. ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా మాతా శిశు మరణాలు తగ్గించాలన్న సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలకూ కట్టుబడింది. ఈ నేపథ్యంలో - దరిద్రరేఖ దిగు వన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇం దుకోసం 2005లో ‘జననీ సురక్షా యోజన’ పథకం ప్రారం భించింది. గర్భిణులకు రూ.1400 ఇవ్వడం ద్వారా వారిని ఆసుపత్రి ప్రసవాల వైపు మళ్లించబూనుకుంది. నగదు బది లీతో ముడివడిన అంశం కాబట్టి - ఈ అంశంలో కొద్ది ఫలి తాలు కనిపిస్తున్నాయి.

2005లో 50శాతంగా ఉన్న ఆసుపత్రి ప్రసవాలు 2012 నాటికి 70శాతానికి పెరిగాయి. అయితే, పేదరికం - పోషకాహారలోపం కారణంగా మాతా శిశు మర ణాలు నిర్దేశించుకున్న స్థాయిలో తగ్గడం లేదు. ప్రసవానం తర నాలుగు వారాల్లో సంభవించే శిశు మరణాలు పేద కుటుంబాల్లో అధికంగా ఉంటున్నాయి (వెయ్యికి 56).  2004-06 మధ్య  254 (ప్రతి లక్ష మందికి)గా  ఉన్న మాతృ మరణాల రేటు 2012 నాటికి 178కి తగ్గింది. శిశు మరణాల రేటు 2011 నాటికి 44కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టిన రోజునే చనిపోతున్న శిశువుల్లో 29 శాతం మంది మన దేశ శిశువులే. మెరుగైన ఆరోగ్య సేవలు లభిస్తే తొలిరోజు మర ణాల్లో సగానికి సగం తగ్గించవచ్చు. కానీ అనవసర ఆర్భా టం చేయడం తప్ప వీటిపై శ్రద్ధ పెట్టని మన పాలకులు - ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి తమ అజెండా అంటున్నారు. ఈ అజెండాకు కట్టుబడే ప్రభుత్వాలు ఏవైనా ముందు సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. పరిశుభ్రమైన నీరూ, పోషకాహారమూ, పారిశుధ్యమూ, ఆరోగ్య - ఆవాస - విద్యా సౌకర్యాలతోనే ఆరోగ్యకర సమాజం నిర్మితమవుతుందని గుర్తించాలి.
 
వి.ఉదయలక్ష్మి

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు