రగిలిపోతున్న సీమాంధ్ర

6 Dec, 2013 13:40 IST|Sakshi

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర జిల్లాల ప్రజలు రగిలిపోతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బంద్ పాటిస్తున్నారు. విద్యర్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు.

రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లోని 13 జిల్లాల్లో బంద్ ఉధృతంగా జరుగుతోంది. విద్యా సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీస్ బస్సులను ఎక్కడిక్కడ నిలిపివేశారు. రహదారులను దిగ్భంధించారు. ప్రజలు స్వచ్ఛంధంగా తరలివచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సీమాంధ్రకు అదనపు బలగాలను తరలించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న బంద్ దృశ్యాలు..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో విద్యార్థినుల ఆగ్రహం

తిరుపతి పట్టణంలో భద్రత బలగాల కవాతు

అనంతపురంలో దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భద్రత

కడపలో బంద్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

కడపలో ఆపేసిన ఆర్టీసీ బస్సులు

గుంటూరులో రోడ్డుపై బైఠాయించిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

నిర్మానుషంగా ఉన్న గుంటూరు బస్టాండు

 నెల్లూరు నగరంలో బంద్ దృశ్యం

నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీ

ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

ఒంగోలు బస్టాండ్లో నిర్మానుష వాతావరణం

మరిన్ని వార్తలు