అభివృద్ధికి ఆయనే చిరునామా!

7 Jul, 2015 23:32 IST|Sakshi
అభివృద్ధికి ఆయనే చిరునామా!

సందర్భం
 
తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రమించినంతగా మరెవరూ శ్రమించలేదు. యావద్దేశం ఆశ్చర్యపోయేలా వినూత్న పథకాలతో తెలుగు ప్రజలు జీవించడానికి ఒక ఆశావహ వాతావరణం కల్పించారు. ఆయన నేడు ఒక వ్యక్తిగా మన ముందులేరు. కానీ.. ఒక శక్తిగా, ఆదర్శంగా, ప్రజల మనోభావాలకు, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా, చిరంజీవిగా ప్రజల హృదయాల్లో వెలుగొందుతున్నారు.
 
కాలమాన పరిస్థితులకు తగ్గ ట్టుగా ప్రజల కోసం పనిచేయ డానికి ముందుకు వచ్చే నాయ కులు తమని తాము పరిస్థితు లకు అనుకూలంగా మరల్చు కుంటారు. ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజల నుండి ప్రజల కొరకు పనిచేసే నాయ కత్వం ఎలా ఉండాలంటే మనకు గుర్తుకు వచ్చేది వైఎస్ రాజకీయ జీవితం. తాను ఏ ప్రజల కోసం పనిచేశాడో... ఆ ప్రజలు ఆయనను తరచూ గుర్తుంచుకోవడం, ఆయన ఉంటే... ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావు అను కోవడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే... ఆయనను తరచూ విమర్శిస్తూ... విభేదించి ఆయనను తమ రాజ కీయ ప్రత్యర్థిగా భావించిన వారు సైతం.. నేడు రాజశేఖ రరెడ్డి బతికుంటే తెలుగునాట పరిస్థితులు ఇలా ఉండేవి కాదని అంగీకరించారు.

 తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ శ్రమించినంతగా మరెవరూ తెలుగునాట శ్రమించలేదు. కొందరు కొన్ని రంగాలలో కృషి చేసి ఉండొచ్చు. కానీ సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలుపరచిన తీరు తన రాజకీయ పరిణతికి, దక్షతకు, అకుంఠిత పట్టుదలకు నిదర్శనాలుగా నిలుస్తాయి. పోల వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోవడా నికి వైఎస్ పట్టుదలే అసలు సిసలు కారణం. ఆ ప్రాజెక్టు అనుమతులు సాధించడంలో వైఎస్ కనబర్చిన ఆసక్తి మరే నాయకుడిలోనూ మనకు కనపడదు. అంతేకాదు పోలవరం కుడికాలువకు 4 వేల కోట్లకు మించి వెచ్చిం చారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలకు భిన్నంగా కృష్ణా డెల్టా రైతాంగం చింతలు తీర్చడానికి పులిచింతల ప్రాజెక్టు చేపట్టి దాదాపు 4 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలు వలు చేపట్టారు. అదే ఒరవడిలో గాలేరు-నగరి, వెలి గొండ ప్రాజెక్టులు ఇటు రాయలసీమ, నెల్లూ రు, ప్రకాశం జిల్లాల అవసరాల కోసం అటు తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, తదితర పథకా లకు వేల కోట్లు కేటాయిం చారు.
 ప్రస్తుతం కేసీఆర్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులన్నీ ఆచరణలోని కి వస్తాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగు, తాగునీటి అవసరా లు తీరతాయి. అవి చేపట్ట కుండా కేసీఆర్ ఆలమూరు ప్రాజెక్టు ఒకటి చేపట్టి వివా దంలోకి వచ్చారు. చంద్రబా బు రూ.2 వేల కోట్లు ఖర్చు పెడి తే హంద్రీనీవా పథకం పూర్తి అవు తుంది. అలాగే గాలేరు-నగరి, వెలి గొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి అవడానికి 4 వేల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక్కడ కరువు ప్రాంతాలకు ఈయన చేయడు. అక్కడ కరువు ప్రాంతాలకు ఆయన పనిచేయడు. ఒకరు పట్టిసీమ... మరొకరు ఆలమూరు ప్రాజెక్టు చేపట్టి ఇరు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు పెంచడా నికి ఆజ్యాలు పోయడానికి ప్రయత్నిస్తున్నారు.

 వైఎస్ తనకు అండగా నిలిచిన లేదా, తనను ఆదు కున్నవారి కోసం శ్రమించారు, తపించారు. ఆయన పోల వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించటమే కాకుం డా, ఆరోగ్యశ్రీ లాంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకా నికి నాంది పలికారు. అలాగే ఆకాశమే హద్దుగా లక్షలాది మంది పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకం అమలు చేశారు.

 వైఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు రద్దు తదితర కార్యక్ర మాలు ప్రకటించారు. ఆయన అధికా రం చేపట్టాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనార్టీల సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, పా వలా వడ్డీ, రైతుల రుణమా ఫీ.. ఒకమాటలో చెప్పాలం టే తెలుగు ప్రజలకు జీవిం చడానికి ఒక ఆశావహ వాతావరణం కల్పించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతుల ఆత్మహ త్యలు, వలసలు, అప్పులు, నిరుద్యోగ సమస్యలు తది తర విధానాలతో శ్మశాన వాతావరణం నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చారు. దేశం లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాల నుండి ఏర్పడ్డ దుష్పరిణామాలను అర్థం చేసుకుని వాటిని ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విధానం అమలు పరిచారు.

 మన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశాల నుండి పెట్టుబడులు, దిగుమతులు, ఎగుమతు లు ఉండాలి. ప్రస్తుతం మన ప్రధాని, ముఖ్యమంత్రి విదే శాలలో పర్యటిస్తూ... మన దేశంలో, రాష్ట్రంలో పెట్టుబ డులు పెట్టండి... షరతులు లేకుండా మీకు అన్ని రకా లైన సౌకర్యాలు కల్పిస్తాం అంటూ... ప్రాధేయ పూర్వ కంగా పర్యటనలు చేయడం గమనిస్తే, రాజశేఖరరెడ్డి లాంటి రాజకీయ నాయకుల నుండి వీరు ఎంతో నేర్చు కోవాల్సి ఉంది. వైఎస్ ఎప్పుడూ విదేశీపర్యటనలు చేయ లేదు. ఆయన విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తు లకు ఎర్రతివాచీలు పరచలేదు. మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న శక్తివంతులైన స్థితిమంతులతోనే ఆయన ఎక్కువగా పనిచేశారు.

 వైఎస్ నేడు ఒక వ్యక్తిగా మనముందు లేడు. ఒక శక్తిగా ఆదర్శంగా ప్రజల మనోభావాలకు, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు చిరునామాగా చిరంజీవిలా వెలుగొందుతూ... తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు. వైఎస్‌ను, వైఎస్ కుటుంబాన్ని వేధిం చడానికి జరిపిన ప్రయత్నాలను తెలుగు ప్రజలు తిప్పికొ ట్టారు. చంద్రబాబు అనేక తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను వంచించి అధికారం చేపట్టారు. ఇచ్చిన వాగ్దా నాలు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, చేనేత రుణమాఫీ, విద్యార్థులకు నిరుద్యోగ భృతి లాంటి వాగ్దా నాలు అమలు పరచడంలో వైఫల్యం చెందారు. ఆయన దృష్టి అంతా రాజధాని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తాను ఒక్కడే నిజాయితీకి పేటెంటునని విపరీతంగా ప్రచారం చేసుకునే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి విభజన చట్టంలోని సెక్షన్-8 గురించి ఆప సోపాలు పడటం చూస్తే మనకు నవ్వు, జాలి కలుగు తాయి.

 నేడు దేశంలో వైఎస్ విధానాలు, పథకాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఆయన కుటుంబంపై అక్రమ కల యికతో జరుగుతున్న రాజకీయ సమీకరణలను అవి కేం ద్రంలో జరిగిన, రాష్ర్టంలో జరిగిన ప్రజలు పసిగడు తున్నారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామా లను ప్రజలు అంతే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ నడిచిన దారిలో పయనించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇరు రాష్ట్రాలలో తెలుగు ప్రజల సర్వ తోముఖాభివృద్ధికి వైఎస్ చూపిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు, వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జయంతి సందర్భంగా తమని తాము ఉన్నతీకరించుకుని వైఎస్ ఆశయాల కోసం నడుంబిగించి పోరాడటమే వైఎస్‌కు మనం అర్పించే నిజమైన నివాళి.
 
http://img.sakshi.net/images/cms/2015-07/81436292306_Unknown.jpg
ఇమామ్
(వ్యాసకర్త కదలిక సంపాదకులు)
 మొబైల్: 99899 04389
 
 

మరిన్ని వార్తలు