రూ. 20 వేల స్థాయికి బంగారం ధరల పతనం?

31 Jul, 2015 14:56 IST|Sakshi
రూ. 20 వేల స్థాయికి బంగారం ధరల పతనం?

బంగారం నేలచూపులు చూస్తోంది. ఐదేళ్ల క్రితం ఉన్న రేటుకు ఇది పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే, పది గ్రాముల బంగారం ధర రూ. 20,500 వరకు రావచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. ఈ సంవత్సరం చివర్లో ఫెడరల్ రిజర్వ్ రేటు పెంచితేనే ఇదంతా సాధ్యమవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది.

అమెరికా రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే పది గ్రాముల బంగారం ధర తప్పకుండా రూ. 20,500 స్థాయికి చేరొచ్చని రేటింగ్ సంస్థ చెబుతోంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర ఔన్సుకు 900-1500 డాలర్ల మధ్య స్థాయికి పడిపోతాయని అంటున్నారు. అంతర్జాతీయ వృద్ధిలో అనిశ్చితి తగ్గేవరకు ఈ పతనం తప్పదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద బంగారానికి ఉన్న డిమాండులో దాదాపు సగం వరకు భారత్, చైనాలలోనే ఉంది. 2011-12 స్థాయికి మళ్లీ ఈ దేశాల్లో కొనుగోళ్లు వెళ్తాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు