రెండో రాజధాని హైదరాబాద్

1 Feb, 2015 06:58 IST|Sakshi
రెండో రాజధాని హైదరాబాద్

హైదరాబాద్ నగరం దేశంలోని పలు రాష్ట్రాలకు సమీపంగా ఉండి రైల్వే, విమాన, బస్సు మార్గాలను కూడా కలిగి ఉంది. అల నాటి నైజాం నవాబుల కాలంలోనే ఇది అంతర్జాతీయ నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి దీనిని దక్షిణ భారతీయులకు కేంద్రపరంగా దేశము యొక్క రెండవ రాజధానిగా హైదరాబాద్ అని ప్రకటిస్తే దేశ వాసులందరికీ ప్రయోజన కరం. అదీగాక ఈ నగరంలో మరాఠీ, బెంగాలీ, తమిళ, కన్నడిగ, ఆంధ్రసీమ వారలకే గాక ఉత్తర భారతం నుండి వలస వచ్చిన యూపీ, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి వారికి ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకొన్నది.
 
 సింధీలు, ముస్లింలు, పార్శీలు, కిరస్తానీలు, జైనులు, సిక్కులను సైతం తనలో కలుపు కొని సాహితీ సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్నది కదా! మరి అలాంటి దీనిని మన భారతదేశానికి ఉపరాజధానిని చేస్తే రాజ ధాని కూడా సురక్షిత కేంద్రంగా భాసిల్లుతుందన్న విషయాన్ని విజ్ఞులు, మేధావులు రాజకీయ నాయకులు మరియు కేంద్ర మంత్రివర్యులు (తెలుగు ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహి స్తున్న వారు) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేలా ఆలోచిస్తే బావుంటుందని అనిపిస్తుంది.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్

మరిన్ని వార్తలు