వండిపెడుతూ చదువుకున్న వట్టికోట

30 Jan, 2017 00:12 IST|Sakshi
వండిపెడుతూ చదువుకున్న వట్టికోట

వట్టికోట ఆళ్వారుస్వామి(1915)లో నల్లగొండ జిల్లా చెరువుమాదారం గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయాడు. మూడు శాతం అక్షరాస్యత మాత్రమే వున్న ఆ కాలంలో ఒక ఉపాధ్యాయునికి వండిపెడుతూ క్రమంగా అక్షరజ్ఞానం సంపాదించారు. చదువు నేర్చుకోవటానికే విజయవాడ వెల్‌కమ్‌ హోటల్‌లో సర్వర్‌గా పనిచేశారు. పదిహేను రూపాయల నెలజీతంలో సగం వెచ్చించి ఒక ట్యూషన్‌ మాష్టారు దగ్గర ఇంగ్లీష్‌ నేర్చుకున్నారు.

1938లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, కాళోజీ వంటి గొప్ప రచయితలతో జ్ఞానదాయకమైన పుస్తకాలు రాయించారు. వాటిని ప్రచురించి, స్వయంగా ఊరూరు తిరుగుతూ సామాన్యులకు పుస్తకాలను అందించారు.  నిజాం నిరంకుశపు రోజుల్లో సుమారు 40 పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేయటం చిన్న విషయం కాదు.
సేకరణ: అమ్మంగి వేణుగోపాల్‌
9441054637

మరిన్ని వార్తలు