అభిమానుల మధ్య ప్రభుదేవా ,షాహిద్ కపూర్

10 Dec, 2013 12:21 IST|Sakshi

నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘రాంబో రాజ్ కుమార్’. ప్రభుదేవా-షాహిద్ కపూర్ లు ముంబై థియేటర్లలో అభిమానుల మధ్య సందడి చేసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుదేవా.. బాలీవుడ్ లోని కొత్త తరహా నృత్యానికి దక్షిణాది వారు స్పూర్తిగా నిలిచారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తరహా డ్యాన్స్ లకు కొదవ ఉండదన్నారు. రాంబో రాజ్ కుమార్ తొలి రెండు రోజుల్లో భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు 10 కోట్లు , రెండవ రోజు 8 కోట్లు సేకరించింది.

మరిన్ని వార్తలు