‘కెవ్వుకేక’ ఆడియో విడుదల

3 Jul, 2013 10:48 IST|Sakshi

Kevu Keka Audio Release‘‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ రియల్ హీరో ఉంటాడు. నాకు మా నాన్న రియల్ హీరో. ఇప్పుడు ఆయన లేరు. మా అమ్మ, మా అన్నయ్య ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ చేయి నాకు బాగా కలిసొస్తుంది. ఆమె చేతుల ద్వారా విడుదలైన ఈ ‘కెవ్వుకేక’ పాటలు పెద్ద హిట్ అవ్వడం ఖాయం’’ అని నమ్మకం వ్యక్తం చేశారు అల్లరి నరేష్.

Kevu Keka Audio Releaseఆయన కథానాయకునిగా దేవిప్రసాద్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘కెవ్వుకేక’. షర్మిలా మాండ్రే కథానాయిక. చిన్నిచరణ్, భీమ్స్ కలిసి సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

అల్లరి నరేష్ తల్లిగారైన సరస్వతి ఆడియో సీడీని ఆవిష్కరించి ఆర్యన్ రాజేష్ దంపతులకు అందించారు.

Kevu Keka Audio Releaseదేవిప్రసాద్ మాట్లాడుతూ -‘‘రెండు గంటలపాటు అందరినీ అలరించే సినిమా ఇది. అల్లరి నరేష్‌తో గతంలో  నేను చేసిన ‘బ్లేడ్‌బాబ్జీ’ చిత్రాన్ని మించేలా ఈ సినిమా ఉంటుంది. చిన్నిచరణ్, భీమ్స్ శ్రావ్యమైన స్వరాలందించారు’’ అని చెప్పారు.

Kevu Keka Audio Releaseడా.డి.రామానాయుడు, బి.గోపాల్, శ్రీకాంత్, శ్రీహరి, పోసాని కృష్ణమురళి, భీమినేని శ్రీనివాసరావు, కె.ఎల్.దామోదరప్రసాద్, నాని, ఉదయ్‌కిరణ్, ఆది పినిశెట్టి, ప్రిన్స్, శశాంక్, శివబాలాజీ, షినా, మధుశాలిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Kevu Keka Audio Release

Read latest Photo-gallery News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు