‘స్వచ్ఛ భారత్’కు సవరణ అవసరం

15 Nov, 2014 23:25 IST|Sakshi
‘స్వచ్ఛ భారత్’కు సవరణ అవసరం

పరిశుభ్రత విషయంలో ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ప్రధాని నరేంద్ర మోదీ చేసింది సరైందే. అయితే బహిరంగ స్థలాల పరిశుభ్రతపై మాత్రమే దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదన్నది జాతి నేర్చుకోవాల్సిన పాఠం.
 
అవలోకనం
 
మన దేశం మాదిరే, థాయ్‌లాండ్‌లో అనేక కార్లలోని డాష్ బోర్డుల్లో, శుభం కలగడానికి అదృష్టదేవత చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటారు. అయితే థాయ్ కార్లలోని విగ్రహాలు భారత్‌లో లాగా కారు లోపలికి కాకుండా రోడ్డుకు అభిముఖంగా తమ ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ‘నేను సురక్షితంగా ఉం డేలా చూడు’ అనేలా మన ప్రవృత్తి ఉం టుంది. ‘ఎవరూ గాయపడకుండా ఉండేలా రోడ్డును గమనించు’ అన్నది థాయ్ ప్రజల వైఖరి.

థాయ్‌లాండ్ పరిశుభ్రమైన దేశం. సాపేక్షంగా అది పేద దేశమే అయినప్పటికీ (నిజానికి భారత్‌లాగే పేద దేశం) వారి బహిరంగ స్థలాలు పరిశుభ్రంగా ఉంటాయి. నేడు వారి బహిరంగ మరుగు దొడ్లు దాదాపుగా మచ్చలేని విధంగా ఉండటమే కాదు.. యూరోపి యన్ దేశాల కంటే మంచిగా... ఒక్కోసారి వాటికంటే ఉత్తమంగా కూడా ఉంటాయి. బ్యాంకాక్‌లోని వీధులకు, ముంబై, ఢిల్లీ వీధు లకు, అలాగే ఢాకా, లాహోర్, కరాచీ నగరాల్లోని వీధులకు మధ్య కూడా ఏమాత్రం పోలిక ఉండదు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం (అంటే ఆర్థికవ్యవస్థ మాత్రమే కాదు.. ఇప్పటికీ ఆదిమ స్వభావంతో ఉంటున్న నాగరికత, సంస్కృతి కూడా ‘అభివృద్ధి’ చెందవలసి ఉంది). థాయ్‌లాండ్ అభివృద్ధి చెందిన దేశం. దీనికి వారు అనుసరిస్తున్న బౌద్ధ మతంలోని హీనయాన శాఖ కూడా ఒక కారణమని నేనంటాను. దీన్ని తెరవాద అని కూడా పిలుస్తారు. తెరవాద శాఖను పాటిస్తున్న శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, కాంబోడియా, బర్మా వగైరా దేశాలన్నీ ఒకరకమైన ఏకత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రయత్నమైన స్వచ్ఛ భారత్ కార్యక్రమం (క్లీన్ ఇండియా మిషన్) అనే అంశాన్నే నేను ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నాను. ఈ వారం ములాయం సింగ్ యాదవ్ కోడలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. స్వచ్ఛ భారత్‌పై మోదీ వైఖరిని మహాత్మాగాంధీతో ఆమె పోల్చి చూపారు. ఆమెతో నేను ఏకీభవిస్తాను. ప్రధాని ఒక గాంధియన్ తత్వాన్ని ఆచరిస్తున్నారని భావిస్తున్నాను. నిజానికి గాంధీజీ కూడా మోదీ ప్రయత్నాన్ని ఆమోదించేవారు. అయితే మోదీ మనస్సులో ఈ ఆలో చన కొత్తది కాదన్నది వాస్తవం. ఆర్‌ఎస్‌ఎస్ అత్యంత ప్రభావశీల నేత ఎం.ఎస్ గోల్వాల్కర్ జీవిత చరిత్రను రచించిన సందర్భంలో మోదీ ఒక పిట్టకథని జోడించారు.

ఒకసారి గురూజీ (గోల్వాల్కర్) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లా రు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఉదయం 4 గంటల 30 నిమి షాలకు చేరుకుంది. అక్కడ అది 45 నిమిషాలు ఆగింది. ఆ సమ యంలో స్వయంసేవకులు గురూజీ, రైలు లెట్రిన్‌ను ఉపయోగిం చుకునేందుకు ఏర్పాటు చేశారు.

ఆ రాత్రి సీనియర్ స్వయంసేవక్ అయిన బాపూరావ్ మోఘేతో మాట్లాడుతూ ఆ రోజు కార్యక్రమం ఏమిటని గురూజీ అడిగారు. కార్యక్రమ వివరాలను గమనించిన గురూజీ తర్వాత బాపూరావ్‌ని ఒక ప్రశ్న అడిగారు, రైలు టాయ్‌లెట్‌లలో ఒక చిన్న నోటీసున యినా మీరు గమనించారా? చూశానన్నారు బాపూరావు. గురూజీ అప్పుడన్నారు. ‘రైలు ఒక స్టేషన్‌లో ఆగి ఉన్నప్పుడు లెట్రిన్‌ను ఉపయోగించవద్దని అక్కడ రాసి ఉంది. నేను ఈ నిబం దనను అన్ని వేళలా తప్పకుండా పాటిస్తాను’.

ఈ పిట్టకథను ప్రస్తావించిన మోదీ దానికి మరో ప్రశ్నను జోడించారు. ‘ఎన్ని లక్షలమంది ప్రయాణికులు ఈ నోటీసును చూసి ఉంటారో కాస్త ఊహించండి. వాస్తవానికి వీరిలో ఎంతమంది దీన్ని పాటించి ఉంటారు’? స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మోదీ ఒక ప్రతిజ్ఞ రూపొందించారు. దాని ద్వారా ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు.

‘‘నేను ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తున్నాను. పరిశుభ్రతకు నేను కట్టు బడి ఉంటాను. దీనికోసం సమయాన్ని కేటాయిస్తాను. పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి నేను సంవత్సరా నికి 100 గంటలు కేటాయిస్తాను అంటే వారానికి రెండు గంటలన్న మాట. నేను చెత్త వేయను, ఇతరులను వేయనీయను. నేనూ, నా కుటుంబం, నా నివాస ప్రాంతం, నా గ్రామం, నా పనిస్థలం అన్ని చోట్లా పరిశుభ్రత కోసం  ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను’’.

ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే పలు దేశాల్లో అక్కడి పౌరులు చెత్త పారవేసే చర్యలను చేపట్టకపోవడం, ఇతరులు చెత్త పోయడాన్ని అనుమతించకపోవడం వల్లే అది సాధ్యమైందని నా విశ్వాసం. ఈ దృఢవిశ్వాసంతోటే, గ్రామాల్లో, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమ సందేశాన్ని నేను ప్రచారం చేస్తాను. ఈ రోజు నేను స్వీకరిస్తున్న ఈ ప్రతిజ్ఞను స్వీకరించవలసిందిగా వందమంది వ్యక్తులను నేను ప్రోత్సహిస్తాను. పరిశుభ్రత కోసం తమ వంద గంటలను వారు కేటాయించేలా ప్రయత్నాలు చేపడతాను.

ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమైన పని ఏమిటంటే, ఇతరులు కూడా ఈ ప్రతిజ్ఞను స్వీకరించేలా చేయడం, (మోదీ పలువురు సెలబ్రిటీలను ఇలా పురమాయించారు) అలాగే కొన్ని బహిరంగ స్థలాలను శుభ్రపర్చేందుకు సమయాన్ని కేటాయించేటట్లు చేయ డం. భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి చేయవలసిన అనేక పనుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పొందుపర్చింది. ఆ వివరాలు పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

మోదీ అవలంబించిన విధానం పట్ల నాకు కొంత భేదాభిప్రా యం ఉంది. ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ఆయన చేసింది సరైందే. అయితే తర్వాత బహిరంగ స్థలాలను పరిశుభ్రపర్చడంపై దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి.

బహిరంగ స్థలాల్లో చీపుర్లు పట్టి ఫొటోలు తీయడం వెనుక, భారత్‌ను మురికి దేశంగా మారుస్తున్నది ఇతరులే అనే సందేశం వ్యక్తమవుతోంది. దీని నుంచే, ‘కాబట్టి బహిరంగ స్థలాలను పరిశు భ్రం చేయడంలో నేను సహాయం చేయాలి’ అనే భావనవస్తోంది.
 దీన్ని మనం మార్చాలి. ఈసారి విగ్రహం మనవైపే చూస్తుం డాలి కాని రోడ్డుకు అభిముఖంగా కాదు. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదు. ఇది జరిగినట్లయితే, మోదీ ప్రారంభించిన మంచి ప్రయత్నం మరింత ఉత్తమంగా విజయవంతమవుతుంది.

(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)  ఆకార్ పటేల్
 

మరిన్ని వార్తలు