‘మేధ’ బోనులో నిలబడింది

3 Jun, 2015 00:15 IST|Sakshi
‘మేధ’ బోనులో నిలబడింది

అభిప్రాయం
 
 ప్రజాసంఘాలు తెలంగాణకు కాక, తెరాసకు అనుబంధంగా మారడం మొదలైంది. దీనికి ఆంధ్ర పెట్టుబడి దారుల నుంచి తెరాస నిధులు సమకూర్చి పెట్టింది. అందుకే చాలామంది దీనికి ఎడం పాటించారు.
 
 గతవారం నేనూ, నా పెద్దదిక్కు నిజాం వెంకటేశం సార్ కలిశాం. ‘అరే! ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. తెలంగాణ పది జిల్లాలకు లక్ష కోట్ల బడ్జెట్ అంటే మాట లా?’ అన్నారు వెంకటేశం. ‘పని చేయడం అధికారంలో ఉన్న ప్రభుత్వం విధి’ అన్నా ను. ఈ మాటలో వెటకారం ధ్వనించిం దేమో, ‘ప్రభుత్వాన్నీ, దాని విధానాలనీ సకారాత్మక దృష్టితో చూడాలి!’ అన్నారా యన. నాకు డేనియల్ బెల్ ‘భావజాల అంతం’ (ఎండ్ ఆఫ్ ఐడియా లజీ) వ్యాసం జ్ఞప్తికి వచ్చింది.

 తెలంగాణ ఏర్పడిన ఏడాదిలో ఆలోచనాపరులంతా నిశ్శబ్దం వహించడం సరిగ్గా అందుకేనని అనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్పుడు లెఫ్ట్ పోజుతో కొందరు ప్రభుత్వ కనుసన్నలలో మెలుగుతుంటే, ఒక విప్లవకవి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న ఆ ‘ఇద్దరు’ వామపక్ష రాజకీయాల నుంచి వచ్చినవారేనని సంబరపడ్డారు. బహుళత్వ సమాజం-సంక్షేమరాజ్యం వంటి ఆలోచన లతో రాజ్యం ముందుకు పోతున్నప్పుడు సమాజ అవస రాన్ని మౌలికంగా మార్చవలసిన అవసరం లేదంటాడు బెల్. మేధావులంతా దీనిని అంగీకరించారు కాబట్టే ఐడియా లజీ మరణించింది అని కూడా చెప్పారాయన. ఇక 1848 నాటి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ‘వైద్యులు, న్యాయవాదులు, కవులు, శాస్త్రవేత్తలు, బుద్ధిజీవులను బూర్జువా ప్రభుత్వం కూలికి పనిచేసే నౌకర్లుగా మార్చి వేస్తుంది’ అంటుంది. ఇది ఇప్పటికీ ఇక్కడి బుద్ధిజీవులందరికీ వర్తిస్తుం ది. కొందరు ప్రభుత్వం వైపువెళితే, ఇంకొందరు క్షమించరాని మౌనం లోకి వెళ్లారు. ఇక్కడే ఈ మేధావుల పాత్రపై అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ఉద్యమకాలంలో, తరువాత వర్గం, కులం పనిచేసింది. అం దుకే తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజాసంఘాలు, తరువాతి సం ఘాలు, ఆ నాయకుల ఆచరణ కొద్దిగా పరిశీలిద్దాం.

ప్రత్యేక ఉద్యమం తెరాసతోనే మొదలు కాలేదు. 1990 నాటి నూతన ఆర్థికవిధానాల కింద నలిగిపోయిన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను గురించి నాడే బుద్ధిజీవులు గుర్తించారు. దీనినే 1995లో ఏర్పడిన జనసభ మరింత తీక్షణంగా వెల్లడించింది. దీని వెనుక పీపుల్స్‌వార్ ఉన్నదని ప్రభుత్వాలు దమనకాండకు దిగాయి కూడా. అప్పుడే సీనియర్ తెలంగాణ వాదులు చర్చను లేవదీశారు. ఆ తరువాతే తెరాస ఆవిర్భవించింది. దీనికి జయశంకర్ కట్టె విరగని, పాము చావని భావజాలంతోడైంది. ప్రజాసంఘాలు తెలంగాణకు కాక, తెరాసకు అనుబంధంగా మారడం మొదలైంది. దీనికి ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి తెరాస నిధులు సమకూర్చి పెట్టింది. అందుకే చాలామంది దీనికి ఎడం పాటించారు. అయితే తెరాసలో పలువురు వామపక్షవాదులు చేరడంతో విశ్వసనీయత పెరిగింది. అదే సమయం లో సీట్లు, ఓట్ల రాజకీయంలో ఆరితేరి, తన అధీనంలో నడిచే ప్రజాసం ఘాల నేతలు కాగితం పులులు అనే అంచనాకు తెరాస వచ్చింది. అప్పుడే టీఎన్‌జీ సంఘం, విద్యావంతుల వేదిక పూర్తిగా ఆ పార్టీ కౌగి లిలోకి వెళ్లాయి. చివరికి పూర్తిస్థాయి ఎన్నికల పార్టీగా మారి, సామాజిక సమీకరణ హామీలను విస్మరించింది. పైగా తైనాతీలతో అనుబంధ సంఘాలను నిర్మించింది. తెలంగాణ ఏర్పడి ఏడాది అయింది. దాని విధానాలు మాత్రం గత ప్రభుత్వాలవే. ఆశ్రీత పెట్టుబడి, ఇసుక, గ్రానై ట్, మానవ, సహజవనరుల దోపిడీ వేగం అందుకున్నాయి. దీనిని కప్పిపుచ్చడానికి చెరు వులు, జలహారం, ఆసరా అంటూ ప్రకటనలు ఇస్తున్నది.

తెలంగాణ బుద్ధిజీవులు, ముఖ్యంగా లెఫ్ట్ నుంచి వచ్చిన వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఈ ఏడాది కాలంలో ప్రజాసంఘాల నేతలు ప్రజాబోనులో ముద్దాయిలుగా మిగిలారు. ‘మేధావులు సమాజ మా ర్పులో తమ పాత్ర ఉందనే విషయాన్ని మరచిపోతారు. సంక్షేమ రాజ్యాధికారానికి దగ్గరగా ఉండడమే వారికి ఇష్టం’ అన్న బెల్ మాటలే ఇందుకు సమాధానం. కానీ మేధా వులు తృప్తి పడినంత మాత్రాన మార్పు అవసరం లేదా?

జూకంటి జగన్నాథం
(వ్యాసకర్త అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు)
 మొబైల్: 9441078095
 

 

మరిన్ని వార్తలు