దారితప్పుతున్న సంక్షేమం

11 Sep, 2015 01:08 IST|Sakshi

చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్టు, పేదల కోసం ప్రవేశపెట్టే పథకాలు కలిగిన వారికి కల్పవృక్షాలై అలరారుతు న్నాయి. ఏ ప్రభుత్వమైనా ఈ అంశాన్ని గుర్తించాలి. పథకం లబ్ధిదారులకు చేరుతున్నదా లేదా అని గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో  స్త్రీనిధి బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కలగ జేసే సౌకర్యాలు లక్షిత వర్గాలకు చేరడం లేదు. ఇవి ఉన్నత వర్గాల మహిళల పరమవుతున్నాయి. మహిళా స్వయం సహా యక గ్రూపులలో కూడా లక్షాధికారులైన మహిళలు సభ్య త్వం కలిగి ఉంటున్నారు.

వ్యాపార వర్గాల కుటుంబాల నుంచీ, భూస్వాముల కుటుంబాల నుంచీ వచ్చిన మహి ళలు కొద్దిమంది పేద మహిళలను కలుపుకుని సంఘా లుగా ఏర్పడి ప్రజాధనాన్ని పక్కదారులు పట్టిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని మోసగించడమే. దీనితో పేద మహిళలకు రుణాలు అందని ద్రాక్షలుగా ఉండిపోతున్నాయి. పైవర్గాల మహిళలు రుణాలను దక్కించుకుంటే, వాటిని ఇతర కుటుంబ సభ్యులు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళా సంఘాలను క్షాళన చేసి, నిజమైన పేద మహిళలకు లబ్ధి చేకూరే విధంగా వాటి స్వరూపం మార్చాలని వినతి.
 ముర్కి రామచంద్రం  కోహెడ, కరీంనగర్ జిల్లా
 

మరిన్ని వార్తలు