తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క్రైస్తవుల కృతజ్ఞతలు

22 Dec, 2014 01:30 IST|Sakshi

నేను తెలంగాణలోని దాదాపు 6 జిల్లాల్లో క్షేత్రస్థాయి లో పని చేశాను. దళిత హక్కుల పరిరక్షణలో భాగం గా తెలంగాణలో చాలా మంది దళిత క్రైస్తవులతో పని చేసే అవకాశం వచ్చింది. క్రైస్తవులలో దాదాపు 90 శాతం మంది దళిత క్రైస్తవులు అ న్ని అవకాశాలకు దూరంగా ఉంటూ అటూ ఎస్సీలుగా కాక ఇటు బీసీలుగా కాక మధ్యస్థంగా ఉన్నారు. అయితే బీసీసీలో ఒక శాతం మాత్రమే రిజర్వే షన్‌తో ఎలాంటి సహాయం లేకుండా దళిత క్రైస్తవు లు ఉన్నారు.

వీరికి స్కాలర్‌షిప్, ఎస్సీ హాస్టల్‌లో అడ్మిషన్ దొరకవు. ఒకే తల్లికి పుట్టిన నర్సింహకు  రిజర్వేషన్ ఉంటే క్రైస్తవత్వం స్వీకరించిన నతానియే లుకు మతం మారినందుకు ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఆగిపోతాయి. గ్రామాల్లో క్రైస్తవ పాస్టర్స్ తక్కువ వేతనానికి పని చేస్తూ కడు పేదరి కాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వారిపై  కొన్ని వర్గాల వారు దాడి చేయ డం గర్హనీయం.

స్వాతం త్య్రం వచ్చినప్పటి నుండి క్రైస్తవులు ఒకే పార్టీకి ఓటు బ్యాంకుగా మిగిలిపోయారే తప్ప  వారికి సమాజం లో ఎలాంటి రక్షణ, సంరక్షణ ఆ పార్టీ ఇవ్వ లేకపో యింది. జనాభాలో క్రైస్తవులు రెండున్నర శాతమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ నిజానికి క్రైస్తవులు 10 శాతం ఉన్నారు. ఎస్సీ సర్టిఫికెట్‌కి భయపడి, మతతత్వ శక్తులకు భయపడి దళిత క్రైస్తవులు తమ ఉనికిని చెప్పుకోవడం లేదు.

దళిత క్రైస్తవులకు భూ పంపిణీ, హైదరాబాద్‌లో క్రైస్తవ భవన నిర్మాణం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ తప్ప మిగ తా అన్ని విషయాల్లో దళిత క్రైస్తవులకు దళితులతో సమానంగా అవకాశం కల్పించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, వారి ప్రభుత్వాన్ని  క్రైస్తవ సమాజం మొత్తం అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుచు న్నది. దళితులతో సమానంగా దళిత క్రైస్తవులకు అవకాశాలను కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞత లు తెలియజేస్తూ నవ తెలంగాణ నిర్మాణానికి ఎప్పటికంటే ఎక్కువగా మా సహకారాన్ని అంద జేస్తూ పని చేస్తామని తెలియజేస్తున్నాము.
 
జ్యోతి నీలయ్య  సామాజిక కార్యకర్త, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు