సబ్ ప్లాన్ రాకుంటే ఆకలి చావులే!

31 Oct, 2013 00:45 IST|Sakshi
సబ్ ప్లాన్ రాకుంటే ఆకలి చావులే!

ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి  ప్రత్యామ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీకరణ జరిగి, లాభసాటి కాగానే దానిని సంపన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి.
 
 అనాదిగా సంపద సృష్టికి, సమాజ మనుగ డకు కారణభూతులైన చేతివృత్తులు, కులవృ త్తుల వారి మనుగడ ఈ రోజు ప్రశ్నార్థకమైం ది. 1992 నాటి సరళీకృత ఆర్థిక విధానాల తరువాత, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరి శ్రమలు రావడంతో దాదాపు 42 కులవృ త్తులు పూర్తిగా కుదేలయి వాటిని నమ్ముకున్న  కులాలు విలవిలలాడుతున్నాయి. ప్రపంచం శరవేగంతో ముందుకు పోతు న్నది. ఈ సందర్భంలో కులవృత్తులు, చేతి వృత్తుల స్థానంలో యాంత్రీకరణ, కంప్యూటీ కరణ, కార్పొరేటీకరణ జరగడాన్ని వ్యతిరేకిం చనవసరం లేదు. పాత వ్యవస్థ కొనసాగాలని కోరడం సబబు కాదు. కాని ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి  ప్రత్యా మ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజా స్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీక రణ జరిగి, లాభసాటి కాగానే దానిని సం పన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి.
 
 ప్రపంచ దేశాలు ఆధునికీకరణ చెందే క్రమంలో ఆయా ప్రభుత్వాలు అన్ని వర్గాలను ఆ మార్పులకు భాగస్వాములను చేస్తున్నా యి. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అం దిస్తున్నాయి.  దాదాపు 40 దేశాలలో వచ్చిన పురోగతి అన్ని వర్గాలకు సమంగా చేరింది. మన దేశంలో ఆ సమతుల్యత కానరాదు. బట్ట ల మిల్లులు, ఫ్యాక్టరీలు న్యాయబద్ధంగా  చేనే త కార్మికులకు; డిస్టిలరీలు, బ్రేవరీస్, వైన్‌షా పులు గీత కార్మికులకు చెందాలి. అలా జరగ డంలేదు. చేపల చెరువులు, రొయ్యల చెరు వులు మత్స్యకారులకు కేటాయించడంలేదు. ఇవన్నీ  పారిశ్రామిక వర్గాల వశమై, వృత్తులు కోల్పోయిన వారు ఆకలి చావులు చస్తున్నారు.  54 శాతం ఉన్న చేతివృత్తులు, కులవృత్తుల వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవ డం ఉచిత సహాయమని ప్రభుత్వం భావించరాదు. మానవ వనరులను సద్వినియోగం చేస్తున్నా మనే కోణంలో చూడాలి.
 
 ఈ అంశంలో ప్రభుత్వ విధానాలు మొక్కుబడిగా ఉంటే మంచిది కాదు.  ఫెడరే షన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రస్తుతం ఒక్కొ క్కరికి కేవలం 5 వేల రూపాయలు మంజూరు చేస్తున్నారు. దీనితోనే అభివృద్ధి చెందగలరా? కార్పొరేటీకరణ నేపథ్యంలో రజకులకు ఒక్కొ క్కరికి 5 వేలు మంజూరు చేస్తే ‘డ్రైక్లీన్ షాప్’ ఎలా పెడతారు?  కాబట్టి 17 ఫెడరేషన్ల వారికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే తప్ప, వృత్తిలో యాంత్రికీకరణ సాధించలేరు. 20 వేల కోట్ల బడ్జెట్‌తో సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షే మ సంఘం ముఖ్యమంత్రితో నాలుగు దఫా లు చర్చించింది. కుల, చేతివృత్తులకు ప్రత్యా మ్నాయ ఉపాధి, రోడ్లపాలైన 124 కులాల వారికి బీసీ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లిం కు లేకుండా రుణాలు మంజూరు చేయడం. కులవృత్తులను ఆధునీకరించి, కార్పొరేట్ స్థాయిలో పోటీ పడి నడిపించడానికి  వృత్తిని బట్టి ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం, ఫీజుల రియింబర్స్‌మెంట్ పథకానికి పెట్టిన షరతు లను తొలగించడం, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సుల వారికి పూర్తి ఫీజులు మంజూరు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 244 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీ రెసిడెన్షి యల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు మం జూరు చేయడం.
 
 పాఠశాల స్థాయి విద్యా ర్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమును పునరుద్ధరించి ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున స్కాలర్‌షిప్ 10 నెలలపాటు ఇవ్వ డం వంటి డిమాండ్లను బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం ముందు ఉంచింది. అన్ని రంగా లలో శాఖల వారీగా బీసీ జనాభా ప్రకారం సబ్ ప్లాన్‌కు 50 శాతం బడ్జెట్ కేటాయించా లని కూడా సంఘం కోరుతోంది. ఈ డిమాం డ్లతోనే కలెక్టరేట్లు ముట్టడి జరిగింది. దీనితో  నలుగురు మంత్రుల ఉపసంఘం వేశారు. కానీ ఇంకా ఏమీ తేలలేదు.  ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ బియ్యం, ఆహార భద్రత, అభయ హస్తం, బంగారు తల్లి లాంటి పధకాలతో వారి బతుకులు బాగుపడవు. ఎప్పుడూ చేత లు చాచేవిగానే మిగిలిపోతాయి. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగపడతాయి. 66 ఏళ్ల స్వాతంత్య్రంలో ఈ కులాలను ప్రభు త్వాలు ఇలాగే మోసగిస్తున్నాయి. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి సత్వరం స్పందించవలసిన సమయమిది.
 - ఆర్.కృష్ణయ్య
 అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం

>
మరిన్ని వార్తలు