మిగ్గు ఆవిష్కరణ సభ

19 Jun, 2016 23:38 IST|Sakshi

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో- పొన్నాల బాలయ్య కవిత్వ సంపుటి ‘మిగ్గు’ ఆవిష్కరణ సభ జూన్ 26న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి మినీహాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: వరవరరావు. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేశపతి శ్రీనివాస్, జూపాక సుభద్ర, గుండెడప్పు కనకయ్య, పసునూరి రవీందర్, తైదల అంజయ్య పాల్గొంటారు.

 

 సోమనాథ కళాపీఠం పురస్కారాలు
సోమనాథ కళాపీఠం పురస్కారాలను జూన్ 26న పాలకుర్తిలో ప్రదానం చేస్తున్నట్టు సంస్థ గౌరవాధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ తెలియజేస్తున్నారు. పురస్కారాలు: సోమనాథ సాహిత్య పురస్కారం- గుత్తి చంద్రశేఖర్ రెడ్డి, సోమనాథ సామాజిక శోధన పురస్కారం - కాలువ మల్లయ్య, పందిళ్ల రాజయ్య శాస్త్రి శేఖర్‌బాబు స్మారక స్వచ్ఛంద భాషా సేవ పురస్కారం- గుడిమెట్ల చెన్నయ్య, వి.చలపతిరావు ప్రోత్సాహక సాహిత్య పురస్కారం- యల్లంభట్ల నాగయ్య, రాపోలు సోమయ్య స్మారక ప్రతిభా పురస్కారం- లొంక సంపత్, విశేష పురస్కారం- ద్యావనపల్లి సత్యనారాయణ.

 

కవిత్వ నిర్మాణంపై వర్క్‌షాప్
ఫూలే - అంబేడ్కర్ అధ్యయన వేదిక, మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో- కవిత్వ నిర్మాణ పద్ధతులపై ఒక వర్క్‌షాప్ జూన్ 26న ఉదయం 10 నుంచీ లిటిల్ స్కాలర్స్ హైస్కూల్, మెట్టుగూడ, మహబూబ్‌నగర్‌లో జరగనుంది. వక్త: జి.లక్ష్మీనారాయణ. ఆసక్తిగలవారు సంప్రదించాల్సిన ఫోన్ నం: 9492765358

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా