మందిరం దళితులది కాదా?

26 Aug, 2016 01:25 IST|Sakshi
మందిరం దళితులది కాదా?

సందర్భం
కాలగమనంలో మన ధర్మంలో ఏర్పడిన అనేక దురాచారాలను నేడు ఆచరించడం మానేశాం కానీ దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో నేటికీ వ్యతిరేకత ఉండటం విచారకరం.

కాశీలో, శ్రీశైలంలో ఏ కులస్తుడైనా స్వయంగా శివలింగానికి అభి షేకం చేయవచ్చును. తిరుపతిలో, అన్నవరంలో, సింహాచలంలో... ఇలా అన్ని ప్రముఖ దేవాలయాలలో అన్ని కులాల వారికి, షెడ్యూలు కులాల వారికి దేవాలయ ప్రవేశం ఉంది. అయినప్పటికీ దేశంలోని కొన్ని గ్రామాల్లో నేటికీ దేవాలయంలోకి అందరికీ ప్రవేశం లేదు. ఇది హిందూ ధర్మం కాదు. ఇది దురాచారం. గతంలో చేసిన పొరపా టును అర్థం చేసుకుని అన్నికులాల వారికి సమాన గౌరవాన్ని కల్పిస్తూ దేవాలయ ప్రవేశం కల్పిద్దాం అనే సంకల్పంతో సామాజిక సమరసతా వేదిక తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తయింది.


విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో 2014 మే 3న పునర్నిర్మితమైన శ్రీరామ మందిరంలోకి దళితులను రానివ్వలేదు. దీనిపై సామాజిక సమర సతా వేదిక నిజ నిర్ధారణ కమిటీ 29 మే 2014న గ్రామాన్ని దర్శించి నివేదికను ప్రభుత్వ అధికారులకు అందజేసింది. దళితులకు మద్దతుగా జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు 23 జూన్‌ 2014న ధర్నాను నిర్వహించింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం నుంచి అందవలసిన సహా యక చర్యల విషయంలో కృషి చేసి బాధితులకు అండగా నిలిచింది.


ఈ స్ఫూర్తితోటే సమరసతా వేదిక బీజేపీ, వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ లకు చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వా నిస్తూ గ్రామస్తులందరి సహకారంతో గ్రామ దళితుల దేవాలయ ప్రవేశాన్ని దిగ్వి జయంగా పూర్తి చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల సమరసతా సమ్మేళనాన్ని 2016 ఆగస్టు 20న ఘనంగా నిర్వహించింది. ప్రముఖ పండితుడు, సామాజిక సమానతకై ఉద్యమించిన కావ్య కంఠ వాశిష్ట గణపతిముని సందేశ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని సామాజిక సమరసతా వేదిక విజయనగరం జిల్లా శాఖ నిర్వహించింది. శ్రీనివాసానంద స్వామీజీ (అధ్యక్షులు, ఉత్తరాంధ్ర సాధు పరిషత్, ఆనందా శ్రమము, శ్రీకాకుళం జిల్లా) వారి నేతృత్వంలో జక్కువ గ్రామంలోని దళితులు, సభకు ఇతర గ్రామాల నుంచి వచ్చినవారు ఆగస్టు 20న శ్రీరామ మందిరంలో ప్రవేశించి ఎంతో ఆనం దంగా ‘జైశ్రీరాం’ నినాదాలతో శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు.
సామాజిక సమానతకై కృషి చేసిన గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందులు, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్‌ అంబేడ్కర్‌ల విగ్రహాలను కె. శ్యామ్‌ ప్రసాద్‌ (సమరసతా వేదిక, క్షేత్ర కన్వీనర్‌), శ్రీనివాసానంద స్వామి, దూసి రామకృష్ణ (ఆర్‌.ఎస్‌.ఎస్‌. క్షేత్ర కార్య దర్శి), సోము వీర్రాజు (ఎమ్మెల్సీ) ఆవిష్కరించారు. విగ్రహాల నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన సుబ్బా రావు, జగన్మోహనరెడ్డి, విగ్రహాల నిర్మాత హరేంద్రనాథ్‌ ఉడయార్‌లను వేదిక సన్మానించింది. చుట్టు ప్రక్కల ఎనిమిది గ్రామాలకు చెందిన 75 మంది వివిధ కులాలకు చెందినవారు సభకు తరలివచ్చారు. సభానంతరం స్వామీజీతో సహా, ఇతర నాయకులు ఎస్సీ కాలనీలోని కుటుం బాలతో కలసి భోజనం చేశారు. మన ధర్మంలో వర్ణాలలో కాని, కులాలలోకాని హెచ్చు తగ్గులు లేవు. అస్పృశ్యత లేదు. మధ్యకాలంలో కొద్దిమంది స్వార్థ శక్తుల ప్రయత్నాలవల్ల కులాల పేరుతో అసమానతలు, అంటరానితనం ఏర్పడ్డాయి. ఇవి దురాచారాలు. వీటిని తొల గించుకుని బంధు భావంతో ఐకమత్యంగా ఉండాలని సమావేశంలో వక్తలు ప్రసంగించారు.


నాసిక్‌ కాలారామ్‌ దేవాలయంలో దళితుల ప్రవేశం కోసం 1927లో  డాక్టర్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలో సత్యాగ్రహం జరిగింది. నాటి దేవాలయ పూజారి దళితుల ప్రవేశాన్ని అంగీ కరించలేదు. ఆ పూజారి మనుమడు సుధీర్‌ మహారాజ్‌ నాశిక్‌ కాలారామ్‌ 1992లో అదే దేవా లయంలో జరిగిన సభలో పాల్గొంటూ, ‘ఆనాడు మా తాత గారు దేవాలయంలోకి ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వ్యవహరించారు. వారు చేసిన పొరపాటుకు నేను సభాముఖంగా క్షమాపణలు కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ లక్ష్యంతోటే సమరసతా వేదిక రాజకీయాలకు అతీ తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. వివిధ గ్రామాలలో సామాజిక సమానతను నిర్మించటమే ఈ సభా, విగ్రహాల ఆవిష్కరణ ముఖ్య లక్ష్యం, మన జీవితాలకు పరమార్థం.

కె. శ్యామ్‌ప్రసాద్‌
వ్యాసకర్త కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

మరిన్ని వార్తలు