రాజధానిగా బెజవాడే బెస్ట్

18 Jul, 2014 00:11 IST|Sakshi
రాజధానిగా బెజవాడే బెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి అన్నింటికంటే ముఖ్యమైనది కొదవలేనంత నీటి నిల్వ. విజయవాడలో అంతర్జాతీయ స్థాయి విస్తరణ పనులు జరుగుతున్న గన్నవరం విమానాశ్రయం ఉంది. గంట ప్రయాణ దూరంలోనే బందరు పోర్టు, నిర్మించబోయే నిజాంపట్నం పోర్టు ఉన్నాయి.
 
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరికివారు తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తమ వాదనలకు మద్దతుగా తమతమ కారణాలు చెబుతున్నారు. వెనక బడిన తమ ప్రాంతం రాజధాని అయితేనైనా అభివృద్ధి అవు తుందని కొందరు అంటున్నారు. విభజనను సెంటిమెంట్ గా చూసినవారు రాజధాని ఏర్పాటునూ అలాగే చూస్తు న్నారు. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, తమతో పాటు మిగతా ప్రాంతాల వారి ప్రయోజనాలపరంగా చూడటం లేదు. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ప్రతి ప్రాంతం, ప్రతి పట్టణమూ పలు విషయాల్లో తమవైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అయితే ఆ ప్రత్యేకతలు వేరు, రాజధానికి చూడాల్సిన ప్రాధాన్యాలు వేరు.
 
ఇప్పటికే బహుముఖంగా అభివృద్ధి చెందిన విశాఖ పట్నం నగరాన్ని రాజధానిగా ఉత్తరాంధ్ర వారు కోరుతుం డగా, రాయలసీమవాసులు గతంలో రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేసినందుకు మళ్లీ అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఇంకొందరు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి బెటరని అంటున్నారు. వాస్తవానికి విశా ఖకు రాజధాని స్థాయి హోదా ఇప్పటికే ఉంది.
 
కానీ రాష్ట్రానికి ఓ పక్కనున్న ఈ నగరం దక్షిణాంధ్ర, రాయలసీమవాసులకు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం. సామాన్యుల రాకపోక లకు అంత అనువుగా ఉండదు. పైగా నీటి సమస్యా ఉంది. ఇక కర్నూలు, తిరుపతి పట్టణాలు కూడా ఓ మూలగానే ఉన్నాయి. తిరుపతిపై ఇప్పటికే నిత్యం యాత్రికుల ఒత్తిడి ఉంది. కర్నూలుకు తుంగభద్ర వరద ముప్పు ఉంది. రాయ లసీమకు, కోస్తాంధ్రకు మధ్య ప్రాంతంలో ఖాళీ భూములు సేకరించి రాజధాని నిర్మించాలని మరికొందరంటున్నారు.
 
వీరు రాజధాని అనగానే ‘ఒక కొత్త నగర నిర్మాణం’గా భావి స్తున్నారు. లక్ష ఎకరాల భూమిని సేకరించాలంటున్నారు. ఇందుకోసం భూమి లభ్యత, నీటిప్రాజెక్టులు ఉన్న అటవీ ప్రాంతాన్ని డీ నోటిఫై చేయాలంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లాలోని దొనకొండ, గుంటూరు జిల్లాలోని నాగార్జునసా గర్, పులిచింతలవంటి అటవీ ప్రాంతాలను సూచిస్తున్నారు. ఈ నగర నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావాలంటు న్నారు. ఈ ప్రతిపాదనలేమి శాస్త్రీయం కావు. ఆచరణాత్మకం కావు. కొత్త సమస్యలు పుట్టించేవి. అనవసర ఆర్థిక భారం మోపేవి. అయినా ఈ కొత్త నగరానికి హైవేలను, రైల్వే మార్గాలను మళ్లించగలమా?
 
వాస్తవికంగా ఆలోచిస్తే రాజధానికి కేవలం వెయ్యి - రెండు వేల ఎకరాల భూమి చాలు. అసలు రాజధాని అంటే ఏమిటి? అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, డీజీపీ ఆఫీస్, సిబ్బంది క్వార్టర్లు వంటి పాలక సదుపాయాలు, సభలు సమావేశాల కోసం ఐదారు పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, బహిరంగ సభలు, ప్రజా వేదికల కోసం నాలుగైదు పెద్ద మైదానాలు. ఇంతే! ఇవి కాక ఉండాల్సినవి అంతర్గత రవా ణా వ్యవస్థ, జిల్లాల నుంచి రాకపోకలకు రవాణా మార్గాలు, ప్రపంచస్థాయి నాయకులు, పెట్టుబడిదారులు వస్తారు కాబ ట్టి ఆ స్థాయి వసతులు అదనంగా ఉండాలి. రాజధాని నగరా నికి ప్రథమ ప్రాతిపదిక రాష్ట్రంలోని అన్ని వైపులకూ సమాన దూరంలో, విస్తృత రవాణా మార్గాలతో అందుబాటులో ఉం డటం. రాజధాని అంటే కేవలం రాష్ట్ర పరిపాలనా కేంద్రం మాత్రమే. ఆ విధంగా చూసినప్పుడు అనువైన పెద్ద నగరం విజయవాడ. ఇక్కడ రవాణా మార్గాల సౌలభ్యం కూడా ఎక్కువ. అత్యధిక రైల్వేలైన్లు, అత్యధిక జాతీయ రహదారు లున్నాయి. దేశంలోనే రెండో పెద్ద అంతర్రాష్ట్ర జల రవా ణాకు సైతం ఇది కూడలి. ఇటు ఇచ్చాపురంలోని, అటు తడ-కుప్పంలోని పేదలు కేవలం రూ.100 తో ప్యాసింజర్ రైలులో రాజధానికి చేరుకోవచ్చు.
 
అన్నింటికంటే ముఖ్యమై నది కొదవ లేనంత నీటి నిల్వ. అంతర్జాతీయ స్థాయి విస్త రణ పనులు జరుగుతున్న గన్నవరం విమానాశ్రయం ఉంది. గంట ప్రయాణ దూరంలోనే బందరు పోర్టు, నిర్మించబోయే నిజాంపట్నం పోర్టు ఉన్నాయి. ‘రాజధాని భవనాల’ నిర్మా ణాల కోసం సుమారు 12 వేల ఎకరాల వరకు భూములు న్నాయి. ఈ ప్రాధాన్యాల రీత్యా 1950లో, 1956లో రాజధా నిగా అనుకున్న తొలిప్రాంతం ఇదే! విజయవాడలో ఐటీ పరి శ్రమలు, విద్యా కేంద్రాలు ఉంటే చాలు. పారిశ్రామిక మౌలిక వసతులు, పరిశ్రమలనూ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ ఏర్పాటు చేస్తే అవి రాజధానితో సమానంగా అభివృద్ధవు తాయి. పల్లెల నుంచి నగరాలకు వలసలు జరగకుండా పల్లెలే క్రమంగా నగరీకరణ చెందుతాయి.
 -టి. కొండబాబు, సీనియర్ జర్నలిస్ట్

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా