ఉ.అ.న. మూర్తి జ్ఞాపకాలు

3 May, 2015 00:55 IST|Sakshi
యూఏ నరసింహమూర్తి

‘‘ఉపాధ్యాయుల వారు బొత్తిగా పెద్దమనిషి. ఆయన ధారణ నా లాంటి అల్పప్రాణులను భయపెట్టేంత గొప్పది.  నాకు ఆయన ప్రతిభని చూస్తే ఆనందం. ఆయన విద్వత్తుని చూస్తే ఆశ్చర్యం. ఆయన కృషిని చూస్తే భయం. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే ఈర్ష్య. సర్వతోముఖమైన పాండిత్యం ఎలా ఒంగి ఉంటుందో ఉపాధ్యాయుల వారిని చూస్తే అర్థమవుతుంది.
 
 పండితులలో, పరిశోధకులలో అనిత రసాధ్యమైన కృషి చేసినవారు ఉపాధ్యా యుల అప్పల నరసింహమూర్తిగారు. ఆయన ‘కన్యాశుల్కం’ పరిశోధక వ్యాసం తన సునిశిత పరిశీలనకి గొప్ప ఉదాహరణ. డిసెంబర్ 9న ఆయన మిత్రులూ, అభిమానులూ, ఆత్మీ యులూ ఆయనకి సప్తతి ఉత్స వాన్ని జరపాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక సంచికని ప్రచురించాలని ఏర్పా ట్లు చేశారు. కాని ఆ పని జరగలేదు. కారణం-ఊపిరితిత్తులలో నీరు చేరి డిసెంబర్ 2న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన కన్నుమూయడానికి ఆరురోజుల ముందు- నా ఫోన్ మోగిం ది. ‘‘మీ అపార్టుమెంటు దగ్గరే ఉన్నా ను. రమ్మంటే మీ దర్శనం చేసుకుం టాను’’ -ఇవీ ఆయన మాటలు. మాట లో ‘దర్శనం’ ఆయనెంత నిరాడంబరు లో చెప్తుంది. నేనప్పుడు హైదరాబా దులో షూటింగులో ఉన్నాను. మరో ఆరు రోజులకి దుర్వార్త.


 శ్రీరంగం నారాయణబాబు మీద ఆయన రాసిన పరిశోధక గ్రంథాన్ని విజ యనగరంలో నేను ఆవిష్కరించాను. ఆయన అమెరికా వెళ్లినప్పుడు ఆయన రాసిన వ్యాససంపుటి ‘రంగుటద్దాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించాను- సమగ్ర ప్రసంగం చేస్తూ. అందులో నా ‘లిజీలు మీద చక్కని వ్యాసం రాశారని అప్పటికి కాని నాకు తెలియలేదు. ఆయన ఆ మధ్య అమెరికా మొదటిసారిగా వెళ్లిన ప్పుడు అక్కడి తెలుగు మిత్రులకు ఆయన సమాచారాన్ని ఇచ్చి- హ్యూ స్టన్, డల్లాస్, కాలిఫోర్నియా వంటి చోట్ల సభలు పెట్టించాను. వారి ఉప న్యాసాలు విని తెలుగు మిత్రులు చాలా ఆనందించారు.
 సప్తతి సంచికకి నేను రాసిన నాలు గు మాటలూ ఇప్పుడు తలుచుకోవడం సమంజసం.
 ‘‘ఉపాధ్యాయుల వారు బొత్తిగా పెద్దమనిషి. ఆయన ధారణ నాలాంటి అల్పప్రాణులను భయపెట్టేంత గొప్ప ది. ఆయన విమర్శ-ఎంత చిన్నవాడి నైనా చెయ్యి పట్టుకు నడిపించేంత ఉదా త్తమైనది. ఆయన చేసే కృషి అనూ హ్యం. ఆరోగ్యపరంగా, దృష్టిపరంగా ఆయనకున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఆయన సాహితీరంగానికి చేస్తున్న సేవ అనితర సాధ్యమయితే- ఆ సేవలో అర్ధాంగిగా సగభాగాన్ని నిర్దుష్టంగా పంచుకుంటున్న ఆయన శ్రీమతి సేవా అంతే అనితరసాధ్యం.


 నాకు తెలిసి ఉపాధ్యాయులవారు అజాతశత్రువు. నేను మనస్సుతో మను షుల్ని దగ్గర చేసుకుని నోటితో వారిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఆయన చూపు ఆరోగ్యకరమైనదీ, ప్రతి అంశంలోనూ ఉదాత్తమైన కోణాన్ని పరిశీలించేదీను. చాలామందికి ఆయన సాధించినన్ని డిగ్రీలు సాధించడం సులువు. కాని వాటితో ఆయన సాధిం చినన్ని ప్రయోజనాలను సాధించడం అసాధ్యం.
 నా జీవితంలో చాలా ఆలస్యంగా పరిచయమైన వ్యక్తి ఉపాధ్యాయుల వారు. ఆయన స్థానంలో నేనుంటే అలా పరిచయం చేసుకోవడానికి నా దిక్కు మాలిన ఇగో అడ్డువచ్చేది. ముందు రోజు అజోవిభో పండిత పురస్కారాన్ని అందుకుని, మర్నాడు అజోవిభో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోబో తున్న నా గదికి వచ్చి  ఆర్ద్రంగా పలక రించారు. ఆనాడు సహృదయతతో మెడలో దండ వేశారు. మంచిని గౌర వించడానికి ఆయన తన చుట్టూ తెరలు దించుకోరు.


 నాకు ఆయన ప్రతిభని చూస్తే ఆనందం. ఆయన విద్వత్తుని చూస్తే ఆశ్చర్యం. ఆయన కృషిని చూస్తే భయం. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే ఈర్ష్య. సర్వతోముఖమైన పాండిత్యం ఎలా ఒంగి ఉంటుందో ఉపాధ్యాయు లవారిని చూస్తే అర్థమవుతుంది.
 ఈ డెబ్బయ్యోపడి ఆయనకి మరింత నిండుదనాన్ని, గాంభీర్యాన్ని సంతరిస్తుంది. ఆ దంపతులు ఇలాగే ఆనందంగా పదికాలాలపాటు జీవనం సాగించాలని మనసారా కోరుకుం టున్నాను’’.
 
 ఈ ఆఖరివాక్యం ఎంత దురాశో విధి వెక్కిరించి నిర్దేశించినట్టనిపిం చింది.


 కొన్ని వైభవాలు జీవితంలో కలసి రావు. నా జాతకాన్ని రాసిన ప్రముఖ జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మ గారు ఓ ఉదాహరణ చెప్పేవారు. తండ్రి రైతు. పొలం దున్నుకుని సాదాసీదా జీవితాన్ని గడిపే మనిషి. అతని కొడుకు అమెరికాలో పెద్ద చదువులు చదివి కోట్లు గడిస్తున్నాడు, తండ్రిని వచ్చి తనతో ఉండమని బలవంతం చేస్తు న్నాడు. తండ్రికి దేశం వదిలి వెళ్లాలని లేదు. అయినా తప్పులేదు. కాని తండ్రి జాతకంలో గొప్ప వైభవాన్ని అను భవించే యోగ్యత లేదు. కాని జాతకం లో కలసిరాని వైభవం నెత్తిన పడబో తోంది. అప్పుడేమవుతుంది? మారకం వస్తుందట. తండ్రి అక్కడికి వెళ్లడు. వెళ్లడానికి వేళ మించిపోతుంది. అంతే.


 ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తిగారికి సప్తతి ఉత్సవం జరిగే అవ కాశం లేదు. ఏతావాతా ఉత్సవం జర గలేదు. సంచిక ముద్రణ కాలేదు. ఓ సత్కార్యం కలసిరాకపోవడం ఆయన ఆత్మీయుల దురదృష్టం. ఆయన నిష్ర్క మణ సాహిత్య పరిశోధనలో ఓ సంత కానికి క్రూరమైన ముగింపు.
 
 -గొల్లపూడి మారుతీరావు


 

మరిన్ని వార్తలు