సుందర భారతం కొందరిదే

28 Jul, 2015 23:21 IST|Sakshi
సుందర భారతం కొందరిదే

సందర్భం
 
అభివృద్ధి పేరిట దేశ సంపదలను కొల్లగొడుతున్నందువల్లే ధనిక, పేద తేడాలు పెరుగుతున్నాయి. వాటిని కప్పిపుచ్చడానికే ప్రచారార్భాటం. పుష్కర స్నానంతో పాపపరిహారం సరేగానీ, ఈ దుర్మార్గ వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సిద్ధమవుదాం!
 
దేశం ప్రగతి పథంలో మునుముందుకు పోతోం దని మోత మోగుతోంది. ప్రత్యేకించి ప్రధాని నరేం ద్రమోదీ సారథ్యంలో దేశం అభివృద్ధిబాట పట్టి, సుసంపన్నమైపోతోందని తెగ ప్రచారం సాగుతోం ది. అయితే ఇటీవల విడు దలైన ‘గ్లోబల్ వెల్త్ డేటా-2014’ (ప్రపంచ సంప దల గణాంక సమాచారం) తెలుపుతున్న వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సైతం కీలకమైనదిగా పేర్కొన్న ఈ గణాంక సమాచారం ప్రకారం 110 కోట్ల జనా భా ఉన్న భారతదేశ మొత్తం సంపదలో దాదాపు సగం (49%) జనాభాలో ఒక్క శాతం (ఇంచుమిం చు కోటి మంది) చేతుల్లోనే ఉంది! మిగతా సగం సంపదలో (51%) నాలుగింట మూడువంతులు 10% జనాభా చేతుల్లోనే ఉందట. అంటే 89% జనా భాకు ఉన్నది 13% సంపద మాత్రమే. ఇంచుమిం చు 8 కోట్ల వరకు ఉండే ఆదివాసుల చేతుల్లో ఉన్న సంపద అందులో 1% మాత్రమే. బిహార్ ఎన్నికల సాకుతో కులాల వారీ లెక్కలను బయటపెట్టలేదు గానీ, లేకపోతే దళితుల, బడుగువర్గాల ఉద్ధరణ పేరిట పాలకులు చెప్పుకునే గొప్పల బండారం కూడా బయటపడేదే. ఏదిఏమైనా ఇలా దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రంగా విస్తరిస్తుండగా... అభి వృద్ధి అంటే శత సహస్ర కోటీశ్వరుల ఆస్తులను పెం పొందించడమే తప్ప సామాన్య ప్రజల జీవన పరిస్థి తులను మెరుగుపరచడం మాత్రం కాజాలదు.  

ప్రజల ఆదాయాలు, ఆహారం, విద్య, వైద్యం, గృహవసతి వంటి కనీస అవసరాలు తీరడం, వాటి నాణ్యతలే నిజమైన అభివృద్ధికి కొలబద్ధలు. నేటికీ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే ఉంటోంది. ‘పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు’, ‘రైతే రాజు’, ‘వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక’ అంటూ పాలకులు తెగ ఊదరగొట్టడం మామూలే. కానీ వ్యవసాయాధారిత కుటుం బాల్లో 30%కు సెంటు భూమి కూడాలేదు. రెక్కల కష్టమే జీవనాధారం. పని దొరికితే అర్ధాకలైనా తీరుతుంది, లేకుంటే పస్తు లే. పూరి గుడిసెల్లో గడిపేవారు 54%. కాగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఒక్కటే గది లేదా గుడారంలో పిల్లాజెల్లా కుటుంబమంతా గడిపేవారు 14%. వీటికి సైతం అద్దె చెల్లిస్తున్నవారు12%! ఇక 4.5% గూడే లేకుండా ఆకాశం కప్పుకింద బతికేస్తున్నారు.

పేదరిక నిర్మూలనే ధ్యేయమని తెగ ఊదరగొట్టే మోదీ ప్రభుత్వం దమ్మిడీ ఖర్చుగానీ, ఫలితంగానీ లేని మూడు కార్యక్రమాలను చేపట్టింది. ‘స్వచ్ఛ భారత్’, ‘బ్యాలెన్సే లేని బ్యాంకు ఖాతాలను తెరి పించడం’, ‘యోగా దినం’ అట్టహాసంగా నిర్వహిం చింది. ప్రచార ఆర్భాటమే తప్ప వీటివల్ల పేదసాద లకు, సామాన్యులకు కలిగిన ప్రయోజనం శూన్యం. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని ఇళ్లు 54%, నెలనెలా క్రమబద్ధమైన ఆదాయం లేని వారు 90%. 10%కి మాత్రమే నెలనెలా జీతానికి హామీ ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా, ప్రపంచం లోని ప్రతి నలుగురు కటిక దరిద్రుల్లో ఒకరు (25%) మన దేశంలోనే ఉన్నారు. తిండికే లేనివారు విద్య, వైద్యం కోసం ఎలా ఖర్చు చేయగలరు? అనే యోచ నే పాలకులకు లేదు. నిర్వహణ, సదుపాయాలు బాగా లేవంటూ ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలను మూసేసి, ప్రజారోగ్యాన్ని, విద్యను ప్రైవేటు, కార్పొ రేటు రంగ జలగలకు అప్పగించి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చేతులు దులిపేసుకుంటున్నాయి.
 గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వ హించిన ఒక జాతీయ సర్వే గత 7-8 ఏళ్లలో విద్యపై సాధారణ కుటుంబాల ఖర్చు రెట్టింపయిందని అం చనా వేసింది. ప్రాథమిక విద్యకు సైతం కనీసం ఏడాదికి రూ.10 వేలు ఖర్చవుతోంది. ఇకపై తర గతులకు, కళాశాల, సాంకేతిక విద్యలకు ఖర్చు పలు రెట్లు పెరుగుతూపోతోంది.

ప్రభుత్వ ఆసుపత్రు లలో డాక్టర్లు, మందులు, సౌకర్యాలు లేకుండా చేసిన ఫలితంగా ప్రజలు ప్రైవేటు వైద్యం కొనుక్కోక తప్పడంలేదు. గ్రామీణ పేదలు సైతం నెలసరి ఆదాయం కంటే 15 నుంచి 20 రెట్లు ఎక్కువగా వైద్యం కోసం ఖర్చు చేయాల్సివస్తోంది. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, దివాలా తీయాల్సి వస్తోంది, బికారులుగా మారాల్సి వస్తోంది. విద్య, వైద్యం శ్రామికులకే కాదు మధ్యతరగతికి సైతం కొనుక్కోడానికి కూడా అందనివిగా మారిపోవడ మనే ఈ దుస్థితి కుటుంబ సంబంధాలపై, అనుబం ధాలపై, మానవ సంబంధాలపై సైతం తీవ్ర దుష్ర్ప భావం చూపుతోంది.

 ఇది చాలదని మోదీ ప్రభుత్వం ‘అభివృద్ధి’ పేరిట అంతో ఇంతో భూవసతి ఉన్న రైతుల భూములను లాక్కుని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు, రియల్ ఎస్టేటర్లకు కట్టబెట్టేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టా నికి సవరణలను చేపట్టే పేరిట అది కొత్తగా తయా రు చేసిన బిల్లు రైతాంగం భూములను నిర్లజ్జగా లాక్కుని, కుబేరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నిలువు దోపిడీ బిల్లు వల్ల నిర్వాసితులయ్యే రైతు ల, కూలీల జీవనోపాధి సమస్యనుగానీ, దేశ ఆహార భద్రతకు కలిగే ముప్పునుగానీ పట్టించుకోకుండా రైతుల భూములు లాక్కోడానికి సిద్ధమైంది. మోదీ ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా ఆ బిల్లును నెగ్గించుకోలేక ఆర్డినెన్స్ మీద ఆర్డినెన్స్ జారీ చేస్తూ రైతులకు మరణ శాసనాన్ని విధిస్తోంది.

 ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇలాంటి దొడ్డిదోవ పాలనలో ఆరితేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే బాటపట్టారు. రాజధాని ప్రాంతం పేరిట లక్ష ఎకరాలు, వివిధ అభివృద్ధి కేం ద్రాల పేరిట మిగతా ప్రాంతాల్లో మరో తొమ్మిది లక్షల ఎకరాలు సాగుభూములను స్వాహా చేసి, కార్పొరేట్లకు, రియల్టర్లకు కట్టబెట్టడంలో తలము నకలై ఉన్నాడు. పాలకులకు తగినట్టే, పెద్ద ఎత్తున రైతాంగాన్ని భూముల నుంచి తొలగిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందదని బాహాటంగానే పాలకవర్గ మేధా వులు విశ్లేషణలను గుప్పిస్తున్నారు.

 అభివృద్ధి ముసుగులో దేశ సంపదలను కొల్ల గొడుతున్న ఫలితంగానే ధనిక, పేద తేడాలు పెరిగి పోతున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు, మీడియా మేనేజిమెంటు కొన సాగిస్తున్నారు. అది తారస్థాయికి చేరి వికటించిన ఫలితంగానే రాజమండ్రి పుష్కరాల్లో 27 మంది అమాయకులు అన్యాయంగా బలైపోయారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల ఎడతెగని ప్రచారంతో కోట్లలో పోటెత్తిన భక్తులకు పుష్కర స్నానంతో పాప పరిహారం జరిగిందో లేదో తెలియదు. కానీ హృద యమే లేని పాలకులు కావలి కాస్తున్న దుర్మార్గ వ్యవస్థ సృష్టిస్తున్న ఆర్థిక అసమానతల వల్ల కలు గుతున్న అనర్థాలకు మాత్రం మరే నిష్కృతీ లేదు... ఈ దుర్మార్గ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయ డం  తప్ప. అందుకు సిద్ధం అవుదాం!

http://img.sakshi.net/images/cms/2015-07/51438108955_Unknown.jpg







ఏపీ విఠల్ (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు)
మొబైల్: 98480 69720
 

మరిన్ని వార్తలు