రైలు ఢీకొని యువకుడు మృతి

4 Sep, 2018 16:48 IST|Sakshi
గంగాధర్‌

ఇచ్ఛాపురం రూరల్‌ శ్రీకాకుళం : మండలంలో లొద్దపుట్టి గ్రామానికి చెందిన వ్యక్తిని గూడ్స్‌ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లొద్దపుట్టి గ్రామానికి చెందిన మానసిక వ్యాధితో బాధపడుతున్న పెదిన గంగాధర్‌(42) శనివారం సాయంత్రం పక్క గ్రామమైన జగన్నాథపురం వెళ్లాడు. చీకటి పడటంతో రైలు పట్టాలు దాటుకుంటూ వస్తుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు ఇతడిని ఢీకొనడంతో పాటు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది.

విషయం తెలియని కుటుంబ సభ్యులు రాత్రంతా చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం రైలు పట్టాల పక్కన ఎవరిదో మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా గుర్తుపట్టలేని విధంగా గంగాధర్‌ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామం విషాదంలో మునగిపోయింది. మృతుడికి భార్య జానకమ్మతో పాటు కుమారులు దివాకర్, హరీష్‌ ఉన్నారు.  
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటి నుంచి వెళ్లి.. అడవిలో శవమై..

మోదీ హెలికాప్టర్‌లో ఏముంది?

కూతురు ముందే భార్య గొంతు కొసేశాడు

ఓ అద్దె ఇంటిలో అసాంఘిక కార్యకలాపాలు..

త‘స్మార్ట్‌’ జాగ్రత్త

బీజేపీలో బీజేడీ మాజీ ఎంపీ

పుల్ల ఐస్‌లో ఇనుప మేకు !

మామను చంపిన కోడలు

శ్రద్ధగా యోగా చేస్తున్నాడు.. ఇంతలో..

నమ్మించి మోసం

నువ్వు లేక నేను లేను అన్నాడు.. కానీ!

వైద్యురాలి అనుమానాస్పద మృతి

బ్రేక్‌ ఫెయిల్‌ పెళ్లి బస్సు బోల్తా

ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం

210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం

ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష

ఆదివాసీ బాలికలపై అకృత్యాలు..

నడిరోడ్డుపై మహిళల సిగపట్లు

పట్నాయక్‌ ఒంటరి పోరాటం ఎందుకు?

వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు యువతులు

నన్ను అనుమానించావు.. ఇక సెలవు

ఒడిశా బాలికపై ఇద్దరు అత్యాచారం

నటి నికిత ఆకస్మిక మృతి

ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. ఇందిరా నందో ప్రవేశం..?

పూరీ జగన్నాథ ఆలయంలో కేసీఆర్‌ పూజలు

‘దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తాం’

భువనేశ్వర్‌ చేరుకున్న కేసీఆర్‌

మహిళ ప్రాణం తీసిన అంబులెన్స్‌ డ్రైవర్‌ బేరం

సీఎంతో కలిసి మ్యాచ్‌ వీక్షించిన మాజీ నక్సల్స్‌

అతనో కదిలే చెత్తకుప్ప!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జెర్సీ’ మూవీ రివ్యూ

‘నా గుండె ముక్కలైంది..మానవత్వం ఎక్కడుంది?’

అందుకే భార్య షూ లేసులు కట్టాడేమో?!

జెర్సీ టీంపై జూ. ఎన్టీఆర్‌ ట్వీట్‌

‘ఎవరెస్ట్‌ అంచున’ ఇరగదీసిన పూజా హెగ్డే

‘భారీ బడ్జెట్‌ చిత్రం.. మా ప్రేక్షకులకు నచ్చలేదు’