మోదీ దూతకు ‘లంక’ వాత

13 Jan, 2015 00:59 IST|Sakshi
ఏబీకే ప్రసాద్ , సీనియర్ సంపాదకులు

లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ఆహ్వానం మీదనే శ్రీలంక అధ్యక్షుని హోదాలో రాజపక్స ఢిల్లీ వచ్చారు. అంటే శ్రీలంక ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మాసాల ముందు మోదీ నుంచి రాజపక్సకు ఆహ్వానం వెళ్లింది. నడవడికలో, పాలనా నిర్వహణలో, అందుకు సంబంధించిన వ్యూహాలలోని కొన్ని సమాన ధర్మాలు కొందరు పాలకుల మధ్య బాంధవ్యం ఏర్పడేటట్టు చేస్తాయి.
 
చేతిలో కత్తికి రెండువైపులా పదును ఉంటుంది. ఆ కత్తితో పండునూ కోయవచ్చు. దానితోనే మనిషి పీకనూ కోసేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇంతే.  ఇటీవలి కాలంలో ఆసియా ఖండంలోనే ‘ప్రజాస్వామ్య’ దేశాలుగా పదే పదే  చెప్పుకుంటున్న దేశాలలో శ్రీలంక ఒకటి. ఇది మన పొరుగు రాజ్యమే. ఈ దేశానికి రెండుసార్లు అధ్యక్షులుగా ఎన్నికై, వరసగా పదేళ్లు పదవిని నిర్వహించిన వ్యక్తి మహీంద రాజపక్స. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో మూడో దఫా కూడా అదే పీఠం అధిరోహించాలని కుతూహలపడిన రాజ పక్స ఘోరంగా ఓడిపోయారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అభి వృద్ధి’ అని నినాదాలు ఇస్తూనే, ప్రజలను మభ్యపెడు తూనే మానవహక్కులను దారుణంగా అగౌరవ పరిచి నందుకే ఈ ఓటమి. దేశీయ మైనారిటీలైన తమిళులను ఊచకోత కోయించిన నాయకుడు రాజపక్స. నిజానికి శ్రీలంక ప్రభుత్వాలు తమిళులను అంతర్యుద్ధం దిశగా గుంజాయి. రెండు మూడు దశాబ్దాలుగా సైనికదాడు లతో అతలాకుతలం చేశాయి. దీనికి పరాకాష్ట రాజపక్స నిర్వాకం. ఆయనే ఈ పర్యాయం కూడా ఎన్నికలలో గెలుపు తథ్యమని భావించి భంగపడ్డాడు. ఫలితాలు ఎలా ఉన్నా,  ఈ చరిత్రాత్మక ఎన్నికల కోలాహలంలో ఎక్కువమంది దృష్టికి రాకుండా మిగిలి పోయిన ఒక కీలక పరిణామం ఉంది.
 
మైత్రీపాల చరిత్రాత్మక విజయం

రాజపక్సను కాదని లంకవాసులు మైత్రీపాల సిరిసేనకు పట్టం కట్టారు. నిజానికి సిరిసేన రాజపక్స మంత్రివర్గ సభ్యుడే. లంక మంత్రివర్గంలో ఆరోగ్య, నీటిపారుదల, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలను ఆయనే చూశారు. ఆ మధ్య వరకు ఇవే శాఖలను నిర్వహిస్తూ, రాజపక్స సహచరునిగా పనిచేసిన సిరిసేన తమిళ మైనారిటీల ఊచకోతలకు నిరసనగా పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి ఊచకోతతో దేశాన్ని అధోగతికి నెట్టినందుకు నిరసనగానే పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటిం చారు కూడా. ఈ సిరిసేననే ఇప్పుడు పదవి వరించింది. జనవరి 9న ఆయన అధ్యక్షునిగా ప్రమాణం చేశారు.

రాజపక్సకు పాఠం

పాలకులు ఎన్ని తప్పుడు పనులైనా చేయవచ్చు. ప్రజా స్వామ్య వ్యతిరేకులుగా తయారుకావచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల తమకు ఉన్న విశ్వా సాన్ని సడలించుకోరు. ఆ వ్యవస్థను రక్షించుకోవడానికి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు కూడా. ఈ అం శాన్ని ఇటీవలనే భారత్, శ్రీలంకలలో జరిగిన ఎన్నికలు నిరూపించాయి. నాలుగైదు ప్రతిపక్షాలు న్యూడెమా క్రటిక్ ఫ్రంట్‌పేరుతో కూటమిగా ఏర్పడి, శ్రీలంక ఫ్రీడం పార్టీకి చెందిన సిరిసేన నాయకత్వంలో రాజపక్సపై పోరాడి చరిత్రాత్మక విజయం సాధించాయి.
 
రాజపక్స ఓటమికి కంకణం కట్టుకున్న కూటమిలో శ్రీలంక మితవాద రాజకీయపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీతో పాటు, జాతిక హేల ఉరు మాయ జనతా విముక్తి పెరుమున, మార్క్సిస్ట్ పార్టీలు కలిశాయి. జాతీ య మైనారిటీలు తమిళులకు, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర ప్రముఖ పక్షాలు కూడా విపక్ష ఫ్రంట్‌నే సమర్థించాయి. మితిమీరిన విశ్వాసంతో గడువుకు రెండేళ్ల ముందే ఎన్ని కలు ప్రకటించిన రాజపక్స అధికార పీఠాన్ని వదిలి పెట్టడానికి నిజానికి సిద్ధంగా లేరు. దక్షిణాసియా దేశాలలో నియంత పోకడలను కలిగిన నాయకునిగా పేరు పొందిన రాజపక్సను ప్రజలు నిరాకరించారు.
 
ఒకే గూటి పక్షులు

2014 మే నెలలో పూర్తయిన భారత లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రమాణ స్వీకారో త్సవానికి ఆయన ఆహ్వానం మీదనే శ్రీలంక అధ్యక్షుని హోదాలో రాజపక్స ఢిల్లీకి వచ్చారు. అంటే శ్రీలంక ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మాసాల ముందు మోదీ నుంచి రాజపక్సకు ఆహ్వానం వెళ్లింది. నడవడికలో, పాలనా నిర్వహణలో, అందుకు సంబంధించిన వ్యూహా లలోని కొన్ని సమాన ధర్మాలు కొందరు పాలకుల మధ్య బాంధవ్యం ఏర్పడేటట్టు చేస్తాయి.
 
అంతా అనుసరించే సాధారణ, ప్రజాస్వామిక మార్గంలో కాకుండా ప్రజలతో నేరుగా సంబంధాలు, రాజకీయ ప్రచారం ద్వారా కాకుండా సాంకేతిక పరి జ్ఞానం ఆసరాగా పుట్టుకొచ్చిన డిజిటల్ ప్రజాస్వామ్యం వక్రమార్గంలో సృష్టించే వ్యక్తి ఊదర ద్వారా (పర్సనలైజ్డ్ హైప్) ఓటర్లను ప్రలోభ పెట్టడం సులభసాధ్యమేనని ఆ ఎన్నికలు రుజువు చేశాయి. ఆ పంథాలో తొలిసారిగా భారతదేశంలో జరిగిన ఈ ప్రయోగం జయప్రదమైంది కూడా. ఇది వాస్తవం కాకపోతే 2014 సాధారణ ఎన్నికల ఫలితాలు ఆ రీతిలో సాధ్యమయ్యేవి కావు.  ఆ ఎన్ని కలలో భారతీయ ఓటర్లను డిజిటల్ ఊదర ద్వారా ప్రలో భ పెట్టడానికి బైనరీ డిజిట్స్ ఆధారంగా (అంటే 0,1 సంఖ్యలతో) సోషల్ మీడియా నెట్‌వర్క్ పరిధిలో ఈ విచిత్ర ప్రయోగం జరిగింది. దీనితో ఎంతటి దగాకోరు ప్రచారాన్నయినా చేసుకునే వీలుంది. ఓటర్లను మోస గించే అవకాశం ఉంది. ఇదంతా సోషల్ నెట్‌వర్కింగ్ వేదికల ద్వారానే సాగుతుంది. అంటే ఫేస్‌బుక్, వాట్సప్, ట్వీటర్, యూట్యూబ్, లింక్‌డిన్ వగైరా. మొన్నటి ఎన్ని కలలో బీజేపీ విజయానికి మూలాలు ఈ వేదికలే. ఈ వ్యూహంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ అరవింద్ గుప్తా. ఇతడు బీజేపీ ఐటీ విభాగానికి సీఈఓ. ఇలినాయిస్, షికాగో విశ్వవిద్యాలయాలలో పట్టభద్రుడైన గుప్తా, కాన్పూర్ ఐఐటీలో ప్రజ్ఞాపట్టభద్రుడు. మోదీకి అనుకూ లంగా, సోషల్ మీడియా వేదికగా, ఊదర ద్వారా పార్టీ విజయానికి బాటలు వేసినవాడు ఈ గుప్తాయే. ఇలాంటి పరిణామాలను ఊహించే కాబోలు, ‘‘సోషల్ మీడియా, నెట్‌వర్క్ అనేవి దగాకోరు, మోసపూరిత  సాధనం’’ (‘బుల్‌షిట్’) అని 2012లోనే ప్రసిద్ధ అమెరికన్ మీడి యా విమర్శకుడూ, విశ్లేషకుడూ న్యూస్‌వీక్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజెల్స్ టైమ్స్ సీనియర్ రచయిత బీజే మెండెల్సన్ (‘సోషల్ మీడియా ఈజ్ బుల్ షిట్’, న్యూయార్క్ ప్రచురణ) వెల్లడించాడు. సరిగ్గా ఇదే ప్రయోగాన్ని లంక అధ్యక్ష ఎన్నికలలో కూడా జరిపేం దుకు ప్రయత్నం జరిగింది.
 
బెడిసికొట్టిన వ్యూహం

రెండు నెలల్లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నా యని తెలియగానే డిజిటల్ మీడియా ప్రచారంతో రాజ పక్సకు విజయానికి దోహదం చేయడానికి అరవింద్ గుప్తా నవంబర్‌లో కొలంబో వెళ్లాడు! కొలంబో మీడి యా ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘నేను ఏ దేశం ఎందుకు సందర్శిస్తానో ఇతరులకు అనవసరం’ అని (‘హిందూ’, 26-12-2014) గుప్తా తప్పుకున్నాడు.  2009 నాటి లోక్‌సభ ఎన్నికల  పరాజయంతో డిజిటల్ మీడియా, కొత్త వ్యూహరచనలతో ఎన్నికల్లో పరోక్ష విజ యాలకు బీజేపీ ఏతామెత్తింది. ఆ పరోక్ష మార్గానికి కాషా య పార్టీ ఐదేళ్ల నాడే వ్యూహం పన్నింది. ఈ విషయాన్ని గుప్తాయే ఒప్పుకున్నారు! ఈ ప్రయోగం కిందిస్థాయిలో మనిషి ప్రవర్తనను అంచనా వేసుకోడానికి ఉపయోగ పడుతుందని గుప్తా ‘దైనిక సమాచార్’ పత్రికా యాజ మాన్యం‘ఎక్స్చేంజి 4 మీడియా’ పేరిట నిర్వహించిన సదస్సులో (సెప్టెంబర్ 5, 2014) వివరించాడు! ఈ ప్రయోగ లక్ష్యం, మాధ్యమం ఏదైనా అభ్యర్థుల గెలుపే దానికి ముఖ్యం. 2009 ఎన్నికల తర్వాత ‘(బీజేపీకి) దిశా, దశా కోల్పోయాం. పార్టీ సంక్షోభంలో పడింది. అందుకే ముందుగా వ్యూహం పన్నడం ఎంత అవస రమో గుర్తించాం. అప్పుడే విజయ సాధన వ్యూహానికి విత్తనాలు చల్లాం. 2010 లోనే ఇదంతా జరిగింది’ అని గుప్తా చెప్పాడు! దానికి అనుగుణంగానే ఎలక్టొరల్ బూత్‌లను విభజించాం; ఈ బూత్‌లను ఇంటర్నెట్ ద్వారా ఎలా సానుకూలం చేసుకోవాలో అధ్యయనం చేశాం. దానికి తగ్గట్టుగానే 22 లక్షల మంది ఆన్‌లైన్ ప్రచారకులకు వలంటీర్లుగా తర్ఫీదు ఇచ్చాం’ అని చెప్పాడు గుప్తా!
 
సరిగ్గా ఈ పాఠాన్ని శ్రీలంకలో రాజపక్స పార్టీకీ, రాజపక్సకూ బోధించడానికీ బీజేపీ గుప్తాను పంపించి ఉంటుంది! ప్రత్యర్థుల ఇమేజిని మసిపూసి మారేడు కాయ చేయడం కోసం వెబ్‌సైట్‌లు తెరవడం సాఫ్ట్‌వేర్ బోగస్ కంపెనీల పని అని ఐటీ నిపుణులు వెల్లడించా రు. ఐటీ కంపెనీలు లేదా వెబ్‌సైట్ల దుర్వినియోగంతో కోరుకున్న వాడి పాప్యులారిటీ రేటింగ్‌ను ఎంతైనా పెరిగి నట్టు చూపించుకోవచ్చునని నిపుణుల అంచనా! 8 శాతం అభిప్రాయాన్ని 80 శాతం మంది అభిప్రాయంగా బైనరీ డిజిట్స్ మాయాజాలంతో చూపవచ్చునని నిపు ణులు తేల్చారు! ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి కాబోలు! కాని మోదీ దూతగా రాజపక్సకు సాయంగా  వెళ్లిన గుప్తాకు లంకేయుల వాత మాత్రమే మిగిలింది.
 
అన్ని పాజిటివ్ ఓట్లు కాదు

ఏది ఏమైనా, ప్రధాని మోదీ ఇకనైనా భారత-శ్రీలంక స్నేహ సంబంధాల పునరుద్ధరణ శాంతికి దోహదం చేస్తుందని చెప్పడమూ, శ్రీలంక అధ్యక్షునిగా  సిరిసేన కూడా అదే కోరుకోవడమూ శుభసూచకం. ఇందుకు పునాది మాత్రం-భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా చెప్పినట్టు ‘తమిళ జాతీయ మైనారి టీల సమస్యకు తగిన రాజకీయ పరిష్కారం వైపుగా సిరి సేన ప్రభుత్వం శ్రద్ధ వహించడం’. ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఓటర్లు చెప్పే తీర్పులు కొన్ని సందర్భాల్లో ఓట్లుగానే నమోద వుతాయి. కాని ఆ ఓటింగ్‌ను నూతన పాలక పక్షానికి పాజిటివ్ ఓటింగ్‌గా మాత్రం భావించరాదని చరిత్ర పాఠం.
 
(వ్యాసకర్త మొబైల్: 9848318414)

మరిన్ని వార్తలు