పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

7 Aug, 2019 10:39 IST|Sakshi

పలు రైళ్లు రద్దు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా దోయికళ్ళు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురిసిన భారీవర్షాలతో  వరద నీటికి పట్టాలు ధ్వంసం అవ్వడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పలు రైళ్ల రద్దు చేస్తున్నట్టు  రైల్వే అధికారులు తెలిపారు. ఎనిమిది రైళ్లు రద్దు కాగా మరో ఐదు రైళ్లను దారిమళ్లిస్తూ అధికారులు ప్రకటించారు.  రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. 

రద్దయిన  రైళ్లు వివరాలు : 
1) సంబల్పూర్- కొరపుట్ ప్యాసింజర్
2) కొరపుట్-సంబల్పూర్ ప్యాసింజర్
3) సంబల్పూర్-జనఘర్ రోడ్ ప్యాసింజర్
4) జనఘర్-సంబల్పూర్ ప్యాసింజర్
5)రాజఘన్పూర్-విశాఖ ప్యాసింజర్
6)విశాఖ-రాజఘన్పూర్ ప్యాసింజర్
7)సంబల్పూర్-రాయగడ ఎక్స్‌ప్రెస్‌
8) రాయగడ-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌

దారి మళ్లించిన రైళ్ల వివరాలు : 
1) పూరి _అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌
2)అహ్మదాబాద్ -పూరి ఎక్స్‌ప్రెస్‌
3)బెంగళూరు-హతియా ఎక్స్‌ప్రెస్‌
4) ధనబాద్-అలప్పి ఎక్స్‌ప్రెస్‌
5) విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌

వీటితోపాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
 

మరిన్ని వార్తలు